Trivikram-Poonam Kaur: త్రివిక్రమ్‌పై మరోసారి మండిపడ్డ పూనమ్.. నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ..!

Trivikram-Poonam Kaur: టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ ఎప్పుడు వార్తల్లో హాట్ టాపిక్‌గా ఉంటుంది. తరచుగా సినీ పరిశ్రమలోని ప్రముఖులపై రెచ్చగొట్టే వ్యా్ఖ్యలు చేస్తుంటుంది. ప్రతీ విషయంపై స్పందిస్తుంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రతీ వాటికి స్పందిస్తుంది. అయితే పూనమ్ కపూర్ తాజాగా స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై మరోసారి ఆరోపణలు చేసింది. తాను చేసిన ఓ ఫిర్యాదును పట్టించుకోవడం లేదని ఇన్‌స్టా వేదికగా స్టోరీ పోస్ట్ చేసింది. ఎప్పుడూ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌పై ఆరోపణలు చేస్తుంటుంది. అసలు ఇద్దరి మధ్య ఏం జరిగిందనే విషయం అయితే వెల్లడించలేదు. అయితే మూవీ ఆర్టిర్ట్స్ అసోసియేషన్‌లో కమిటీ సభ్యురాలైన నటి ఝాన్సీని.. త్రివిక్రమ్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ద్వారా ప్రశ్నించింది. అయితే నటి పూనమ్ కౌర్ ఇప్పుడే కాదు.. గత నాలుగేళ్ల నుంచి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతుంది.
Read Also: నేడే హరి హర వీరమల్లు నుంచి పాట రిలీజ్.. పవన్, కీరవాణికి తెగ నచ్చేసిందట!
నేను గతంలో చెప్పా.. ఇప్పుడూ చెబుతున్నా.. ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాను. అలాగే ఝాన్సీతో మాట్లాడాను. నాతో మాట్లాడతానని చెప్పి.. ఆ తర్వాత ఆలస్యం చేస్తుంది. తనని అసలు డిస్టర్బ్ చేయవద్దని అంటోంది. అసలు నేను ఎవరి పేరు కూడా చెప్పలేదని ఆమె అంటోంది. కానీ నేను త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశానని పూనమ్ కౌర్ తెలిపింది. త్రివిక్రమ్‌ను రాజకీయ నేతలు, ఇండస్ట్రీలో ఉన్నవారు కాపాడుతున్నారని ఆమె అన్నారు. నేను ఇప్పుడు మహిళా సంఘంతో మాట్లాడతానని పూనమ్ ఇన్‌స్టాలో స్టోరీ పెట్టింది. ఇప్పుడు ఇది కాస్త వైరల్ అవుతోంది. అలాగే గత ఏడాది నుంచి ఝాన్సీతో టచ్‌లో ఉన్నట్లు ఆధారాలను కూడా పూనమ్ బయట పెట్టింది. అప్పుడు స్పందిస్తామని చెప్పి.. ఇప్పుడు స్పందించడం లేదని పూనమ్ తెలిపింది. అయితే వారి మధ్య ఏం జరిగిందనే విషయం అయితే క్లారిటీ లేదు. జానీ మాస్టర్ కేసు వైరల్ అయినప్పుడు కూడా పూనమ్ దీనిపై స్పందించింది. త్రివిక్రమ్ పై చర్యలు తీసుకొని ఉంటే ఇక్కడి వరకు వచ్చేది కాదని తెలిపింది.
Also Read: Small AC: రూ.2వేల లోపే ఏసీ లాంటి గాలి.. దీంతో ఈ వేసవికి గుడ్ బై చెప్పేయండి
ఇదిలా ఉండగా ఇటీవల పూనమ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కనిపించింది. సీఎంకు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చింది. ఈ విషయాన్ని పూనమ్ కపూర్ సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేసింది. పూనమ్ కౌర్ బహిరంగ సభలో కలవడంతో ఈమెకు చంద్రబాబు నాయుడు అంటే గౌరవం ఉంది ఏమోనని కొందరు భావిస్తున్నారు. మరికొందరు రాజకీయాల్లోకి పూనమ్ కౌర్ ఎంట్రీ ఇస్తుంది ఏమోనని అంటున్నారు. పూనమ్ చంద్రబాబు నాయుడికి ఓ ఆర్ట్‌ను బహుమతిగా ఇచ్చింది. అయితే ఆ ఆర్ట్ అమరావతి అభివృద్ధిని ప్రతిబింబించేలా ఉంది. అయితే పూనమ్ కౌర్ ఫొటోలో గతంలో ఉన్నట్లు లేదు. అప్పటి కంటే కాస్త బొద్దుగా కనిపించింది. దీంతో నెటిజన్లు ఇలా ఏంటి అయిపోయిందని కామెంట్లు చేస్తున్నారు. అయితే పూనమ్ కౌర్ కొన్ని రోజుల కిందట తన ఆరోగ్య పరిస్థితి బాలేదని తెలిపింది. పూనమ్‌కు ఫుడ్ అలెర్జీ ఉందని దీంతో పాటు ఫైబ్రోమయాల్జియా అనే వ్యాధి కూడా ఉన్నట్లు తెలిపింది. వీటి వల్ల తన శరీరం ఉబ్బుతుందని వెల్లడించింది.
-
Trivikram Bumper Offer: రుక్మిణి వసంత్‌కు త్రివిక్రమ్ బంపర్ ఆఫర్?
-
Monalisa: మహా కుంభమేళా మోనాలిసా కొత్త సాంగ్.. వీడియో చూశారా!
-
Photo Story: ఒకప్పటి స్టార్ హీరోయిన్.. చిన్నప్పుడు ఎంత బొద్దుగా ఉందో చూశారా?
-
Money: మెప్పు కోసం అప్పులు చేయకు మిత్రమా.. చేశావో అడుక్కు తింటావ్
-
Monalisa: స్టైల్ మార్చిన ‘వైరల్ గర్ల్’.. కొత్త ప్రయాణం మొదలుపెట్టిన మోనాలిసా
-
Anupama Parameswaran: అనుపమ డేటింగ్ చేసేది ఇతనితోనే.. వైరలవుతున్న ఫొటో