Renu Desai: ఇకపై ఆ వస్తువులు బ్యాన్ చేయండి.. దేశ ప్రజలకు రేణు దేశాయ్ రిక్వెస్ట్.. వైరల్ పోస్ట్

Renu Desai: హీరోయిన్ రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ.. కొన్నింటికి స్పందిస్తుంటుంది. అయితే రేణు దేశాయ్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. దేశ ప్రజలను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు. దేశంలో చైనా వస్తువులను బహిష్కరించాలని సోషల్ మీడియా ద్వారా ఆమె కోరారు. దేశ భద్రత, మీ కుటుంబ భద్రత పట్ల ఏమైనా బాధ్యతలు ఉంటే మాత్రం చైనా వస్తువులను కొనడం మానేయండి. కేవలం మన దేశ వస్తువులను మాత్రమే కొనండని సోషల్ మీడియా ద్వారా తెలిపారు. గతంలో రేణు దేశాయ్ చైనా వస్తువులు కొనేవారు. అయితే ఇప్పుడు మానేసినట్లు ఆమె తెలిపారు. ప్రతీ వస్తువుకు లేబుల్ ఉంటుంది. వీటిని చూసి ప్రతీ ఒక్కరు కొనాలని ఆమె సూచించారు. ఇప్పటి వరకు ఎలాగో గడిచిపోయింది.. ఇకనైనా దేశీయ వస్తువులను కొనండని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
ఇది కూడా చూడండి: Kangana Ranaut : ట్రంప్‌పై పోస్ట్… పార్టీ ఆదేశాలతో తొలగించిన కంగనా రనౌత్
ఈ పోస్ట్‌ను దేశమంతా కూడా షేర్ చేయండని ఆమె దేశ ప్రజలను కోరారు. దేశం గురించి మనం కాకపోతే ఇంకా ఎవరు ఆలోచిస్తారని అన్నారు. అర్థం లేని టీవీ రియాలిటీ షోలు గురించి చర్చించుకోవడం కంటే దేశ పరిస్థితుల గురించి చర్చించుకోవడం మంచిదని రేణు దేశాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. యుద్ధ సమయంలో భారత్‌కు చైనా సాయ పడలేదు. దీనికి తోడు పాక్‌క సపోర్ట్‌గా భారత్‌పైకి ఆయుధాలను పంపించింది. ఇండియా ఎదుగుదలను చూసి చైనా ఓర్వలేదని.. అన్నారు. కాబట్టి ఇకనైనా మేడ్ ఇన్ చైనా వస్తువులను వాడటం మానేయండి. దీనివల్ల మీరు దేశానికి ఎంతో మంచి చేసిన వారు అవుతారని అన్నారు. చైనా వస్తువులను వాడటం మానేస్తే.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసినట్లే అని రేణు దేశాయ్ అన్నారు.
ఇది కూడా చూడండి: Young Directors: ఈ యంగ్ డైరెక్టర్లకే మెగాస్టార్ ఛాన్స్.. వాళ్లు ఎవరంటే?
ఇదిలా ఉండగా రేణు దేశాయ్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఇటీవల రవితేజ టైగర్ నాగేశ్వరరావు మూవీలో ఆమె ఓ ముఖ్యమైన రోల్‌లో నటించారు. అయితే ఈ సినిమా ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. రేణు దేశాయ్ పాత్ర కూడా పెద్దగా ఆకర్షించలేదు. అయితే రేణు దేశాయ్ కుమారుడు అకీరా నందన్ సిల్వర్ స్క్రీన్‌పై ఎంట్రీ కోసం పవన్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే అకీరాకు మ్యూజిక్ మీద పట్టు ఎక్కువగా ఉంది. మరి అకీరా నందన్ ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడో ఎదురు చూడాలి. ఇటీవల అకీరా ఎక్కువగా పవన్ కళ్యాణ్ దగ్గర కనిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తే అక్కడికి అకీరా వెళ్తున్నారు. అప్పుడు ఫ్యాన్స్ ఫొటోస్ తీసుకోవాలని సందడి చేస్తున్నారు. ఇంకా హీరో అయితే చెప్పక్కర్లేదు.
ఇది కూడా చూడండి: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ఆ రోజే వార్ 2 టీజర్ రిలీజ్
View this post on Instagram
ఇది కూడా చూడండి: వీరంతా అదృష్టవంతులు లేరు.. జీవితాంతం సుఖమయమే
-
Viral Video : సీటు కోసం ఇంత డ్రామానా? ఢిల్లీ మెట్రోలో వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!
-
Viral Video : సోషల్ మీడియా పిచ్చి..కదులుతున్న రైలుకు వేలాడుతూ రీల్..క్షణాల్లోనే ఊహించని ప్రమాదం!
-
Chinnaswamy Stadium: చిన్న స్వామి స్టేడియం కాదు.. స్విమ్మింగ్ పూల్.. స్నానం చేసిన ప్లేయర్
-
Alekhya Chitti Pickles: సినిమాల్లోకి అలేఖ్య చిట్టీ పికిల్స్ బ్యూటీ.. బంపర్ ఆఫర్ కొట్టేసింది.. హీరో ఎవరంటే?
-
Social Media : వర్చువల్ ప్రపంచం.. వెలివేసిన బంధాలు.. సోషల్ మీడియా తెచ్చే ఒంటరితనం ఎలా ఉంటుందంటే ?
-
Skin Care: ఉదయం లేచిన వెంటనే ముఖానికి వీటిని అప్లై చేస్తే.. మెరిసిపోవడం ఖాయం