Instagram : మీరు ఇన్స్టాగ్రామ్ యూజరా? ఈ కొత్త ఫీచర్‌తో రూ.16లక్షలు సంపాదించవచ్చు!

Instagram : ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ కేవలం ఫోటోలు లేదా వీడియోలు పోస్ట్ చేసే వేదిక మాత్రమే కాదు. ఇది చాలా మందికి డబ్బు సంపాదించే మార్గంగా మారింది. చాలా మంది ఇన్స్టాగ్రామ్ ద్వారా బాగా సంపాదిస్తున్నారు. మీరు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండి మంచి ఫాలోవర్లను కలిగి ఉంటే ఇన్స్టాగ్రామ్ కొత్త ఆఫర్ మీకు చాలా ప్రయోజనకరంగా ఉండొచ్చు. ఇన్స్టాగ్రామ్ కొత్త ప్రోగ్రామ్ ద్వారా భారతీయ యూజర్లకు ప్రయోజనం ఉంటుందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఇన్స్టాగ్రామ్ కొత్త ప్రోగ్రామ్ ఏమిటి?
ఇన్స్టాగ్రామ్ ఒక కొత్త రెఫరల్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇందులో కొంతమందికి మాత్రమే తమ స్నేహితులను లేదా తెలిసినవారిని ఇన్‌స్టాగ్రామ్‌లోకి తీసుకురావడం ద్వారా డబ్బు సంపాదించే అవకాశం లభిస్తుంది. మీరు షేర్ చేసిన లింక్ ద్వారా ఎవరైనా కొత్త యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లోకి వస్తే యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే లేదా ఏదైనా సర్వీసును ఉపయోగిస్తే.. మీకు గిఫ్టుగా డబ్బులు లభిస్తాయి. ఈ పథకంలో ఒకేసారి 20,000 డాలర్లు అంటే దాదాపు రూ.16 లక్షల వరకు సంపాదించవచ్చు.
ఈ రెఫరల్ లింక్ ఎలా పనిచేస్తుంది?
ఇన్స్టాగ్రామ్ మీకు ఒక ప్రత్యేకమైన లింక్‌ను క్రియేట్ చేస్తుంది. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ స్టోరీ లేదా ఏదైనా సోషల్ మీడియాలో ఈ లింక్‌ను మీరు ఎక్కడైనా షేర్ చేయవచ్చు. మీ లింక్ ద్వారా ఎవరైనా ఇన్‌స్టాగ్రామ్‌లో చేరినప్పుడు (ఉదాహరణకు యాప్ డౌన్లోడ్ చేసుకోవడం లేదా అకౌంట్ క్రియేట్ చేయడం) ద్వారా మీకు డబ్బులు వస్తాయి.
ఎవరికి లాభం?
ఈ పథకం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కంటెంట్ క్రియేటర్ అయితే దీన్ని ఉపయోగించుకోవచ్చు. విద్యార్థులు కూడా, సోషల్ మీడియాను ఉపయోగించుకుంటే ఈ ఫీచర్ ద్వారా బాగా సంపాదించవచ్చు. దీనికి మీరు పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రజలతో చక్కగా కనెక్ట్ అవ్వడం మీకు బాగా వచ్చి ఉండాలి.
Read Also:Trivikram-Poonam Kaur: త్రివిక్రమ్‌పై మరోసారి మండిపడ్డ పూనమ్.. నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ..!
భారతీయ యూజర్లకు అవకాశం ఉంటుందా?
ఈ ప్రోగ్రామ్ ప్రస్తుతం అమెరికాలో ప్రారంభించారు. కానీ భారతదేశంలో ఈ ప్రోగ్రామ్ రావడానికి ఇంకా కాస్త సమయం పట్టొచ్చు. ప్రస్తుతం భారతీయ యూజర్లకు డబ్బు సంపాదించడానికి అందుబాటులో ఉన్న ఇతర ఆప్షన్లను ఉపయోగించుకోవచ్చు.
రెఫరల్ లింక్ ఎలా క్రియేట్ చేయాలి?
మీరు ఈ ప్రోగ్రామ్‌కు అర్హులు అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వాలి.
* ముందుగా ఇన్‌స్టాగ్రామ్‌లో లాగిన్ అవ్వాలి.
* ఆ తర్వాత యాప్‌లోని ‘రెఫరల్’ లేదా ‘పార్ట్నర్షిప్’ సెక్షన్‌కు వెళ్లాలి.
* ఇప్పుడు మీ స్పెషల్ లింక్‌ను క్రియేట్ చేయాలి.
* ఈ లింక్‌ను మీకు తెలిసిన వారితో షేర్ చేయాలి.
* మీ లింక్ ద్వారా ఎంతమంది ఇన్‌స్టాగ్రామ్‌లో చేరారు. మీరు ఎంత సంపాదించారో యాప్‌లో చెక్ చేసుకోవచ్చు.
డబ్బు సంపాదించడానికి ఇతర మార్గాలు:
రెఫరల్ ప్రోగ్రామ్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో సంపాదించడానికి ఇతర మార్గాలు కూడా ఉన్నాయి. ఇందులో బ్రాండ్లతో డీల్స్ కుదుర్చుకోవచ్చు. స్పాన్సర్డ్ పోస్టులు పెట్టవచ్చు, గిఫ్ట్‌లు, ప్రమోషన్లు చేయవచ్చు. అయితే, ఈ కొత్త రెఫరల్ ప్రోగ్రామ్ ఇప్పుడే మొదలుపెట్టాలనుకునే వారికి ఒక అద్భుతమైన అవకాశం.
Read Also:Apple : 2025లో ఆపిల్ ప్లాన్.. కంపెనీ నుంచి రాబోయే ఐదు అదిరిపోయే ఉత్పత్తులు ఇవే!