Delhi Capitals : ఢిల్టీ జట్టుకు కెప్టెన్‌గా అక్షర్ పటేల్.. కేఎల్ రాహుల్‌ని కాదని ఈ యువ ప్లేయర్‌ని ఎందుకు?
Delhi Capitals ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్‌ను రూ.16.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌లో అక్షర్ పటేల్ 2019 నుంచి ఆడుతున్నాడు. కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌కి పెద్దగా అనుభవం లేకపోవచ్చు.

Delhi Capitals : ఐపీఎల్ (IPL 2025) 18వ సీజన్ ఇంకో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 22వ తేదీ నుంచి ఈ ఐపీఎల్ 18వ సీజన్ స్టార్ట్ అవుతుంది. క్రికెట్ ప్రియులు ఈ సీజన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఐపీఎల్‌లోని ఢిల్లీ క్యాపిటల్స్ తన కెప్టెన్‌ను తాజాగా ప్రకటించింది. యువ ఆల్‌రౌండర్ అయిన అక్షర్ పటేల్‌ను ఢిల్లీ జట్టుకి సారధిగా నియమించింది. అయితే ఢిల్లీ జట్టులో ఇప్పటికే చాలా మంది సీనియర్ ప్లేయర్లు ఉన్నారు. కానీ వారందరినీ కాదని అక్షర్ పటేల్‌కి అవకాశం ఇవ్వడానికి కారణమేంటని అంటున్నారు. అయితే ఢిల్లీ జట్టుకు ఇంతకు ముందు రిషబ్ పంత్ కెప్టెన్‌గా ఉండేవాడు. పంత్‌ను లక్నో జట్టు ఐపీఎల్ వేలంలో రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం పంత్ లక్నో టీమ్‌కి కెప్టెన్‌గా ఉన్నాడు. పంత్ తర్వాత ఢిల్లీ జట్టులోకి కేఎల్ రాహుల్‌ను కెప్టెన్ చేస్తారని అందరూ భావించారు. దానికి తోడు ఛాంపియన్స్ ట్రోఫీలో కేఎల్ రాహుల్ ఆడిన ఆట తీరు కూడా అద్భుతం. దీంతో పక్కాగా కేఎల్ రాహుల్‌నే ఢిలీ జట్టుకు కెప్టెన్‌గా చేస్తారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా అక్షర్ పటేల్‌ను ఢిల్లీ జట్టుకి కెప్టెన్‌గా చేశారు. అయితే కేఎల్ రాహుల్‌ని కాదని అక్షర్ పటేల్‌ను ఢిల్లీ జట్టుకి కెప్టెన్‌గా చేయడానికి గల కారణాలు ఏంటో చూద్దాం.
ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అక్షర్ పటేల్‌ను రూ.16.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌లో అక్షర్ పటేల్ 2019 నుంచి ఆడుతున్నాడు. కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌కి పెద్దగా అనుభవం లేకపోవచ్చు. కానీ వైస్ కెప్టెన్‌గా ఈ ఏడాది జనవరిలో టీ20 జట్టుకు అక్షర్ పటేల్ ఎంపికయ్యాడు. అయితే అక్షర్ పటేల్ ఆల్ రౌండర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అక్షర్ పటేల్ రాణించాడు. అయితే గతంలో కెప్టెన్‌గా ఉన్న పంత్ స్లో ఓవర్ రేట్ కారణంగా ఒక మ్యాచ్ బ్యాన్ విధించారు. ఆ తర్వాత పంత్ వెళ్లిన తర్వాత రాహుల్ అనుకున్నారు. అయితే రాహుల్‌ను కెప్టెన్‌గా అవకాశం వచ్చినా కూడా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే రాహుల్ భార్య అతియా ప్రెగ్నెంట్. ఈ కారణంగా ఐపీఎల్లో కొన్ని మ్యాచ్‌లకు దూరం అయ్యే అవకాశం ఉంది. అతియా డెలివరీ సమయంలో ఆమెతో ఉండాలంటే కొన్ని మ్యాచ్‌లు ఆడకూడదు. ఈ కారణంగానే రాహుల్ కెప్టెన్సీని తిరస్కరించారని వార్తలు వస్తున్నాయి. ఎప్పటి నుంచో ఢిల్లీ జట్టులో ఆడుతున్న అక్షర్ పటేల్ ఆల్‌రౌండర్. దీంతో ఫ్రాంఛైజీ అక్షర్ పటేల్ వైపు మొగ్గుచూపింది. గత ఆరు సీజన్లలో అక్షర్ పటేల్ ఢిల్లీ జట్టు నుంచి 82 మ్యాచ్‌లు ఆడాడు. అయితే గత సీజన్లో అక్షర్ పటేల్ 235 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు పడగొట్టాడు. ఈ కారణంగానే ఢిల్లీ జట్టు అక్షర్ పటేల్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
-
MS Dhoni : ఐపీఎల్లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
Abhishek Sharma : అభిషేక్ శర్మ రికార్డ్.. ఏకంగా రాహుల్‌నే దాటేసి!
-
ICC : ఐసీసీ కీలక నిర్ణయం.. ఒక బంతితోనే వన్డే!
-
Jasprit Bumrah: ముంబై ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. వచ్చేస్తున్న బుమ్రా
-
Hardik Pandya: ఐపీఎల్ హిస్టరీలోనే కెప్టెన్‌గా హార్దిక్ రికార్డు
-
IPL 2025: ఐపీఎల్లో రిటైర్డ్ ఔట్ ప్లేయర్స్ లిస్ట్ ఇదే