Ugadi : కొత్త ఏడాది నాడు ఈ పనులు చేస్తే దరిద్రమే
Ugadi : తెలిసో తెలియక చేసిన తప్పుల వల్ల ఏడాదంతా కూడా దరిద్రంలో ఉంటారు. ఉగాది రోజు కొన్ని పనులు అసలు చేయకూడదు. చేస్తే మాత్రం ఇంట్లో దరిద్రం తిష్ట వేసుకుని కూర్చోని ఉంటుందని పండితులు అంటున్నారు. అయితే ఉగాది రోజు చేయకూడని ఆ తప్పులేంటో ఈ స్టోరీలో చూద్దాం.

Ugadi : ఉగాది పండుగను హిందువులు తప్పకుండా జరుపుకుంటారు. తెలుగు వారికి ఇదే కొత్త సంవత్సరం. అయితే ఈ ఏడాది ఉగాది పండుగను మార్చి 29వ తేదీన జరుపుకుంటున్నారు. ఉగాది పండుగను ఎంతో ఆనందంగా కుటుంబ సభ్యులతో జరుపుకుంటారు. కొత్త దుస్తలు ధరించి, రకరకాల వంటలు తయారు చేసి ఉగాది రోజును సంతోషంగా జరుపుకుంటారు. ప్రతీ ఏడాది ఉగాది పండుగను చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో జరుపుకుంటారు. అయితే ఉగాది రోజు ఉదయాన్నే లేచి కొత్త దుస్తులు ధరించి.. దేవుడిని పూజిస్తే అంతా కూడా మంచి జరుగుతుందని పండితులు చెబుతుంటారు. కానీ కొందరికి తెలియక కొన్ని తప్పులు చేస్తు్ంటారు. తెలిసో తెలియక చేసిన తప్పుల వల్ల ఏడాదంతా కూడా దరిద్రంలో ఉంటారు. ఉగాది రోజు కొన్ని పనులు అసలు చేయకూడదు. చేస్తే మాత్రం ఇంట్లో దరిద్రం తిష్ట వేసుకుని కూర్చోని ఉంటుందని పండితులు అంటున్నారు. అయితే ఉగాది రోజు చేయకూడని ఆ తప్పులేంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఇంటిని శుభ్రం చేయడం
కొందరు అన్ని రోజులు వదిలేసి ఉగాది రోజు మాత్రమే ఇంటిని శుభ్రం చేస్తారు. ఇలా చేస్తే ఇంట్లో సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుందని అంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటిని ఉగాది రోజు క్లీన్ చేయవద్దు. ముందు రోజే ఇంటిని శుభ్రం చేసుకుని ఉంచుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు.
మాంసాహారం తినడం
కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు. దీంతో ఉగాది రోజు కూడా మద్యం, మాంసాహారం తీసుకుంటారు. అయితే ఉగాది రోజు వీటిని తీసుకుంటే ఇంట్లోకి దరిద్ర దేవత వస్తుందని, అంతా కూడా నెగిటివిటీ ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రావాలంటే మాత్రం మద్యం, మాంసాహారానికి ఈ రోజు దూరంగా ఉండాలి.
డబ్బులు అప్పుగా ఇవ్వడం
కొందరు డబ్బులను అప్పుగా ఇస్తుంటారు. అయితే ఈ రోజు డబ్బులు అప్పుగా ఇస్తే అవి తిరిగి రావని పండితులు చెబుతున్నారు. ఒకవేళ అప్పు తీసుకున్నా కూడా ఆ డబ్బును తీర్చడం కూడా కష్టమేనని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఉగాది రోజు డబ్బు్లు అప్పు ఇవ్వకండి. అలాగే తీసుకోవద్దు.
చెత్త బయట పడేయవద్దు
ఇంట్లో ఉన్న చెత్తను ఉగాది రోజు బయట పడేయకూడదని పండితులు చెబుతున్నారు. ఉగాది రోజు ఇలా చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుందని పండితులు అంటున్నారు. దీంతో ఆర్థిక సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఎంత డబ్బు ఉన్నా కూడా ఇంట్లో నిలవదు. కాబట్టి ఉగాది రోజు చెత్తను బయట పడేయవద్దు.
ఈ దుస్తులు ధరించవద్దు
కొందరు చిరిగిన దుస్తులు ధరిస్తు్ంటారు. ఇలా ధరిస్తే మాత్రం ఇంట్లో ఆర్థిక సమస్యలు వస్తాయి. అలాగే ఇంట్లో దరిద్రం మొత్తం కూడా ఉంటుందని పండితులు అంటున్నారు.
గొడవలు పడటం
కొందరు చీటికి మాటికి కోపం అవుతుంటారు. ఉగాది రోజు ప్రశాంతంగా ఉండాలి. అంతే కానీ ప్రతీ విషయానికి కూడా గొడవలు పడకూడదని పండితులు చెబుతున్నారు. ఇలా గొడవలు పడితే ఏడాది మొత్తం కూడా గొడవలు పడతారని పండితులు అంటున్నారు. కాబట్టి కాస్త ప్రశాంతంగా ఈ రోజు ఉండండి.
Disclaimer: కేవలం అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని trendingtelugus.com నిర్ధారించదు. గూగుల్ ఆధారంగా తెలియజేయడం జరిగింది.