Packaged Milk : ప్యాకెట్ పాలను మరిగించి తాగాలా లేదా పచ్చివే తాగాలా.. నిపుణులు ఏమంటున్నారంటే ?

Packaged Milk : ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి ఎన్నో పోషకాలు అవసరం. వాటిలో ముఖ్యమైనది కాల్షియం. ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం చాలా ముఖ్యం. కాల్షియం లోపాన్ని తగ్గించడానికి పాలు మంచి మార్గం. పిల్లల నుంచి పెద్దల వరకు పాలు తప్పకుండా తాగాలి.
పాలు మన శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. ఆవు పాలు, గేదె పాలు చాలా ఆరోగ్యకరమైనవి. అయితే, ఈ రోజుల్లో చాలా మంది మార్కెట్లో దొరికే ప్యాకెట్ పాలు వాడుతున్నారు. కొందరు ఈ పాలను మరిగించి తాగితే, మరికొందరు మరిగించకుండానే తాగేస్తుంటారు. ప్యాకెట్ పాలను పచ్చిగా తాగడం మంచిదా లేక మరిగించి తాగడం మంచిదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీనిపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.
ప్యాకెట్ పాలు మన ఇంటికి చేరే ముందు కొన్ని ప్రక్రియల ద్వారా వెళ్తాయి. దీనిని పాశ్చరైజేషన్ అంటారు. ఈ పాలను మరిగించి తాగాలా వద్దా అనే విషయంపై ఆయుర్వేద నిపుణులు చెప్పిన దాని ప్రకారం.. ప్యాకెట్ పాలను ఎప్పుడూ మరిగించి తాగాలి. ఈ పాలు ఎప్పుడు ప్యాక్ చేయబడ్డాయో, ఎప్పుడు మన ఇంటికి చేరాయో తెలీదు. కాబట్టి వాటిలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. అందుకే వీటిని ఎప్పుడూ మరిగించి తాగాలి.
Read Also:Viral Video : అదేమైనా నీ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నావా.. మొసలిని కౌగిలించుని డ్యాన్స్ ఏంట్రా బాబు
రోగనిరోధక శక్తి , జీర్ణక్రియ బలంగా ఉన్నవారు పచ్చిగా కూడా తాగవచ్చు. ఉదాహరణకు, వ్యాయామం చేసేవారు ప్యాకెట్ పాలను పచ్చిగా తాగవచ్చు. అయితే, బలహీనమైన జీర్ణశక్తి, తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారు పాలను ఎప్పుడూ మరిగించి తాగాలి.
పాలను ఎందుకు మరిగిస్తారు?
పాలలో ఉండే బ్యాక్టీరియా, హానికరమైన రసాయనాలను తొలగించడానికి పాలను మరిగిస్తారు. పాలను మరిగించడం వల్ల అందులోని బ్యాక్టీరియా వృద్ధి చెందడం తగ్గిపోతుంది. దీని వల్ల పాలు త్వరగా పాడవవు అని కూడా కొందరు నమ్ముతారు. అలాగే, పాలు విరిగిపోయే అవకాశాలు కూడా తగ్గుతాయి.
Read Also:Rana Naidu Season 2: ‘రానా నాయుడు 2’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఈ సారి అంతకుమించి
ప్యాకెట్ పాల వల్ల కలిగే ప్రయోజనాలు
పాశ్చరైజ్డ్ పాలు అని కూడా పిలవబడే ప్యాకెట్ పాలు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పాశ్చరైజేషన్ ప్రక్రియ ద్వారా హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తారు కాబట్టి ఈ పాలు ఎక్కువ కాలం సురక్షితంగా ఉంటాయి. అంతేకాకుండా, వీటిలో కొవ్వు శాతం కూడా తక్కువగా ఉంటుంది. దీని వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఎముకలకు ఇవి చాలా మంచివి.
-
Health Tips: ఈ చింతకాయ తింటే.. నూరేళ్లు ఆరోగ్యం పక్కా
-
How Many Times Eat a Day: మూడు సార్లు కాదు.. రోజుకి ఎన్నిసార్లు భోజనం చేస్తే ఆరోగ్యమంటే?
-
Covid Cover in Health Insurance: కరోనా మళ్లీ పెరిగింది.. మీ హెల్త్ ఇన్సూరెన్స్‌లో కోవిడ్ కవర్ ఉందో లేదో తెలుసుకోండి
-
Covid 19: మీ కారులో ఈ జాగ్రత్తలు తీసుకుంటే చలాన్ పడకుండానే కాదు.. కరోనా నుంచి సేఫ్!
-
Idli and Dosa: ఇడ్లీ, దోస విషయంలో ఈ మిస్టేక్స్ చేస్తున్నారా.. అంతే సంగతులు
-
Kidney Stones : వేసవిలో కిడ్నీ స్టోన్స్ ప్రమాదం.. ఎందుకు పెరుగుతాయి? ఎలా జాగ్రత్త పడాలి?