Two-Wheeler Toll Fee : దేశంలో బైక్ లు ఉన్న వారందరికీ షాకింగ్ న్యూస్ చెప్పిన కేంద్రం

Two-Wheeler Toll Fee : భారతదేశంలో బైకర్లకు షాకింగ్ న్యూస్. జాతీయ రహదారుల మీద ప్రయాణించే బైకులకు కూడా టోల్ ఫీజు వసూలు చేయాలని కేంద్రం నిర్ణయించినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. జూలై 15, 2025 నుంచి ఇది అమల్లోకి వస్తుందని సమాచారం. చాలా కాలంగా బైక్‌లకు ఉన్న టోల్ ఫీజు మినహాయింపు దీనితో ముగిసిపోతుంది. ఈ కొత్త టోల్ ఫీజు తీసుకురావడం వెనుక కొన్ని కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఆదాయం, ట్రాఫిక్ నిర్వహణ పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఫీజును అమలు చేయడం ద్వారా, రోడ్ల నిర్వహణ ఖర్చును అన్ని వాహనాల వినియోగదారుల నుంచి సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే, అన్ని వాహనాలకు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించాలని ప్రభుత్వం ఆశిస్తోంది.
Read Also:Suryakumar Yadav : ఆస్పత్రిలో చేరిన స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్.. ఇంతకీ ఏమైందంటే ?
జూలై 15, 2025 నుండి హైవే ఎంట్రీ పాయింట్ల వద్ద టూ వీలర్లకు టోల్ ఉంటుందని చెబుతున్నారు. ఈ నిర్ణయంపై ప్రభుత్వం సీరియస్‌గా చర్చించబోతోందని తెలుస్తోంది. టూ వీలర్లకు కూడా ఫాస్టాగ్ ద్వారా డిజిటల్ టోల్ వసూలు చేసే విధానంలోకి తీసుకురావాలని ప్రభుత్వం ఒక పెద్ద మార్పు తీసుకురావాలని చూస్తోంది. భారత రోడ్లపై బైకర్లకు టోల్ చెల్లింపు నుంచి ఎప్పుడూ మినహాయింపు ఉండేది. దీనికి కారణం, అవి రోడ్డుపై తక్కువ ప్రభావాన్ని చూపడం, ఈ వాహనాల నుండి టోల్ వసూలు చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది అనుకోవడం. ఇప్పుడు ప్రభుత్వం ఫాస్టాగ్ ద్వారా టోల్ వసూలు చేయడానికి సిద్ధమవుతోంది. అయితే, ఈ విషయంలో ప్రభుత్వం నుండి ఇంకా అధికారిక నోటిఫికేషన్ రాలేదు. కానీ, ఈ మార్పు కోసం సన్నాహాలు ఇప్పటికే జరుగుతున్నాయని తెలుస్తోంది.
Read Also:Children: మాల్స్‌కు కాదు.. పిల్లలను ఈ ప్రదేశాలకు తీసుకెళ్లండి
ఒకవేళ ఈ నిర్ణయం అమల్లోకి వస్తే టూ వీలర్ల యజమానులు ఫాస్టాగ్ తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని తమ బ్యాంక్ ఖాతాకు లేదా డిజిటల్ వాలెట్‌కు లింక్ చేయాలి. టోల్ చెల్లింపులు సజావుగా జరగడానికి ఫాస్టాగ్‌ను వాహనానికి అతికించాలి. అయితే, నెలకు రూ.150 వసూలు చేస్తారని కొన్ని నివేదికలు వచ్చాయి. కానీ, దీనిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. టూ వీలర్ల కోసం కొత్త టోల్ చెల్లింపు మోడళ్లను కూడా ప్రభుత్వం రూపొందించే అవకాశం ఉంది. పెద్ద వాహనాలకు ఇప్పటికే రూ.3,000 యాన్యువల్ టోల్ పాస్ తీసుకొచ్చారు. ఈ పథకం మొదట ఫోర్-వీలర్ల కోసం ఉద్దేశించబడింది. కానీ, ఇప్పుడు టూ వీలర్లకు కూడా టోల్ పరిధిలోకి వస్తున్నందున, అలాంటిదే ఏదైనా బైక్‌ల కోసం కూడా ప్రవేశపెట్టవచ్చు.