Priyanka Gandhi: మోదీ పై ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు
Priyanka Gandhi రక్షణ మంత్రి గంటసేపు సభలో చాలా విషయాలు మాట్లాడారని, కానీ ఒక పాయింట్ ప్రస్తావిచేదన్నారు. ఏప్రిల్ 12న పట్టపగలే ఉగ్రదాడి ఎలా, ఎందుకు జరిగిందో చెప్పలేదన్నారు.

Priyanka Gandhi: మోదీ పై ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి బాధ్యత ఎవరిది, ప్రధాన మంత్రిదా,హోం మంత్రిదా, రక్షణ మంత్రిదా ఎవరైనా రాజీనామా చేశారా అని ప్రశ్నించారు. జాతీయ భద్రత విషయంలో తీవ్రలోపం జరిగిందన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించామని అమిత్ షా చెబుతున్నారని, అయితే కశ్మీర్ లో గతంలోనూ టీఎఆర్ఎఫ్ దాడులు చేసిందని గుర్తు చేశారు. టీఆర్ఎఫ్ వరుస దాడులు చేస్తుంటే కేంద్రం ఏం చేస్తోందన్నారు.
రక్షణ మంత్రి గంటసేపు సభలో చాలా విషయాలు మాట్లాడారని, కానీ ఒక పాయింట్ ప్రస్తావిచేదన్నారు. ఏప్రిల్ 12న పట్టపగలే ఉగ్రదాడి ఎలా, ఎందుకు జరిగిందో చెప్పలేదన్నారు. 2008 బాట్లా హౌస్ ఎన్ కౌంటర్ లో టెర్రరిస్టులను చంపినందుకు సోనియాగాంధీ కంటతడి పెట్టారంటూ హోం మంత్రి అమిత్ షా ఆరోపించడాన్ని ప్రియాంక గాంధీ తిప్పికొట్టారు.
LIVE : Speaking in the Lok Sabha during special discussion on Pahalgam attack and Opration Sindoor. https://t.co/76VP53PXOU
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) July 29, 2025