Apple : 2025లో ఆపిల్ ప్లాన్.. కంపెనీ నుంచి రాబోయే ఐదు అదిరిపోయే ఉత్పత్తులు ఇవే!

Apple : ఆపిల్ కంపెనీ ఉత్పత్తులకు క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దాని అభిమానులంతా కంపెనీ ఎప్పుడెప్పుడు ఏం కొత్తగా తీసుకొస్తుందా అని ఎదురు చూస్తుంటారు. అయితే 2025లో ఆపిల్ కంపెనీ నుంచి రాబోయే ఐదు కొత్త ఉత్పత్తులు ఏంటో చూద్దాం. ఐఫోన్ 16 సిరీస్ తర్వాత ఇప్పుడు అందరి చూపు ఈ సంవత్సరం లాంచ్ కానున్న ఐఫోన్ 17 సిరీస్ మీదే ఉంది. కొత్త ఐఫోన్ సిరీస్‌తో పాటు ఈ సంవత్సరం కొత్త మ్యాక్‌బుక్ ప్రో, ఐప్యాడ్ ప్రో కూడా వినియోగదారుల ముందుకు రానున్నాయి.
ఐఫోన్ 17 సిరీస్ (iPhone 17 Series)
ఐఫోన్ 17 సిరీస్‌ను ఏ19 ప్రాసెసర్‌తో లాంచ్ చేయొచ్చు. కొత్త ఐఫోన్ 17 ఎయిర్ మోడల్ 5.5mm సన్నగా ఉండొచ్చని, ఇది Samsung Galaxy S25 Edgeకు గట్టి పోటీనిస్తుందని అంటున్నారు. ఈ ఫోన్‌ను 48 మెగాపిక్సెల్ సింగిల్ రియర్ కెమెరా, 24 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో విడుదల చేయొచ్చు.
మ్యాక్‌బుక్ ప్రో ఎం5 (MacBook Pro M5)
ఆపిల్ కొత్త మ్యాక్‌బుక్ ప్రో మోడల్‌ను కొత్త M5 చిప్సెట్తో వినియోగదారుల కోసం లాంచ్ చేయొచ్చు. ఈ ల్యాప్‌టాప్ డిజైన్ ప్రస్తుత M4 వేరియంట్ లాగే ఉండొచ్చు, కంపెనీ కొత్త మోడల్లో కొత్త ప్రాసెసర్‌పై ఎక్కువ దృష్టి పెట్టొచ్చు.
Read Also:Cannes Festival: మెడలో మోదీ ఫొటోలు.. కేన్ ఫెస్టివల్లో నెక్లెస్‌తో అదరగొట్టిన బ్యూటీ
ఎం5 ఐప్యాడ్ ప్రో (M5 iPad Pro)
మ్యాక్‌బుక్ ప్రోతో పాటు ఐప్యాడ్ ప్రోను కూడా M5 ప్రాసెసర్‌తో విడుదల చేయొచ్చు. దీనితో పాటు ఇందులో ఇంకే ఇతర మార్పులు కనిపించవు. ఈ డివైజ్‌లో నానో టెక్చర్ గ్లాస్ డిస్ప్లేతో కూడిన ఓలెడ్ ప్యానెల్, LiDAR సెన్సర్‌తో పాటు 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఇవ్వొచ్చు.
కొత్త మ్యాక్ ప్రో (New Mac Pro)
కొత్త మ్యాక్ ప్రోను అప్‌గ్రేడ్ చేసిన M4 అల్ట్రా చిప్సెట్తో లాంచ్ చేయొచ్చు. ఈ ప్రాసెసర్ మెరుగైన పనితీరు , AI ప్రాసెసింగ్ సామర్థ్యంతో రావచ్చు. మీడియా నివేదికల ప్రకారం.. ఈ చిప్‌సెట్‌కు Hidra అనే కోడ్‌నేమ్ ఇచ్చారు.
ఎయిర్‌పాడ్స్ ప్రో (3వ తరం) (AirPods Pro (3rd Gen))
ఈ సంవత్సరం వినియోగదారుల కోసం ఆపిల్ కంపెనీ తర్వాతి తరం ఎయిర్‌పాడ్స్ ప్రోను లాంచ్ చేయొచ్చు. తర్వాతి తరం మోడల్ మెరుగైన ఆడియో పర్ఫామెన్స్, మెరుగైన నాయిస్ క్యాన్సిలేషన్ , ఇన్ఫ్రారెడ్ కెమెరా సెన్సార్ వంటి ఫీచర్లతో లాంచ్ కావచ్చు. ఆపిల్ అభిమానులకు ఈ కొత్త ఉత్పత్తులు పెద్ద పండుగను తీసుకురావడం ఖాయం.
Read Also:Monalisa: మహా కుంభమేళా మోనాలిసా కొత్త సాంగ్.. వీడియో చూశారా!