Vasthu Tips : ఈ వస్తువులు మీ ఇంట్లో ఉంటే.. ఎల్లప్పుడూ కూడా లక్ష్మీదేవి మీతోనే!

Vasthu Tips :
ఇంట్లో ఎలాంటి ఆర్థిక సమస్యలు లేకుండా సంతోషంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. జీవితంలో ఎన్ని ఉన్నా కూడా ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే మాత్రం తప్పకుండా మానసిక సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు. చాలా మంది ప్రస్తుతం ఇంట్లో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. ఎంత కష్టపడినా కూడా డబ్బులు ఇంట్లో ఉండవు. ఏదో విధంగా డబ్బు సమస్యలు వస్తుంటాయి. అయితే ఆర్థిక సమస్యలు లేకుండా ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉండాలంటే మాత్రం కొన్ని నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచుకుంటే అనుకూల శక్తి ఉంటుంది. మీరు సంపాదించిన డబ్బు అంతా కూడా ఇంట్లో నిలకడగా ఉంటుందని పండితులు అంటున్నారు. మరి లక్ష్మీదేవి నిలకడగా ఉండాలంటే ఇంట్లో ఉండాల్సిన ఆ వస్తువులు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.
ఏనుగు
ఏనుగును లక్ష్మీదేవి వాహనంగా చెబుతుంటారు. ఈ జంతువును తప్పకుండా ఇంట్లో పూజిస్తారు. ఎవరి ఇంట్లో అయితే ఏనుగు ఉంటుందో వారి ఇంట్లో డబ్బు నిలకడగా ఉంటుంది. ఈ ఏనుగు బొమ్ములు ఇంట్లో అనుకూల శక్తిని ఇస్తాయి. వీటిని దేవుడు గదిలో పెట్టుకుని పూజించడం వల్ల అంతా కూడా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
కప్పలు
కప్పలు ధనాన్ని ఎక్కువగా ఆకర్షిస్తాయి. ఇంట్లో కప్ప ఫొటో లేదా వాటి బొమ్మలను ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి. ఇవి ఇంట్లో ఉంచితే తప్పకుండా మీ ఇళ్లు లక్ష్మీదేవితో నిండిపోతుంది. ఆర్థిక సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి. కప్పలకు, ధనానికి ఆకర్షణ ఉందని పండితులు అంటున్నారు.
గోల్డ్ ఫిష్
అందం కోసం చాలా మంది ఇంట్లో అక్వేరియం ఉంచుకుంటారు. వీటిలో రకరకాల చేపలను కూడా తెచ్చి పెడతారు. అయితే దీంట్లో గోల్డ్ ఫిష్‌ను పెంచుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. అలాగే ఇంట్లో ధనం కూడా పెరుగుతుంది. ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషంగా కుటుంబంలో ఉంటారు.
గుర్రం
వేగానికి చిహ్నంగా గుర్రాన్ని భావిస్తారు. అలాగే దేవతలు కూడా గుర్రాలపై వెళ్తుంటారు. అందుకే వీటి బొమ్మలు లేదా పెయింటింగ్స్‌ను ఇంట్లో ఉంచుకుంటే తప్పకుండా అదృష్టం కలసి వస్తుందని పండితులు అంటున్నారు. ఉద్యోగం కోసం వేచి చూసే వారికి తప్పకుండా గుర్రం మంచిగా ఉపయోగపడుతుంది. కోరుకున్న ఉద్యోగం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
తాబేలు..
నిలకడకు సంకేతంగా తాబేలును చూపిస్తారు. ఇది ఇంట్లో ఉంటే ధనలక్ష్మీ ఎప్పటికీ మనతోనే ఉంటుంది. దీన్ని ఇంట్లో తూర్పు ముఖంగా పెడితే తప్పకుండా అంతా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే వ్యాపారాలు కూడా బాగా లాభాలు వస్తాయి. అయితే ఈ తాబేలును తూర్పు ముఖంగా ఉంచాలి. అప్పుడే ఫలితాలు వస్తాయి.