Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Spiritual News »
  • Venu Swamy Venu Swamy Gave The Astrology Of Cm And Pm

Venu Swamy  : సీఎం, పీఎం ల జ్యోతిష్యం చెప్పిన వేణు స్వామి

Venu Swamy : వేణు స్వామి ఈ ఏడాది కూడా జ్యోతిష్యం చెప్పారు. అనుకున్నట్టుగానే ఫస్ట్ నెగిటివ్ ఫ్యూచర్ చూపించారు. ఆయన ఏం చెప్పారు అనుకుంటున్నారా? అయితే ఈ ఏడాది "రాజులకు ప్రాణగండం ఉందట. రాజులు అంటే ఇక్కడ రాష్ట్రంలో సీఎం, కేంద్రంలో ప్రధాని, వివిధ దేశాల్లో అధ్యక్షులు అని అర్థం అన్నమాట.

Venu Swamy  : సీఎం, పీఎం ల జ్యోతిష్యం చెప్పిన వేణు స్వామి
  • Edited By: swathi chilukuri,
  • Updated on March 29, 2025 / 05:40 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Venu Swamy : వేణుస్వామి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈయన పంచాంగాలు చెబుతూ ఫుల్ గా పాపులర్ అయ్యారు. ఉగాది వస్తే ఈయన పంచాంగం ఎలా ఉంటుందో అని తెలుసుకోవడం కోసం ఎదురుచూసే వారు కూడా ఉన్నారు. ఇక వేణు స్వామి ఈ ఏడాది కూడా జ్యోతిష్యం చెప్పారు. అనుకున్నట్టుగానే ఫస్ట్ నెగిటివ్ ఫ్యూచర్ చూపించారు. ఆయన ఏం చెప్పారు అనుకుంటున్నారా? అయితే ఈ ఏడాది “రాజులకు ప్రాణగండం ఉందట. రాజులు అంటే ఇక్కడ రాష్ట్రంలో సీఎం, కేంద్రంలో ప్రధాని, వివిధ దేశాల్లో అధ్యక్షులు అని అర్థం అన్నమాట.

2019 డిసెంబరులో వచ్చిన షష్టగ్రహ కూటమి మకరరాశిలో ఏర్పడి కరోనా వ్యాధిని వ్యాప్తి చెందేలా చేస్తుందని చెప్పారు వేణు స్వామి. ఈ ఏడాది మార్చి 30న ఉగాది నాడే ఈ షష్ట గ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతుందట. దీని వల్ల ఏం జరుగుతుందో తెలిపారు వేణు స్వామి. ఈ ఏడాదికి అధిపతి సూర్యుడు ..ప్రపంచాన్నే శాసించే శక్తి ఉన్న వాడు సూర్యుడు. పేరు ,ప్రఖ్యాతలు ఇస్తాడట. రాజ్యానికి , రాజకీయానికి అధిపతి కాబట్టి కొందరికి ఢోకా లేదట. హార్ట్ , లివర్ , కళ్లకు , చర్మానికి భార్యాభర్తల బంధానికి అధిపతి కూడా ఈ సూర్యభగవానుడే. ఆయన షష్టగ్రహ కూటమి శనితో కలిసి మీనరాశిలో ఉన్నాడు. దేశాలకు, రాష్ట్రాలకు సంబంధించి యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది.

ఈ ఏడాది మార్చి 30న ఉగాది. ఆ రోజే షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడుతుంది. ఈ ఏడాది అధిపతి రవి. అంటే సూర్యుడు. సూర్యుడు ప్రపంచాన్ని శాసిస్తాడు. అయితే ఈ సంవత్సరం రాజులకు ప్రాణగండం ఉందట. రాజులు అంటే రాష్ట్రంలో సీఎం, కేంద్రంలో ప్రధాని, వివిధ దేశాల్లో అధ్యక్షులు అని అర్థం. ఆ దేశాల సంప్రదాయాలను బట్టి వారికి ఆరోగ్య సమస్యలు వస్తాయి అన్నారు వేణు స్వామి. కొందరు పదవి నుంచి దిగిపోయే అవకాశాలు ఉన్నాయి అన్నారు వేణు స్వామి.

అంతేకాదు రీసెంట్ గా వేణు స్వామి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద కూడా కొన్ని కామెంట్లు చేశారు. జ్యోతిష్య శాస్త్రంలో చెప్పింది తప్పకుండా జరుగుతుందన ఆయన అన్నారు. తను ఊహించి చెప్పిన విషయాలన్నీ జరిగాయి అంటూనే.. పవన్ కళ్యాణ్ పై తాజా ఇంటర్వ్యూ లో షాకింగ్ కామెంట్లు చేశాడు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని.. జనాలకు దేవుడి మీద అవగాహన కల్పిస్తున్నారని అన్నారు. వారాహి అమ్మవారిని జనాలకు పరిచయం చేసింది ఆయనే అన్నారు.

ఆయన వాహనం పేరు కూడా వారాహి అని పెట్టుకున్నారని.. అంతలా అమ్మవారిని ఆరాధిస్తున్నారని కొనియాడారు. ఆయన చేస్తున్నది మంచి పని అని మాలాంటి వాళ్ళు చెప్తే పదిమంది 20 మంది చూస్తారు కానీ ఆయన చెప్తే లక్షల మంది ఫాలో అవుతారని తెలిపారు. వారాహి అమ్మవారిని పూజించడం వల్లనే ఆయనకు అదృష్టం అలా కలిసి వచ్చిందన్నారు. ఈ సంవత్సరం కూడా ఏది పట్టుకున్న సరే మంచే జరుగుతుందని ఓటమి లేదు అని పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు వేణు స్వామి.

Disclaimer : అవగాహన కోసం మాత్రమే ఈ సమాచారం అందిస్తున్నాము. దీన్ని ట్రెండింగ్ తెలుగు నిర్ధారించదు. దయచేసి గమనించగలరు.

 

Tag

  • astrologer
  • Astrology
  • CM And PM astrology
  • Devotional News
  • Venu Swamy
Related News
  • Astrology: ఈ రత్నాలను వేళ్లకు ధరించారో.. అదృష్టమంతా మీ సొంతం

  • Astrology: శని, బుధుల ప్రభావం.. ధనవంతులు అయ్యే రాశులివే

  • Spiritual Practice : ఆత్మను పరమాత్మతో కలిపే సాధన.. ప్రతి రోజు జపం చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?

  • Astrology: గురు సంచార ప్రభావం.. ఈ రాశులకు డబ్బే డబ్బు

  • Numerology: వీరంతా అదృష్టవంతులు లేరు.. జీవితాంతం సుఖమయమే

  • Astrology: వచ్చే నెల నుంచి ఈ రాశుల వారికి తప్పని తిప్పలు

Latest Photo Gallery
  • Priyanka Jawalkar: ప్రియాంక జవాల్కర్ లెటెస్ట్ ఫొటోలు వైరల్

  • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

  • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

  • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

  • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

  • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us