Lok Sabha Monsoon Session: పార్లమెంట్ సమావేశాలు.. మూడో రోజూ అదే తీరు
Lok Sabha Monsoon Session సభ్యులు ప్లకార్డులు పట్టుకోరాదని, వెళ్లి తమ స్థానాల్లో కూర్చోవాలని స్వీకర్ ఓం బిర్లా కోరినా సభ్యులు వినిపించుకోలేదు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

Lok Sabha Monsoon Session: బిహార్ లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై పార్లమెంట్ ఉభయసభల్లో ప్రతిపక్షాలు మూడో రోజుకూడా నిరసన కొనసాగించాయి. దీనిపై చర్చకు పట్టుబట్టిన విపక్ష సభ్యులు సభా కార్యకలాపాలు జరగకుండా అడ్డు తగిలారు. లోక్ సభలో క్వశ్చన్ అవర్ లో ప్లకార్డులు పట్టకుని నినాదాలు చేస్తూ వెల్ లోకి దూసుకుపోయారు. సభ్యులు ప్లకార్డులు పట్టుకోరాదని, వెళ్లి తమ స్థానాల్లో కూర్చోవాలని స్వీకర్ ఓం బిర్లా కోరినా సభ్యులు వినిపించుకోలేదు. అటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ఆందోళనలు సద్దుమణగకపోవడంతో ఉభయసభలూ తొలుత మధ్యాహ్నానికి, తర్వాత గురువారానికి వాయిదా పడ్డాయి. అందుకు ముందు సభా కార్యకలాపాలు ప్రారంభం కాకముందే ఇండియా బ్లాక్ కు చెందిన పలు పార్టీల ఎంపీలు పార్లమెంట్ కాంప్లెక్స్ మకర ద్వారం బయట నిలబడి ఆందోళన చేపట్టారు.