Viral Video : అదేమైనా నీ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నావా.. మొసలిని కౌగిలించుని డ్యాన్స్ ఏంట్రా బాబు

Viral Video : సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక వైరల్ వీడియో తెగ చెక్కర్లు కొడుతూనే ఉంటుంది. కొన్నిసార్లు అవి నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని సార్లు ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇంకొన్ని సార్లు భయపెడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మాత్రం షాక్ అవ్వడం ఖాయం. ఆ వీడియోలో ఓ వ్యక్తి మొసలితో కలిసి నదిలో డ్యాన్స్ చేస్తున్నాడు. ఏంటి పచ్చి మాసం తినే మొసలితో డ్యాన్స్ వినడానికే వింతగా ఉంది కదా.. కానీ ఇది నిజం.
మొసలి ఎంత క్రూరమైన జంతువు అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాని కాటు శక్తి 3700 PSI ఉంటుంది. ఇది క్షణాల్లో వేటాడిన జంతువుల ఎముకలను పొడి చేయగలదు. అలాంటి మొసలి నోటిలో ఎవరైనా చిక్కుకుంటే వారి పరిస్థితి ఏంటో తలుచుకుంటేనే భయం వేస్తుంది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఎందుకంటే, ఆ వైరల్ క్లిప్‌లో ఒక వ్యక్తి నది మధ్యలో మొసలితో కలిసి డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నాడు.
Read Also:Urvashi Rautela : 70 ఏళ్ల వృద్ధురాలిని కాపాడేందుకు డ్రెస్సు చించుకున్న ఊర్వశి రౌతేలా!
వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి నదిలో నిలబడి ఉన్నాడు. అతని పక్కనే ఒక మొసలి కూడా ఈదుతోంది. కానీ ఈ వ్యక్తి ఆ భయంకరమైన వేటగాడిని చూసి భయపడి పారిపోకుండా, ఆ జంతువును ఎత్తుకుని డ్యాన్స్ చేయడం మొదలుపెడతాడు. వీడియోలో చూస్తే మొసలి కూడా ఆ వ్యక్తితో ఎంతో ప్రేమగా కలిసిపోయింది. వారిద్దరినీ చూస్తే గర్ల్‌ఫ్రెండ్-బాయ్‌ఫ్రెండ్ లాగా అనిపిస్తుంది. ఈ వింత కెమిస్ట్రీని చూసి సోషల్ మీడియా జనాలు షాక్ అవడమే కాకుండా తెగ నవ్వుకుంటున్నారు. చాలా మంది నెటిజన్లు ఈ వీడియో అమెరికాలోని ఫ్లోరిడాకు చెందినదని చెబుతున్నారు. అక్కడ మొసళ్ళ ముందు ఇలా ధైర్యం చూపే పిచ్చివాళ్లు చాలా మంది కనిపిస్తారట.
@fishing.tribe అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ నుండి మే 12న అప్‌లోడ్ అయిన ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది. దీనిని ఇప్పటి వరకు 3 లక్షల 34 వేల మందికి పైగా లైక్ చేశారు. కామెంట్ బాక్స్ సరదా కామెంట్లతో నిండిపోయింది. ఒక యూజర్, “ఇలాంటి దృశ్యం అమెరికాలోని ఫ్లోరిడాలోనే కనిపిస్తుంది!” అని కామెంట్ చేశాడు. మరొక యూజర్ సరదాగా, “ఇద్దరూ ఎంత క్యూట్‌గా ఉన్నారు!” అని రాశాడు. ఇంకొక యూజర్, “మొసలి కూడా అనుకుని ఉంటుంది.. నన్ను జోక్ అనుకున్నావా ఏంటి?” అని రాసుకొచ్చాడు.
-
Scooty Accident Viral Video: కోడి కారణంగా స్కూటీ ప్రమాదం.. వీడియో వైరల్
-
Ravindra Jadeja : సచిన్ కూతురును చూసిన గిల్.. తల్లి అంజలి రియాక్షన్.. ఆట పట్టించిన జడేజా.. వైరల్ వీడియో
-
Sonu Sood : విమర్శకులకు చెప్పుతో కొట్టేలా జవాబిచ్చిన సోనూసూద్
-
Lavanya : వీడియోతో సహా అడ్డంగా బుక్కయిన లావణ్య
-
Viral Video : ఎవడు మమ్మీ వీడు ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడు.. కుక్క నుంచి తమ్ముడిని భలే కాపాడాడు
-
MS Dhoni Birthday: సింప్లిసిటీకి కేరాఫ్ ధోని.. క్రికెట్ చరిత్రలో ఓ పేజీ ఆయన సొంతం