Test Matches: టెస్ట్ మ్యాచ్‌లకు విరాట్ రిటైర్మెంట్.. కారణమిదే!
కింగ్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే టెస్ట్ మ్యాచ్‌లకు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తారని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వార్తలకు అనుగుణంగానే కింగ్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా విరాట్ కోహ్లీ ఈ విషయాన్ని తెలిపారు.

Test Matches: కింగ్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే టెస్ట్ మ్యాచ్‌లకు కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటిస్తారని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వార్తలకు అనుగుణంగానే కింగ్ కోహ్లీ టెస్ట్ మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా విరాట్ కోహ్లీ ఈ విషయాన్ని తెలిపారు. తన 14 ఏళ్ల కెరీర్లో మొత్తం 123 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు. ఇందులో 68 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా తెలియజేశాడు. టెస్ట్ క్రికెట్లో నేను తొలిసారి బ్యాగీ బ్లూ ధరించి 14 సంవత్సరాలు అయిందని.. నిజాయితీగా చెప్పాలంటే, ఈ టెస్ట్ ఫార్మాట్ నన్ను ఈ ప్రయాణంలో తీసుకెళ్తుందని ఎప్పుడూ నేను ఊహించలేదు. ఇది నన్ను పరీక్షించింది, నన్ను ఎంతో బాగా తీర్చిదిద్దింది. జీవితాంతం నేను మోయాల్సిన ఎన్నో పాఠాలను నేర్పింది. తెల్లని దుస్తులు ధరించడంలో ఎంతో ఆనందం ఉంది. నిశ్శబ్దమైన ఆనందం, సుదీర్ఘమైన రోజులు, ఎవరూ చూడని చిన్న క్షణాలు ఎప్పటికీ మీతోనే ఉంటాయని పోస్ట్ చేశారు. ఈ ఫార్మాట్‌ను వదలడం అంత ఈజీ కాదు.. కానీ వదలడం కరెక్ట్ అనిపిస్తుందన్నారు. నేను ఆడవలసిన విధంగా ఆడాను.. అంతకు మించి ఆట నాకు ఎన్నో నేర్పిందన్నారు. సంతోషంగా వెళ్లిపోతున్నాను.. ఎల్లప్పుడూ కూడా టెస్ట్ కెరీర్‌ను కూడా ఎంతో సంతోషంగా తిరిగి చూసుకుంటానని కోహ్లీ తెలిపారు. దీంతో కోహ్లీ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. ఇంత తొందరగా రిటైర్మెంట్ ప్రకటించడం ఏంటని ఫీల్ అవుతున్నారు. ఇంకా కొన్నాళ్లు ఆడితే బాగుంటుందని భావిస్తున్నారు. మరికొందరు కొత్త వాళ్లకి అవకాశం ఇస్తున్నారని అంటున్నారు.
Read Also: లిమిట్కి మించి క్రెడిట్ కార్డు వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్
ఇదిలా ఉండగా జూన్ 20 నుండి టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇటీవల రోహిత్ శర్మ టెస్ట్ మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ప్రకటించగా.. ఇప్పుడు కోహ్లీ ప్రకటించారు. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్‌లకు కెప్టెన్‌ను శుభమన్ గిల్‌ను నియమించాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే కోహ్లీ తన రిటైర్మెంట్ విషయాన్ని బీసీసీఐకి ఒక నెల ముందే చెప్పినట్లు తెలుస్తోంది. కాకపోతే బీసీసీఐ దీనికి స్పందించలేదు. రోహిత్‌తో పాటు అశ్విన్ కూడా గత ఏడాది చివరలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే ప్రస్తుతం జట్టులో లేరు. గతేడాది భారత్ ప్రపంచ కప్ గెలిచింది. దీని తర్వాత కోహ్లీ, రోహిత్ ఇద్దరూ T20Iల నుంచి రిటైర్ అయ్యారు. ఇకపై కేవలం వన్డే క్రికెట్‌కు మాత్రమే అందుబాటులో ఉంటారు.
-
Yashasvi Jaiswal : రెండు సిక్స్ లు కొడితే చాలు.. ఆ రికార్డు బద్ధలు కొట్టనున్న యశస్వి జైస్వాల్
-
Shubman Gill: కొత్త టెస్ట్ కెప్టెన్సీ.. రికార్డు సృష్టించిన శుభమాన్ గిల్
-
Jasprit Bumrah : కెప్టెన్సీ ఆఫర్‌ను తిరస్కరించిన బుమ్రా.. బీసీసీఐకి ‘నో’ చెప్పడానికి గల అసలు కారణం ఇదే!
-
Virat Kohli : ‘కోహ్లీతో నా కూతురికి పెళ్లి చేస్తా’: స్టార్ క్రికెటర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
WTC: మూడు టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ అక్కడే.. డబ్ల్యూటీసీ కీలక నిర్ణయం
-
Bengaluru Stampede : విరాట్ కోహ్లీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.. పోలీసులకు స్థానికుల ఫిర్యాదు