Operation Sindoor: ఇట్స్ అఫిషియల్.. ఆపరేషన్ సిందూర్ మూవీ.. రిలీజ్ ఎప్పుడంటే?

Operation Sindoor: జమ్మూకశ్మీర్ పహల్గంలో ఏప్రిల్ 22వ తేదీన దాడులకు పాల్పడ్డారు. ఈ ఉగ్రదాడుల్లో 28 మంది టూరిస్ట్‌లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులు, భాగస్వాములతో వెళ్లిన వారు ఉగ్రవాదులకు బలి అయ్యారు. ఈ ఉగ్రదాడుల్లో కేవలం హిందువులనే టార్గెట్ చేసి హతం చేశారు. ఉగ్రవాదులు పక్కా ప్లానింగ్‌తో మతం ఏదని అడిగి మరి చంపారు. ఈ ఘటన యావత్ భారత్‌ను కలచి వేసింది. ఈ ఉగ్రదాడి ఘటనను ప్రపంచం మొత్తం కూడా ఖండించింది. ఈ ఉగ్రదాడి తర్వాత ప్రపంచ దేశాలు భారత్‌కు సపోర్ట్‌గా నిలిచాయి. అయితే భారత్ పాక్‌తో అన్ని సంబంధాలు తెంచుకుంది. ఆఖరికి సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఆ తర్వాత అన్ని ఎగుమతులు కూడా ఆపేసింది. ఈ ఉగ్రదాడికి ఎలాగైన ప్రతీకారం తీర్చుకుంటామని భారత్ తెలిపింది. చెప్పినట్లుగానే అందరూ నిద్రపోతున్న సమయంలో భారత్ పాక్‌పై ఆపరేషన్ సింధూర్ పేరుతో వైమానిక దాడులు చేసింది.
సరిహద్దు నుంచి 200 కి.మీ వరకు ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసి దాడులు చేసింది. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఈ ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌పై భారత్ విరుచుకుపడింది. అమాయకులను దారుణంగా చంపినందుకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఈ ఘటనను ఆధారంగా చేసుకుని సినిమా తీయనున్నట్లు దర్శకుడు ఉత్తమ్ నితిన్ తెలిపాడు. నిక్కీ విక్కీ భగ్నానీ ఫిల్మ్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ క్రమంలో సినిమా పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. త్వరలోనే సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. అయితే సినిమా ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఆపరేషన్ సిందూర్ పేరుతోనే ఉత్తమ్ నితిన్ సినిమా తీయబోతున్నాడు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో దీనికి విశేష స్పందన వచ్చింది. ఓ మహిళా సైనికురాలు నుదుటిపై ఎర్రని సింధూరం పెట్టుకుంటున్నట్లు.. కళ్లలో కాంతి.. చేతిలో గన్ ఉంది. దీనికి బ్యా్క్‌గ్రౌండ్‌లో యుద్ధ విమానాలు ఎగురుతున్న ఫొటో కనిపిస్తుంది. ఇది చాలా సున్నితమైన ఘటన. దీన్ని చాలా స్పష్టంగా డైరెక్టర్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పాక్ ఎలా దాడికి పాల్పడింది? ఆ తర్వాత భారత్ ఎలా దానికి ప్రతీకారం తీర్చుకుంది? అసలు దాడి సమయంలో ఏం జరిగింది? ఆపరేషన్ సిందూర్ ఏంటి? ఈ పేరు ఎందుకు సెలక్ట్ చేసుకుంది? ఇలా అన్ని కూడా ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు. ఈ సినిమా పోస్టర్ కూడా బాగుందని, తర్వలోనే సినిమా రిలీజ్ అయితే బాగుండని కొందరు అంటున్నారు. మరికొందరు ఇది చాలా సున్నితమైన అంశం అని, చాలా జాగ్రత్తగా సినిమా తీయాలని సూచనలు చేశారు.
-
Pakistan: అంతర్జాతీయ మీడియా పరువు తీసుకున్న పాక్.. వీడియో వైరల్
-
Operation Sindoor: ఇప్పటి వరకు పాక్‌పై భారత్ చేపట్టిన మిలిటరీ ఆపరేషన్స్ ఇవే
-
Operation Sindoor: పాకిస్తాన్, పీఓకేలో కీలక ఉగ్రవాద స్థావరాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?
-
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. జైషే చీఫ్ మసూద్ అజార్ ఎవరు?
-
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్.. ఐపీఎల్‌కి ఆటంకమా!
-
Operation Sindoor: పాక్‌లో మొదలైన యుద్ధ భయం.. ఆపరేషన్ సిందూర్ ఎఫెక్టేనా?