Vastu Tips: ఇంట్లో కట్టెతో చేసిన మందిరంలోనే దేవుళ్లను పూజిస్తున్నారా? అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..

Vastu Tips:
ఇల్లు కట్టుకునే చాలా మంది ముందే దేవుని కోసం ఒక గదిని ఏర్పాటు చేసుకుంటారు. ప్రత్యేకంగా ప్రత్యేకమైన స్థలంలో మాత్రమే దేవుని గుడిని నిర్మిస్తారు. అక్కడ మాత్రమే పూజలు చేస్తారు. తర్వాత ఆ గదికి కూడా వెళ్లరు. చాలా నియమాలు పాటిస్తుంటారు. అయితే ఇంటి నిర్మాణం కోసం ఎక్కువ స్థలం ఉన్న వారు ఇలా చేస్తారు. కానీ ప్లేస్ లేని వారు ఒక వుడ్ టెంపుల్స్ ను ఉపయోగిస్తున్నారు. అంటే కట్టెతో చేసిన మందిరాన్ని ఇంట్లో పెట్టుకొని అందులో దేవుళ్లను పెట్టి పూజిస్తున్నారు. కానీ ఇలా ఇంట్లో చెక్క గూళ్లను ఉంచుకునే వారు చాలా నియమాలు పాటించాలి అంటున్నారు నిపుణులు.
నిజానికి, వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు ఇంట్లో చెక్క గుడి పెట్టాలి అనుకుంటే, లేదా మీ ఇంట్లో ఇప్పటికే చెక్క గుడి ఉంటే, మీరు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. చెక్క ఆలయం ఎలా ఉండాలి, దానిని ఏ చెక్కతో తయారు చేయాలి? ఆలయానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వాస్తు నియమాల గురించి ఇప్పుడు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం, కొన్ని చెట్ల కలపను మాత్రమే ఆలయాన్ని తయారు చేయడం శుభప్రదంగా పరిగణిస్తారట. కాబట్టి, ఒక ఆలయాన్ని ఇంటికి తీసుకువచ్చేటప్పుడు, మొదట అది ఏ కలపనో చూసి తెచ్చుకోవాలట. ఆ తర్వాతనే ఆలయాన్ని ఇంటికి తీసుకురండి. ఆ కలప చెదపురుగులతో నిండి ఉండకూడదు. ఎక్కడ కూడా చెక్కు చెదిరినట్టు కనిపించకూడదు.
చెక్క ఆలయాన్ని ఏ దిశలో ఉంచాలి?
వాస్తు శాస్త్రం ప్రకారం, చెక్కతో చేసిన ఆలయాన్ని ఎల్లప్పుడూ ఇంటికి తూర్పు దిశలో ఏర్పాటు చేయాలి. ఎందుకంటే మీరు పూజ చేసేటప్పుడు, మన ముఖం తూర్పు వైపు, వెనుక భాగం పడమర వైపు ఉంటుంది. ఇది చాలా శుభప్రదంగా చెబుతుంటారు. ఏదైనా కారణం చేత చెక్క ఆలయాన్ని తూర్పు దిశలో ఉంచడానికి స్థలం లేకపోతే, దానిని ఉత్తర దిశలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు.
ఆలయంలో ఎరుపు-పసుపు వస్త్రాన్ని పరచండి: వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లో చెక్క గుడి ఏర్పాటు చేస్తే, పూజ ఆలయంలో ఖచ్చితంగా ఎరుపు లేదా పసుపు వస్త్రాన్ని పరచాలి. దేవుని విగ్రహాన్ని లేదా చిత్రాన్ని ఎల్లప్పుడూ ఒక గుడ్డను పరిచిన తర్వాతే ప్రతిష్టించాలని గుర్తుంచుకోండి.
శుభ్రంగా ఉంచాలి: చెక్క ఆలయాన్ని ప్రతిరోజూ శుభ్రం చేయాలి. దుమ్ము లేదా చెదపురుగులు వంటి వాటికి ఆస్కారం ఉండకూడదు. చెక్క ఆలయాన్ని గోడపై కాకుండా ఇంట్లో సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలని గుర్తుంచుకోండి. సోమవారం, బుధవారం, గురువారం లేదా శుక్రవారం ఆలయాన్ని ఏర్పాటు చేయడానికి ఉత్తమ రోజులుగా చెబుతుంటారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని trendingtelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.