Cannes Festival: మెడలో మోదీ ఫొటోలు.. కేన్ ఫెస్టివల్‌లో నెక్లెస్‌తో అదరగొట్టిన బ్యూటీ

Cannes Festival: కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రపంచ సినిమా వేడుక మాత్రమే కాదు.. షో-స్టాపింగ్ ఫ్యాషన్‌కు వేదిక కూడా. ఈ కేన్ ఫెస్టివల్‌లో భారత నటీమణులు రకరకాల దుస్తులు ధరించి కనిపిస్తారు. అయితే ఈ సారి కేన్ ఫెస్టివల్‌లో నటి, మోడల్ రుచి గుజ్జర్ అద్భుతంగా కనిపించింది. మెడలో మోదీ ఫొటోలతో ఉన్న నెక్లెస్‌ను ధరించి ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. గుజ్జర్ పెండెంట్లను భారతీయ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించే నాటకీయ బంగారు లెహంగాతో కనిపించింది. దీనికి మోదీ ఫొటోలు ఉన్న ఈ నెక్లెస్‌ను ధరించింది. భారత్ దేశ అభివృద్ధిలో ముఖ్యమంత్రి మోదీ కీలక పాత్ర వహించారు. దానికి గుర్తుగా ఆమె ఈ నెక్లెస్‌ను ధరించినట్లు చెప్పింది. రుచి లెహంగాను రూప శర్మ రూపొందించింది. లెహంగాలో బంగారు రంగు పాలెట్ ఉండటంతో పాటు గోటా పట్టి ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్ ఉంది. రాజస్థాన్‌కి చెందిన రుచి చేతిలో దుప్పట్టా కూడా ఆకర్షించింది. ఈ దుప్పట్టా రాజస్థాన్ ఆత్మగౌరవాన్ని సూచిస్తుందని రుచి తెలిపారు.
Read Also: అమెరికా నుంచి పిలుపు.. వెళ్లడానికి మొగ్గు చూపని విద్యార్థులు
జైపూర్‌లోని మహారాణి కళాశాల నుంచి గుజ్జార్ డిగ్రీ పూర్తి చేసింది. సినీ ఇండస్ట్రీలో రాణించాలని ముంబైకి చేరుకుంది. అయితే 2023లో మిస్ హర్యానాగా నిలిచింది. అప్పటి నుంచి మ్యూజిక్ వీడియోలు చేస్తూ తన కంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. రాజస్థాన్‌లోని సాంప్రదాయ గుజ్జర్ కుటుంబం నుంచి రుచి వచ్చింది. అయితే ఈ గుజ్జర్ వాళ్లు సినీ ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉంటారట. ఈ గుజ్జర్ కుటుంబంలోని మహిళలు పనిచేస్తే వింతగా చూస్తారట. కానీ వాటి అన్నింటిని కూడా దాటుకుని రుచి సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. వారి కమ్యూనిటీ నుంచి బాలీవుడ్‌కి వచ్చిన మొదట మహిళ కూడా రుచి గుజ్జర్. అయితే కుటుంబం సపోర్ట్‌తోనే ఇదంతా అని ఆమె తెలిపారు. తన తండ్రి ఎంతగానో సపోర్ట్ చేయడం వల్ల ఈ రంగం వైపు అడుగులు వేసినట్లు తెలిపారు.
Also Read: Small AC: రూ.2వేల లోపే ఏసీ లాంటి గాలి.. దీంతో ఈ వేసవికి గుడ్ బై చెప్పేయండి
బాలీవుడ్‌లో వర్క్ చేయడానికి ముంబైకి వెళ్లాలనుకుంటున్నానని తల్లికి చెబితే భయపడింది. కానీ ఇప్పుడు తనని చూసి గర్వ పడుతున్నారని చెప్పింది. ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు తన తల్లిదండ్రులు తనకి సపోర్ట్ చేశారని చాలా ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది. రుచి గుజ్జార్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రధాని మోదీ ఫొటోలు ఉన్న నెక్లెస్ ధరించి ఉన్న ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మొత్తం ప్రపంచం ప్రధాని మోదీ ఫొటోలు ఉన్న నెక్లెస్‌ను ధరించాయి. అసలు ఆమె ఎందుకు ధరించిందని కారణంతో ప్రపంచం మొత్తం చూస్తోంది.