Viral Video : సముద్రం నుంచి బయటపడిన శ్రీరాముడి విల్లు.. వామ్మో ఎంత పెద్దగా ఉందో

Viral Video : సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అందులో సముద్రం నుండి విల్లు బయటపడుతున్నట్లు ఉంది. దీనిని షేర్ చేస్తూ కొందరు ఇది సముద్రంలో లభించిన శ్రీరాముడి విల్లు అని పేర్కొంటున్నారు. అయితే, పీటీఐ ఫ్యాక్ట్ చెక్ దర్యాప్తులో ఈ వాదన అబద్ధమని తేలింది. ఈ వీడియో నిజం కాదు..ఆర్టిపిషియల్ ఇంటలిజెన్స్ (AI) టెక్నాలజీ సాయంతో తయారు చేసింది. అయినా ఈ వీడియోను చాలా మంది నెటిజన్లు విరివిగా షేర్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ఫేస్బుక్లో ఒక వినియోగదారుడు ఈ వైరల్ వీడియోను షేర్ చేస్తూ.. “ఈ విల్లు సముద్రంలో కనుగొన్నారు. ఇది రామాయణ కాలానికి చెందిన సాక్ష్యం అని చెబుతున్నారు. రామాయణం ప్రకారం.. భగవాన్ శ్రీరాముడికి కోదండం అనే ప్రత్యేకమైన విల్లు ఉంది” అని రాశారు. వీడియోలో సముద్రం నుంచి విల్లు బయటకు రావడాన్ని చూడవచ్చు. తదుపరి భాగంలో ఆ విల్లు ఒక నౌక మీద ఉంచబడి, పోలీసులు దాని చుట్టూ కాపలా కాస్తున్నట్లు కనిపిస్తుంది.
Read Also :Urine Hold Health Issue: మూత్రాన్ని ఎక్కువ సమయం ఆపుకుంటే.. పిల్లలు పుట్టడం కష్టమేనా?
శ్రీరాముడి విల్లు అంటూ వీడియో వైరల్!
వైరల్ అయిన ఈ వాదన సత్యాసత్యాన్ని తెలుసుకోవడానికి మొదట సంబంధిత కీవర్డ్స్‌తో శోధించాం. కానీ దీనికి సంబంధించి ఏ మీడియా కూడా పేర్కొనలేదు. వైరల్ వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే ఎన్నో తేడాలు కనిపిస్తాయి.వీడియో నిజనిజాలను తేల్చుకునేందుకు ఏఐ సాయం తీసుకున్నారు.
వైరల్ వీడియోను పరిశీలించడానికి undetectable.ai అనే AIటూల్ ఉపయోగించారు. ఇది ఈ వీడియోను కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో క్రియేట్ చేసిందని వెల్లడించింది. అదే సమయంలో మరొక AI డిటెక్టర్ టూల్ అయిన డికోపీ AI (Decopy AI) సహాయం తీసుకున్నారు. డికోపీ AI ప్రకారం.. వైరల్ వీడియోలో 99శాతం AI ద్వారా క్రియేట్ చేసిన కంటెంట్ ఉందని తేలింది.
Read Also :Former Pakistan captain Shahid Afridi: పాక్ మాజీ కెప్టెన్ షాహిది అఫ్రిది మృతి.. ఇందులో నిజమెంత?
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం
-
Ramayana : రావణుడి క్రేజ్ రాముడిని డామినేట్ చేసిందా.. రామాయణ గ్లింప్స్ పై ట్రోలర్స్ ఇదే చెబుతున్నారా ?