Pahalgam Attack: పాక్‌కు నీళ్లు ఆపితే.. భారత్‌కు లాభమా? నష్టమా?

Pahalgam Attack: జమ్మూకశ్మీర్ పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందారు. దీంతో ఇండియా పాకిస్థాన్‌తో ఉన్న అనుబంధాలను పూర్తిగా తెంచుకోవాలని భావించింది. ఈ క్రమంలో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది. ఎన్నో దశాబ్దాల కిందటి ఒప్పందం రద్దు చేయడంతో పాక్‌పై తీవ్ర ప్రభావం పడనుంది.1960లో జరిగిన ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వల్ల పాక్ పూర్తిగా ఎడారిగా మారిపోనుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే చైనాలో పుట్టిన సింధూ నది భారత్ నుంచి ప్రవహించి.. పాకిస్థాన్ చేరుతుంది. అయితే పాకిస్థాన్ వ్యవసాయం, గృహ అవసరాలకు ఈ సింధూ నది జలాలను ఉపయోగిస్తుంది. అయితే ఈ రెండు దేశాల నుంచి సింధూ నది ప్రవహించడంతో రెండు దేశాల మధ్య ఒప్పందం కుదుర్చారు. అప్పటి భారత ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్‌లు 1960లో ఒప్పందంపై సంతకాలు చేశారు. ఇప్పుడు ఈ ఒప్పందం రద్దుతో పాక్‌కు వ్యవసాయానికి నీరు ఉండదు. దీనివల్ల పాకిస్థాన్‌కి నష్టమే. మరి ఈ నీటిని ఆపడం వల్ల భారత్‌కు ఏమైనా లాభం ఉందా? లేదా? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పాకిస్థాన్‌కు నీటిని ఆపేయడం వల్ల భారత్‌ను ప్రయోజనం ఉంది. ఎలా అంటే.. పంజాబ్, హర్యానా, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఎక్కువగా ఈ నీటిపైనే ఆధారపడి ఉంటాయి. అయితే ఇప్పుడు వాటర్ ఎక్కువగా ఉండటం వల్ల వ్యవసాయానికి నీటి కొరత అసలు ఉండదు. అలాగే విద్యుత్ ఉత్పత్తి కూడా బాగా పెరుగుతుంది. దీనివల్ల జలవిద్యుత్ ప్రాజెక్టులు కూడా పెరుగుతాయి. ఇకపై ఎలాంటి విద్యుత్ కొరత ఉండదు. దీనివల్ల కొత్త ఉద్యోగాలు కూడా పెరుగుతాయి. అయితే ఈ నీటిని నిల్వ చేయడం ఎలాగో తెలిసి ఉండాలి. లేకపోతే దేశానికి నష్టం ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ నీరు ఎక్కువ అయి నిల్వ ఉంచడానికి కుదరకపోతే దేశానికి వరదలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఈ నీటిని సరిగ్గా ప్లాన్ చేస్తేనే దేశానికి ప్రయోజనం ఉంటుంది.
సింధూ నదీ జలాల ఒప్పందం ప్రకారం తూర్పున ఉన్న రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్‌కు హక్కు ఉంటుంది. ఇక పశ్చిమం వైపు ఉన్న సింధు, చీనాబ్, జీలం నదులపై పాకిస్థాన్‌కు హక్కు ఉంటుందని కుదిరింది. సింధు నదిలో 20 శాతం నీటిని ఇండియా అవసరాలకు ఉపయోగించుకుంటుంది. 80 శాతం నీటిని పాకిస్తాన్ వినియోగించుకోవచ్చు. అయితే ఈ సింధూ నది వాటర్ ఆగిపోతే మాత్రం పాకిస్తాన్ ఎడారిగా మారిపోతుంది. ఎందుకంటే ప్రస్తుతానికి పాకిస్థాన్ పరిస్థితి బాగులేదు. ద్రవ్యోల్బణం భారీగా పడిపోయింది. ఇప్పటికీ అక్కడ ఆకలి చావులు ఎక్కువ అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఈ నీటిపైనే వ్యవసాయం ఆధారపడి ఉంది. అక్కడ ఉన్న పంజాబ్, సింధ్ వంటి రాష్ట్రాలకు అయితే సింధూ జలాల నీరు ప్రధాన వనరు. పాక్‌లో బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా, సింధ్ ప్రాంతాలు చాలా తక్కువ నీటి వనరులు ఉన్నాయి. ఇప్పుడు వాటర్ ఆగిపోతే మాత్రం ఆ ప్రాంతాలన్నీ ఒక్కసారిగా ఎడారిగా మారిపోతాయి. ఆఖరికి తాగు నీటికి కూడా ఇబ్బంది వస్తుందని అంచనా వేస్తున్నారు.