Rohit Sharma : రోహిత్ శర్మకు అరుదైన గౌరవం.. వాంఖడేలో ప్రత్యేక స్టాండ్‌కు హిట్ మ్యాన్ పేరు!

Rohit Sharma : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారత క్రికెట్‌కు ఎన్నో గొప్ప విజయాలను అందించాడు. గత 18 ఏళ్లుగా ప్రపంచ క్రికెట్‌లో భారత్ కీర్తిని చాటడంలో కీలక పాత్ర పోషించాడు. తన కెరీర్ చివరి దశకు చేరుకుంటున్న రోహిత్‌కు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన గౌరవం లభించింది. ఇది కేవలం భారత్‌లోనే కాదు, ప్రపంచ క్రికెట్‌లోనూ కొద్దిమంది ఆటగాళ్లకే దక్కిన గౌరవం. ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) చారిత్రాత్మక వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండ్‌కు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ పేరు పెట్టింది. మే 16న వాంఖడే స్టేడియంలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో రోహిత్ శర్మ స్టాండ్‌ను ప్రారంభించారు.
టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను గౌరవించాలని MCA కొద్ది రోజుల క్రితమే ప్రకటించింది. ఐపీఎల్ 2025 మ్యాచ్‌ల సమయంలో ఈ కార్యక్రమం నిర్వహించాలని MCA మొదట భావించింది. కానీ టోర్నమెంట్ మధ్యలో ఆగిపోవడంతో వాయిదా పడింది. ఇప్పుడు MCA ఎట్టకేలకు దీనిని పూర్తి చేసింది.
Read Also :Renu Desai: ఇకపై ఆ వస్తువులు బ్యాన్ చేయండి.. దేశ ప్రజలకు రేణు దేశాయ్ రిక్వెస్ట్.. వైరల్ పోస్ట్
VIDEO | Indian ODI skipper Rohit Sharma’s stand unveiled at Wankhede Stadium in Mumbai.
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/c4QzTzzeCo
— Press Trust of India (@PTI_News) May 16, 2025
తల్లిదండ్రులతో ప్రారంభోత్సవం
మే 16న వాంఖడే స్టేడియంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో MCA రోహిత్ పేరుతో ఉన్న స్టాండ్‌ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో రోహిత్‌తో పాటు ఆయన భార్య, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, MCA మాజీ అధ్యక్షుడు శరద్ పవార్, MCA ప్రస్తుత అధ్యక్షుడు అజింక్యా నాయక్, అనేక మంది అధికారులు, అభిమానులు కూడా హాజరయ్యారు. విశేషం ఏమిటంటే.. స్టాండ్‌ను తెరవడానికి ఉన్న బటన్‌ను రోహిత్ స్వయంగా నొక్కకుండా తన తల్లిదండ్రుల చేతుల మీదుగా ఈ శుభ కార్యాన్ని పూర్తి చేయించాడు.
Read Also :Chinnaswamy Stadium: చిన్న స్వామి స్టేడియం కాదు.. స్విమ్మింగ్ పూల్.. స్నానం చేసిన ప్లేయర్
ఈ గౌరవాన్ని రోహిత్ చాలా ప్రత్యేకమైనదిగా అభివర్ణించాడు. ఈ మైదానంలో మళ్లీ ఆడేందుకు దిగినప్పుడు ఇది ఒక విభిన్నమైన అనుభూతినిస్తుందని చెప్పాడు. టీమిండియా వన్డే కెప్టెన్ మాట్లాడుతూ.. “నేను రెండు ఫార్మాట్ల నుండి రిటైర్ అయ్యాను, కానీ ఇంకా ఒక ఫార్మాట్ ఆడుతున్నాను. ఆడుతూ ఉండగానే ఇలాంటి గౌరవం లభించడం చాలా ప్రత్యేకంగా ఉంది. 21వ తేదీన నేను ముంబై ఇండియన్స్ తరపున ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడేందుకు దిగినప్పుడు స్టాండ్‌పై నా పేరు చూడటం చాలా అద్భుతంగా ఉంటుంది” అని అన్నాడు.
వాంఖడే స్టేడియంలో 3 ఏళ్లలో 3 అద్భుతాలు
ఈ కార్యక్రమంలో రోహిత్‌తో పాటు మాజీ భారత కెప్టెన్ అజిత్ వాడేకర్ పేరుతో కూడా ఒక స్టాండ్‌ను అంకితం చేశారు. అలాగే శరద్ పవార్ స్టాండ్‌ను కూడా ప్రారంభించారు. పవార్ చాలా కాలం పాటు MCA అధ్యక్షుడిగా పనిచేశారు. అక్కడి నుంచే BCCI అధ్యక్షుడిగా కూడా ఎన్నికయ్యారు. ఆయన హయాంలోనే BCCI ప్రధాన కార్యాలయం కోల్‌కతా నుండి ముంబైకి మారింది. గత 3 ఏళ్లలో MCA వరుసగా మూడోసారి స్టేడియంలో ఒక ప్రత్యేకమైన అంశాన్ని జోడించింది. 2023లో ఈ స్టేడియంలో సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తర్వాత 2024లో 2011 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఎంఎస్ ధోని కొట్టిన విజయపు సిక్సర్ తర్వాత బంతి పడిన సీటుకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చారు.