Vastu Tips: ఈ వస్తువులను బహుమతిగా ఇస్తున్నారా.. సమస్యలు రావడం ఖాయం

Vastu Tips:
సాధారణంగా మనం స్నేహితులు లేదా బంధువులకు గిఫ్ట్‌లు ఇస్తుంటాం. పుట్టిన రోజు లేదా పెళ్లి రోజు ఇలా ఏదో ఒక సందర్భంలో ఇస్తూనే ఉంటాం. అయితే గిఫ్ట్ అనేది ప్రతీ ఒక్కరికీ ప్రతీ వస్తువు ఇవ్వచ్చు అనుకుంటాం. కానీ అన్ని రకాల గిఫ్ట్‌లను ఇవ్వకూడదని కొన్ని వాస్తు నియమాలు చెబుతున్నాయి. ఇతరులకు కొన్ని వస్తువులను మాత్రమే ఇవ్వాలని అన్ని ఇస్తే ఆర్థిక సమస్యలతో పాటు ఇతర సమస్యలు కూడా వస్తాయని అంటున్నారు. సాధారణంగా వ్యక్తి వాడే వస్తువులను ఎక్కువగా గిఫ్ట్‌గా ఇస్తుంటారు. అయితే ఎలాంటి వస్తువులను గిఫ్ట్‌గా ఇవ్వకూడదు? ఇస్తే ఏమవుతుందో? ఈ స్టోరీలో చూద్దాం.
పర్సులు
కొందరు ఇతరులకు పర్సులు గిఫ్ట్‌గా ఇస్తుంటారు. అయితే ఇతరులకు ఇలా గిఫ్ట్‌లు ఇవ్వడం మంచిదే. కానీ ఖాళీగా ఉన్నవి ఇవ్వకూడదని వాస్తు నియమాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఖాళీ పర్సును ఇవ్వడం వల్ల ఆర్థిక సమస్యలు వస్తాయి. పర్సు ఇతరులకి గిఫ్ట్‌గా ఇచ్చేటప్పుడు అందులో డబ్బులు పెట్టి ఇవ్వాలి. మీకు కలిగినంత డబ్బులు పెట్టి ఇస్తేనే ఆర్థిక సమస్యలు ఉండవు.
రుమాలు
రుమాలును అసలు గిఫ్ట్ కింద ఇవ్వకూడదు. వీటితో కన్నీళ్లు తుడుచుకుంటాం. ఇవి బాధలు, కష్టాలను తెచ్చిపెడుతుంది. అందుకే రుమాలను వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరికి కూడా ఇవ్వకూడదు.
గడియారాలు
గడియారం లేదా వాచీ వంటి వస్తువులను ఇతరులకు గిఫ్ట్‌గా ఇవ్వకూడదు. వీటిని ఇవ్వడం వల్ల బంధాలు అనేవి సరిగ్గా ఉండవు. తొందరగా విడిపోతారని, ఇద్దరి మధ్య గొడవలు వస్తాయని అంటారు.
ఆర్టిఫిషియల్ పువ్వులు
ఇలాంటి పువ్వులు చూడటానికి చాలా బాగుంటాయి. కానీ ఇతరులకు ఇవ్వకూడదని వాస్తు శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే ఇవి ఎదుగుదల లేకుండా చేస్తాయి. అందుకే ఈ పువ్వులను ఇతరులకు ఇవ్వవద్దు. అవసరం అయితే తాజా పువ్వులను ఇతరులకు గిఫ్ట్‌గా ఇవ్వడం అలవాటు చేసుకోండి.
తాజ్ మహల్ ప్రతిరూపాలు
ప్రేమకు చిహ్నంగా తాజ్‌మహల్‌ను చెబుతారు. ఇలాంటి తాజ్‌మహల్ ప్రతిరూపాలను ఇతరులకు అసలు గిఫ్ట్‌గా ఇవ్వవద్దు. ఇవి ప్రేమకు చిహ్నం అయినా కూడా విడిపోవడానికి దారితీస్తాయని అంటుంటారు. కాబట్టి వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులకు ఇవ్వకూడదు.
నల్లని వస్తువులు
ఇలాంటి వస్తువులను ఇతరులకు ఇస్తే ప్రతికూల శక్తి పెరుగుతుంది. కాబట్టి నల్ల రంగులో ఉండే ఏ వస్తువులను కూడా ఇవ్వవద్దు. ఉదాహరణకు బ్లాక్ డ్రస్ అయినా కూడా ఇతరులకు గిఫ్ట్‌గా ఇవ్వకండి. దీనివల్ల సమస్యలు ఎక్కువ అవుతాయి.
పదునైన వస్తువులు
కత్తెర, చాకు వంటి వస్తువులను ఇస్తే ఇద్దరి మధ్య గొడవలు వస్తాయి. కారణం లేకుండా ఇద్దరి మధ్య అపార్థాలు పెరిగిపోతాయి. ప్రతీ చిన్న విషయానికి కూడా గొడవ పడతారు. అందుకే ఇలాంటి వస్తువులను మీ చేతి నుంచి ఇతరులకు అసలు ఇవ్వ కూడదు.