Rohit Sharma: రోహిత్ శర్మకు బిగ్ షాక్.. ఇక టెస్టుల్లో బుమ్రానే కెప్టెన్!
Rohit Sharmaరోహిత్ శర్మ టెస్టు మ్యాచ్‌లకు దూరం అయితే ఇకపై బుమ్రానే కెప్టెన్‌గా బీసీసీఐ పక్రటించనుంది. బుమ్రా ఇప్పటికే వైస్ కెప్టెన్. మూడు టెస్టుల్లోనూ అతను జట్టును నడిపించాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియాను గెలిపించాడు.

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రోహిత్ శర్మ ఇకపై టెస్ట్ మ్యాచ్‌ల్లోనూ కూడా కనిపించడు. ఇకపై టెస్ట్ మ్యాచ్‌లకు కూడా ఎండ్ కార్డు వేసినట్లు తెలుస్తోంది. టీమ్ఇండియా టెస్ట్ మ్యాచ్‌ల కెప్టెన్సీ పగ్గాలను బుమ్రాకు అప్పగించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రాను ఎంపిక చేయలేదని తెలుస్తోంది. ఇకపై రోహిత్ శర్మను టెస్ట్ మ్యాచ్‌లలో ఆడించవద్దని బీసీసీఐ సెలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే రోహిత్ శర్మ ప్రదర్శన కూడా బాగులేదు. గతేడాది టెస్ట్ మ్యాచ్‌లలో చెత్త ప్రదర్శన చేశాడు. చివరి ఎనిమిది టెస్టుల్లో 10.9 సగటుతో 164 పరుగులు మాత్రమే రోహిత్ శర్మ చేశాడు. గత మ్యాచ్‌ల్లో కూడా రోహిత్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు టీమిండియా ఓడిపోయింది. కెప్టెన్‌గా, బ్యాటర్‌గా కూడా రోహిత్ శర్మ అద్భుతమైన ప్రదర్శన చేయలేకపోవడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలోకి కూడా రోహిత్ శర్మ ఉండటం డౌట్ అని తెలుస్తోంది.
రోహిత్ శర్మ టెస్టు మ్యాచ్‌లకు దూరం అయితే ఇకపై బుమ్రానే కెప్టెన్‌గా బీసీసీఐ పక్రటించనుంది. బుమ్రా ఇప్పటికే వైస్ కెప్టెన్. మూడు టెస్టుల్లోనూ అతను జట్టును నడిపించాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియాను గెలిపించాడు. గాయం కారణంగా ప్రస్తుతం బుమ్రా రెస్ట్‌లో ఉన్నాడు. ఈ కారణంగానే బీసీసీఐ ఛాంపియన్స్ ట్రోఫీకి బుమ్రాను సెలక్ట్ చేయలేదు. గాయం నుంచి పూర్తిగా కోలుకుంటే.. భవిష్యత్తులో బాగుంటుందని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే బుమ్రా ఇంకా బౌలింగ్ స్టార్ట్ చేయలేదు. గాయం పూర్తిగా క్లియర్ కాలేదు. ఇప్పుడు మళ్లీ ఆడటం ప్రారంభిస్తే మాత్రం తప్పకుండా సమస్య ఎక్కువ అవుతుంది. బుమ్రాను కాపాడుకోవాల్సిన అవసరం భారత్‌కు ఎంతైనా ఉంది. అందుకే పూర్తి స్థాయిలో బుమ్రాకి గాయం నయం అయితే టీమ్ లోకి తీసుకోనుంది. ఈ కారణంగానే ఐపీఎల్‌కి కూడా బుమ్రా దూరం కానున్నట్లు తెలుస్తోంది. బుమ్రా పూర్తిగా జూన్-జులైలో జరిగే ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌కు సిద్ధమవుతాడని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై బీసీసీఐ ఇంకా ప్రకటించాల్సి ఉంది.