A Cricket match that made History: చరిత్ర సృష్టించిన క్రికెట్ మ్యాచ్.. 2 పరుగులకే ఆలౌట్, 8మంది డకౌట్
A Cricket match that made History: 427 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒక టీమ్ కేవలం 2 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇది క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది.

A Cricket match that made History: క్రికెట్ అంటేనే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కొన్నిసార్లు ఊహకు అందని ఫలితాలు వస్తుంటాయి. తాజాగా ఇంగ్లాండ్‌లో జరిగిన మిడిల్‌సెక్స్ కౌంటీ క్రికెట్ లీగ్‌లో అలాంటి ఒక సంఘటన జరిగింది. 427 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒక టీమ్ కేవలం 2 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇది క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. కేవలం 5.4 ఓవర్లలోనే ఈ ఘోరం జరగడం, 8 మంది బ్యాట్స్‌మెన్‌లు ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరడం ఈ మ్యాచ్‌ను చరిత్రలో నిలిపింది.
మే 24న నార్త్ లండన్ సీసీ (North London CC), రిచ్‌మండ్ సీసీ (Richmond CC) మధ్య జరిగిన ఈ మ్యాచ్ మిడిల్‌సెక్స్ కౌంటీ క్రికెట్ లీగ్ థర్డ్ లెవల్ డివిజన్ వన్‌లో భాగం. ఈ మ్యాచ్‌లో నార్త్ లండన్ సీసీ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. బ్యాట్స్‌మెన్‌లు అద్భుతంగా ఆడి 45 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 426 పరుగుల భారీ స్కోర్‌ను సాధించారు. ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ డాన్ సిమన్స్ 140 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగా, జాక్ లెవిత్ 42, నబీల్ అబ్రహం 43 పరుగులతో రాణించారు.
427 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రిచ్‌మండ్ సీసీ జట్టు బ్యాటింగ్ లైనప్ పూర్తిగా కుప్పకూలింది. నార్త్ లండన్ బౌలర్ల ధాటికి వారు కనీసం నిలబడలేకపోయారు. మొత్తం జట్టు కేవలం 5.4 ఓవర్లలోనే 2 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ 2 పరుగులలో ఒక పరుగు వైడ్ బాల్ ద్వారా వచ్చింది. బ్యాట్స్‌మెన్ చేసిన ఏకైక పరుగును టోమ్ పిట్రైడిస్ సాధించాడు. మిగిలిన 8 మంది బ్యాట్స్‌మెన్‌లు కనీసం ఒక్క పరుగు కూడా చేయకుండానే (డకౌట్) పెవిలియన్ చేరారు. దీంతో రిచ్‌మండ్ సీసీ జట్టుకు 424 పరుగుల భారీ తేడాతో ఓటమి తప్పలేదు. నార్త్ లండన్ క్లబ్ ఈ రికార్డు విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.
North London CC 3rd XI v Richmond CC, Middlesex 4th XI.
The most ridiculous and one-sided cricket scorecard I have ever seen.
Perhaps making the decision to field was the wrong one. 🤔 pic.twitter.com/iMbqIFZIfI
— Gentleman of the North (@UnionistJack) May 25, 2025
ఈ 2 పరుగుల స్కోర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్‌లలో ఒకటిగా నిలిచింది. అంతకుముందు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యల్ప స్కోర్ 6 పరుగులు, ఇది 1810లో లార్డ్స్‌లో ‘బి’ అనే జట్టు ఇంగ్లాండ్ చేతిలో సాధించింది. నేటి ఫాస్ట్-పేస్ క్రికెట్‌లో ఇలాంటి రికార్డు నమోదవడం నిజంగా అద్భుతం. రిచ్‌మండ్ సీసీకి 1862 నుండీ ఒక గొప్ప చరిత్ర ఉంది. ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ కూడా ఒకప్పుడు ఈ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
IND vs ENG : ఒకే ఓవర్లో ఇద్దరు ఓపెనర్లను ఔట్ చేసి ఇంగ్లాండ్ వెన్ను విరిచిన తెలుగు కుర్రాడు
-
Rules for Wearing Tulsi Mala: తులసి మాల ధరించే ముందే ఇవి తెలుసుకోండి. తెలియక ఈ తప్పులు చేస్తే చాలా ఇబ్బందుల్లో పడతారు?
-
Two Mistakes That Man Makes: మనిషి చేసే రెండు తప్పులు ఇవే..
-
PhonePe and Google Pay: ఫోన్ పే, గూగుల్ పేలో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా?
-
Shepherds Protest: ఇదేం నిరసనయ్యా సామీ.. మేమెప్పుడూ చూడలే..