Rohith Sharma: హిట్ మ్యాన్ మరో రికార్డు.. ధోనిని వెనక్కి నెట్టి మరి రోహిత్ టాప్ ప్లేస్‌కి..

Rohith Sharma:
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా (Team India) ఘన విజయం సాధించింది. మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని (Champions Trophy) టీమిండియా సాధించడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఆనందంతో పొంగిపోతున్నారు. న్యూజిలాండ్‌పై టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ మరో ఓవర్ మిగిలి ఉండగానే నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియాను గెలిపించడంలో కెప్టెన్ రోహిత్ శర్మ పాత్ర ముఖ్యమైనది. నిలకడగా ఆడుతూ 76 పరుగులు చేశాడు. మొత్తం 83 బంతుల్లో 76 పరుగులు చేయగా.. ఇందులో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు ఉన్నాయి.
కెప్టెన్‌గా రోహిత్ శర్మ రెండో ఐసీసీ టైటిల్‌ను సాధించాడు. గతేడాది టీ20 ప్రపంచ కప్‌ను సొంతం చేసుకున్నాడు. ఐసీసీ ఈవెంట్లలో కెప్టెన్‌గా రోహిత్ రికార్డులు సృష్టించాడు. కెప్టె్న్‌గా రోహిత్ మొత్తం 24 మ్యాచ్‌లు ఆడగా అందులో 23 విజయాలు సాధించాడు. కేవలం ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోయాడు. అదే 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో ఓడిపోయాడు. అయితే రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును బద్దలు కొట్టాడు. ఐసీసీ ఈవెంట్లలో వరుసగా ఎక్కువ మ్యాచ్‌లో విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు ఈ రికార్డు ఎంఎస్ ధోనిపై ఉంది. ఇప్పుడు ఆ రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. కెప్టెన్‌గా ధోని వరుసగా మొత్తం 12 మ్యాచ్‌లు గెలవగా.. రోహిత్ 13 మ్యాచ్‌లు గెలిచాడు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ సేన అన్ని మ్యాచ్‌లు కూడా గెలిచింది.
ఇదిలా ఉండగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ తర్వాత కెప్టెన్ రోహిత్ వన్డేల్లో రిటైర్మెంట్ ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. దీనిపై బీసీసీఐ కూడా రోహిత్‌తో సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో కొందరు విలేకర్లు మ్యాచ్ తర్వాత జరిగిన ప్రెస్ మీట్‌లో రిటైర్మెంట్ కోసం రోహిత్‌ను అడిగారు. దీనికి రోహిత్ స్పందిస్తూ.. తాను ఇప్పటిలో రిటైర్ కావడం లేదని స్పష్టం చేశాడు. రిటైర్మెంట్‌పై వచ్చే వార్తలను అసలు నమ్మవద్దని తెలిపాడు. తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని చెబుతూ.. రిటైర్మెంట్‌పై క్లారిటీ ఇచ్చాడు. భవిష్యత్తు ప్లానింగ్స్ బట్టి రిటైర్మెంట్ ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు.
-
MS Dhoni : ఐపీఎల్‌లో సీఎస్కేకి ఫ్యూచర్ ఉందా? ధోని ఏమైనా ప్లాన్ చేశాడా?
-
MS Dhoni: సీఎస్కేకి కెప్టెన్‌గా ధోని.. అసలు కారణమేంటి?
-
MS Dhoni and Sandeep Reddy Vanga : ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటిస్తున్న ధోని… క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్…
-
Rohit Sharma: రోహిత్ శర్మకు బిగ్ షాక్.. ఇక టెస్టుల్లో బుమ్రానే కెప్టెన్!