Parliament Monsoon Session Postponed: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిరసనల మధ్య వాయిదా
Parliament Monsoon Session Postponed ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు ఆగమేఘాల మీద ఓటర్ల జాబితాను సవరించడం ప్రజాస్వామ్య విరుద్దమని వారు మండిపడ్డారు.

Parliament Monsoon Session Postponed: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిరసనల మధ్య వాయిదా పడ్డాయి. గత రెండు రోజులుగా ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో లోక్ సభ, రాజ్యసభలు అస్తవ్యస్తంగా మారాయి. ఈరోజు ఆందోళన మధ్య సభలు మధ్యహ్నం 2 గంటలకు వరకు వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు సభలు మొదలవగానే బీహార్ లో కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ పేరుతో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణపై ప్రతిపక్ష ఎంపీలు నిరసన గళం వినిపించారు.
ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు ఆగమేఘాల మీద ఓటర్ల జాబితాను సవరించడం ప్రజాస్వామ్య విరుద్దమని వారు మండిపడ్డారు. ఎన్నికల వేళ బీజేపీ వ్యతిరేక ఓటర్లను జాబితా నుంచి తొలగించేందుకు ఎన్నికల సంఘం కేంద్రంతో కలిసి కుట్రకు తెరలేపిందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఓటర్ల జాబితాను సవరించడం ఈ మధ్య కాలంలో పరిపాటిగా మారిందని విమర్శించారు. దీంతో ఉభయసభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి.