Spiritual: తెలిసో, తెలియక ఈ పనులు చేశారో.. మీరు పైకి పోవడం పక్కా
Spiritual:
ఎన్నో మంచి విషయాలు అన్ని కూడా మన మహా భారతాల్లో ఉంటాయి. పూర్వం పిల్లలకు వీటి గురించి పెద్దలు వివరించేవారు. కానీ ప్రస్తుతం అయితే ఎవరూ కూడా వీటి గురించి అసలు చెప్పరు. నిజానికి ఈ డిజిటల్ యుగంలో రామాయణం, మహా భారతం గురించి అసలు తెలియదు. అయితే కురు క్షేత్ర యుద్ధం తర్వాత భీష్ముడు ధర్మరాజుకి కొన్ని మంచి విషయాలు చెప్పాడట. రోజూ జీవితంలో తెలిసో, తెలియక కొన్ని తప్పులు చేయకూడదు. వీటిని చేయడం వల్ల ఆయుష్షు తగ్గిపోతుందట. మరి ధర్మ రాజుకి భీష్ముడు చెప్పిన ఆ విషయాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
విద్య నేర్పించిన గురువు మాట వినకపోవడం, పక్షులను చంపడం, ఖాళీగా ఉన్నప్పుడు గోళ్లు కొరుక్కోవడం, అవసరం లేకపోయినా కూడా పుల్లలను విరవడం, సూర్యుడిని ఉదయం, సాయంత్రం వేళలో ఎక్కువగా చూడటం వంటివి చేయడం వల్ల ఆయుష్షు తొందరగా తగ్గిపోతుందట. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి పనులు అసలు చేయకూడదని భీష్ముడు ధర్మరాజుకి చెప్పాడట. ఇవే కాకుండా ఇతరుల భార్యలపై మోజు ఉండటం, వయస్సులో పెద్ద వాళ్లపై మోజు పడటం వల్ల కూడా ఆయుష్షు తగ్గిపోతుందట. అయితే ఆయుష్షు పెరగాలంటే కేవలం నిజాలు మాత్రమే మాట్లాడాలని, అలాగే ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలి. వీటితో పాటు జంతువులకు హాని చేయకూడదు, నిత్యం పూజలు చేయడం వంటివి చేయాలని చెప్పారు.
కొందరికి తెలిసో తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. అయితే ఆవుల దగ్గర, ఆలయాలు దగ్గర మూత్ర విసర్జన చేయకూడదు. అందులోనూ నిలబడి అసలు మూత్ర విసర్జన చేయకూడదు. అలాగే ఎంగిలి చేతితో బ్రాహ్మణులు, ఆవును తాకకూడదు. అలాగే నిల్చోని భోజనం చేయకూడదు. సాయంత్రం సమయాల్లో తలపై చేతులు పెట్టుకోకూడదు. అలాగే తలకు రాసిన నూనెను ఒంటికి రాసుకోకూడదు. ఇతరులతో అబద్ధం చెప్పకూడదు. బ్రాహ్మణులు, క్షత్రియులు, ఆవులు, వృద్ధులు, గర్భిణులకు దారి ఇవ్వకపోవడం, సాయం చేయకపోవడం వంటివి కూడా దరిద్రమే. కొందరు స్నానం చేసేటప్పుడు ఒక కాలితో ఇంకో కాలిని తోముతుంటారు. ఇలా కూడా చేయకూడదు. వికలాంగులను, విద్య లేని వారిని అసహ్యించుకోకూడదు. అలాగే బ్రష్ చేసేటప్పుడు, మూత్ర విసర్జన చేసేటప్పుడు మాట్లాడకూడదు. సూర్యాస్తమయం, సూర్యోదయం సమయంలో నిద్రపోకూడదు. ఒకరి దుస్తులు ఒకరు వేసుకోకూడదు. అలాగే ఏదో ఆలోచిస్తూ భోజనం చేయకూడదు. పెరుగు, తేనె రాత్రి సమయాల్లో తినకూడదు. అలాగే పగటి సమయంలో సంసారం చేయకూడదని చెప్పారట. ఈ పనులు ఎవరు చేసినా కూడా వారి ఆయుష్షు తగ్గిపోతుందట.



