Lunch Box : ఆఫీసుకు వెళ్లే వారికి గుడ్ న్యూస్.. ఈ లంచ్ బాక్స్ ఉంటే మైక్రోవేవ్ అక్కర్లేదు!

Lunch Box : ఆఫీసులో, స్కూల్‌లో లేదా కాలేజీలకు ఇంటి లంచ్ బాక్స్ తీసుకెళ్తుంటారు. తినే సమయానికి భోజనం చల్లబడి తినాలని చాలా మందికి అనిపించదు. అయితే అలాంటి వాళ్ల కోసం ఈ టిఫిన్ బాక్స్‌లు తీసుకొచ్చాయి కంపెనీలు. వీటి వల్ల చాలా లాభం ఉంటుంది. ఆహారాన్ని వేడి చేసుకోవడానికి ఎక్కడా మైక్రోవేవ్ ఓవెన్ వెతకాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడైనా ఒక ప్లగ్ చూసుకుని మీ ఆహారాన్ని మొత్తం వేడి చేసుకోవచ్చు. ఎప్పుడైనా, ఎక్కడైనా వేడి వేడి భోజనం తినే మజాను పొందవచ్చు. ఈ టిఫిన్ బాక్స్‌లను కొనడానికి ఎక్కడికీ వెళ్లక్కర్లేదు. ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయొచ్చు. ఇవి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్లలో తక్కువ ధరకే దొరుకుతున్నాయి.
సెల్లో న్యూటన్ ఎలక్ట్రిక్ లంచ్ బాక్స్
ఈ ప్లాస్టిక్ లంచ్ బాక్స్ చాలా తక్కువ ధరకే దొరుకుతోంది. మీరు దీన్ని కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల నుండి కూడా కొనుగోలు చేయవచ్చు. ఇది డిస్కౌంట్‌తో కేవలం రూ.1,319లకే లభిస్తోంది. ఈ టిఫిన్‌లో మూడు కలర్ ఆప్షన్లు ఉన్నాయి. వాటిలో మీకు నచ్చిన రంగును సెలక్ట్ చేసుకోవచ్చు.
Read Also:Packaged Milk : ప్యాకెట్ పాలను మరిగించి తాగాలా లేదా పచ్చివే తాగాలా.. నిపుణులు ఏమంటున్నారంటే ?
మిల్టన్ ఎలక్ట్రిక్ లంచ్ బాక్స్
మిల్టన్ కంపెనీకి చెందిన ఈ టిఫిన్ బాక్స్ చాలా క్లాసీగా, కాంపాక్ట్ సైజ్‌లో ఉంటుంది. ఇందులో మీకు మూడు వేర్వేరు బాక్స్‌లు ఉంటాయి. వాటిలో మీ ఆహారాన్ని ప్యాక్ చేసుకోవచ్చు. మీరు దీన్ని మీ టేబుల్‌పై ఉంచుకుని వేడి చేసుకోవచ్చు. కేవలం ఒక ప్లగ్‌లో స్విచ్ పెడితే చాలు. ఇందులో మీకు 4 కలర్ ఆప్షన్లు ఉన్నాయి. మీకు నచ్చిన దాన్ని సెలక్ట్ చేసుకోవచ్చు. దీన్ని మీరు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి డిస్కౌంట్‌తో రూ.1,209లకే కొనుగోలు చేయవచ్చు.
హెర్ర్ఫిల్క్ ఎలక్ట్రిక్ లంచ్ బాక్స్
ఈ పోర్టబుల్ ఫుడ్ టిఫిన్ బాక్స్ తక్కువ ధరకే దొరుకుతోంది. దీని డిజైన్ చాలా బాగుంటుంది. దీన్ని మీరు అమెజాన్ నుండి రూ.1,998లకే కొనుగోలు చేయవచ్చు. కొన్ని క్రెడిట్ కార్డులతో చెల్లింపు చేస్తే డిస్కౌంట్ కూడా పొందవచ్చు. వీటితో పాటు ఇంకా చాలా ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని మీరు తక్కువ ధరకే కొనుగోలు చేసి వేడి వేడి భోజనం తినే ఆనందాన్ని పొందవచ్చు.
Read Also:Urvashi Rautela : 70 ఏళ్ల వృద్ధురాలిని కాపాడేందుకు డ్రెస్సు చించుకున్న ఊర్వశి రౌతేలా!