Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Spiritual News »
  • Ugadi Festival What Is The Speciality Of Ugadi Festival

Ugadi festival : ఉగాది పండుగ ఎలా మొదలైంది.. దీని విశిష్టత ఏంటి?

Ugadi festival : హిందూ మతానికి చెందిన ప్రజలు ఈ రోజును చాలా ప్రత్యేకంగా కొత్త దుస్తులు, కొత్త వస్తువులతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఉగాది పండుగను మార్చి 30వ తేదీన జరుపుకుంటున్నారు. అయితే ఉగాది పండుగ ఎలా మొదలైంది? దీని విశిష్టత ఏంటి? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Ugadi festival : ఉగాది పండుగ ఎలా మొదలైంది.. దీని విశిష్టత ఏంటి?
  • Edited By: NARESH ENNAM,
  • Updated on March 26, 2025 / 12:54 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Ugadi festival  : హిందూ పండుగల్లో ఉగాది చాలా ప్రత్యేకమైనది. తెలుగు వారికి ఈ పండుగతోనే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఉగాది పండుగను తప్పకుండా ప్రతీ ఒక్క హిందువులు జరుపుకుంటారు. ఈ ఉగాది రోజు నుంచే కొందరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు. అయితే హిందువుల కొత్త సంవత్సరం ఉగాది చైత్ర మాసంలోని శుక్ల పక్షం మొదటి రోజున ప్రారంభమవుతుంది. హిందూ మతానికి చెందిన ప్రజలు ఈ రోజును చాలా ప్రత్యేకంగా కొత్త దుస్తులు, కొత్త వస్తువులతో ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది ఉగాది పండుగను మార్చి 30వ తేదీన జరుపుకుంటున్నారు. అయితే ఉగాది పండుగ ఎలా మొదలైంది? దీని విశిష్టత ఏంటి? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఉగాది అంటే యుగానికి ఆరంభం అని అంటుంటారు. మొదట్లో యుగాది అనేవారు. అది చివరకు ఉగాదిగా మారింది. అయితే ఒక్కో ఏడాది ఉగాదికి ఒక్కో పేరు ఉంటుంది. ప్రతీ ఏడాది ఉగాదిని ఓ కొత్త పేరుతో పిలుస్తారు. అయితే ప్రస్తుతం మనం క్రోధినామ సంవత్సరంలో ఉన్నాం. మార్చి 30వ తేదీ నుంచి విశ్వావశు నామ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. అయితే ఉగాదిని ఒక్కోక్కరు ఒక్కో విధంగా చెబుతుంటారు. ఈ ఉగాది పండుగ వెనక ఎన్నో స్టోరీలు ఉన్నాయి. ఒక్కోక్కరు ఒక్కో విధంగా చెబుతుంటారు. అయితే ఉగాదిలో ఉగ అంటే నక్షత్ర గమనమని, జన్మ, ఆయుష్షు అనే అర్థాలు కూడా ఉన్నాయి. అయితే ప్రతీ జీవికి కూడా ఉగాది మొదటి రోజుగా భావిస్తారు. ఈ ఉగాది రోజునే త్రేతాయుగంలో శ్రీరాముడికి పట్టాభిషేకం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈ రోజునే శ్రీమహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుని సంహరించి వేదాలు అన్నింటిని కూడా బ్రహ్మకు అప్పగించాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి.

నిజానికి బ్రహ్మదేవుడు సృష్టిని మొదలు పెట్టింది కూడా ఉగాది రోజే అని చెప్పుకుంటారు. అలాగే మొదటి తెలుగు చక్రవర్తి అయిన శాలివాహనుడు కూడా ఈ ఉగాది రోజే సింహాసనాన్ని అధిష్టించినట్లు కూడా పురాణాలు చెబుతున్నాయి. ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే హిందువులు ఈ పండుగను ముందుగా జరుపుకోవడానికి ముఖ్య కారణం ఔషధమైన పచ్చడి. ఈ పచ్చడిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు ప్రకృతిని కూడా తెలియజేస్తుంది. ఉగాది పచ్చడిలో ఉండే పోషకాలు, వసంత రుతువు అన్ని కూడా ఆరోగ్యంగా ఉంటాయని చెబుతున్నారు. నిజానికి ఇప్పుడున్న వారికి ఉగాది పండుగ ప్రాముఖ్యత పెద్దగా తెలియదు. ఏదో ఉగాది అంటే కొత్త దుస్తులు, తిరిగామా.. అనుకుంటారు. కానీ ఉగాది అంటే కేవలం కొత్త బట్టలే కాకుండా పచ్చడి, సంప్రదాయాలు అన్ని కూడా ఉంటాయి.

Tag

  • Devotional News
  • Speciality of Ugadi festival
  • Ugadi festival
  • Ugadi festival 2025
Related News
  • Venu Swamy  : సీఎం, పీఎం ల జ్యోతిష్యం చెప్పిన వేణు స్వామి

  • Ugadi : కొత్త ఏడాది నాడు ఈ పనులు చేస్తే దరిద్రమే

  • Ugadi Festival : ఉగాది నుంచి ఈ రెండు రాశుల వారికి మొత్తం శుభఫలితాలే..

  • Hanuman Jayanti : హనుమాన్ జయంతి రోజు ఇలా చేయండి. శని, మంగళ దోషం పోతుంది

Latest Photo Gallery
  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

  • Pooja Hegde: వామ్మో పూజా ఏంటి ఇలా తయారు అయింది? కుర్రకారును ఏం చేయాలి అనుకుంటుంది?

  • Janhvi Kapoor : ఈ ముద్దుగుమ్మను చూసి జాబిల్లి కూడా ముచ్చటపడుతోంది కావచ్చు

  • Nikita Sharma: ఈ బ్యూటీ నిజంగా ట్రెండ్ సెటరే కదా..

  • Ananya Nagalla : గ్రీన్ కలర్ చీరలో మెరిసిపోతున్న అనన్య నాగళ్ల

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us