Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Education News »
  • Iit Baba Iit Baba Very Talented

IIT Baba: ఐఐటీ బాబా వెరీ టాలెంటెడ్.. ఇతని మార్క్ షీట్ చూస్తే కళ్లు జిగేలుమనాల్సిందే

IIT Baba: ఐఐటీ బాబా వెరీ టాలెంటెడ్.. ఇతని మార్క్ షీట్ చూస్తే కళ్లు జిగేలుమనాల్సిందే
  • Edited By: NARESH ENNAM,
  • Updated on March 9, 2025 / 03:18 AM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

IIT Baba:

ఐఐటీ బాబా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో ఈ ఐఐటీ బాబా పాపులర అయ్యాడు. ఇంజనీర్ చదివిన ఈ బాబా ఉద్యోగాన్ని వదిలసి అధ్యాత్మిక మార్గం వైపు వెళ్లాడు. అప్పటి నుంచి ఐఐటీ బాబాగా పేరు పొందాడు. నిజానికి ఐఐటీ బాబా ఒరిజినల్ పేరు అభయ్ సింగ్. అధ్యాత్మికం వైపు వెళ్లిన తర్వాత బాబాగా మార్చుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన ఐఐటీ బాంబేలో చదివి.. లక్షలు జీతాన్నిచ్చే ఉద్యోగాన్ని సంపాదించాడు. కానీ ఆ తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలేసి.. అధ్యాత్మికం వైపు వెళ్లాడు. అయితే మహా కుంభమేళాలో ఐఐటీ బాబా ఫేమస్ అయినప్పటి నుంచి వార్తల్లోకి ఎక్కుతున్నాడు. ఏదో ఒక కారణంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. అయితే ప్రస్తుతం ఐఐటీ బాబా మార్క్ షీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం బాబాగా మారిపోయాడు. కానీ విద్యార్థిగా మంచి మార్కులు సంపాదించాడు. పది, ఇంటర్ లో ఐఐటీ బాబా మంచి మార్కులే సంపాదించాడు. ఏరోస్పేస్‌లో ఇంజనీరింగ్ చదివిన బాబాకి పదవ తరగతిలో 93 శాతం మార్కులు వచ్చాయి. 12 వ తరగతిలో 92.4 శాతం మార్కులు వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఐఐటీ జేఈఈలో 731 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. మంచి టాలెంట్ ఉండటంతో ఇతనికి కెనడాలో రూ.36 లక్షల ప్యాకేజీ ఉద్యోగం కూడా లభించింది. కానీ ఈ ఉద్యోగాన్ని విడిచి అధ్యాత్మిక మార్గం వైపు బాబా వెళ్లిపోయాడు. హర్యానికి చెందిన ఈ బాబా మంచి ఉద్యోగం విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి అధ్యాత్మిక మార్గంలోకి వెళ్లాడు.

ఇదిలా ఉండగా ఐఐటీ బాబా ఇటీవల టీమిండియా జ్యోతిష్యం చెప్పారు. ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఓడిపోతుందని తెలిపారు. ఫిబ్రవరి 23న దుబాయ్ వేదికగా పాక్, టీమిండియా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌పై ఐఐటీ బాబా జ్యోతిష్యం చెప్పాడు. పాక్ చేతిలో భారత్ ఓటమి తప్పదని ఐఐటీ బాబా జ్యోతిష్యం చెప్పాడు. భారత్‌ ఓడిపోతుందని చెప్పడంతో టీమిండియా ఫ్యాన్స్ అతనిపై మండి పడ్డారు. ఇండియన్ అయి ఉండి భారత్ ఓడిపోతుందని చెప్పడం ఏంటని విమర్శించారు. విరాట్ కోహ్లీతో పాటు మిగతా ఆటగాళ్లు ఎంత కష్టపడినా కూడా ఫలితం లేదని ఐఐటీ బాబా అన్నాడు. దేవుడి కన్నా ఎవరూ గొప్ప కాదని.. ఏం జరుగుతుందో చూద్దామని ఐఐటీ బాబా ఓ ఇంటర్వూలో తెలిపాడు. దీంతో నెటిజన్లు అతనిపై మండిపడ్డారు. ఆ తర్వాత భారత్ గెలవడంతో అతని జ్యోతిష్యం తప్పని, అలాంటి వాటిని నమ్మవద్దని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

Tag

  • Haryana
  • IIT Baba
  • Mumbai IIT
Related News
  • Cannes Festival: మెడలో మోదీ ఫొటోలు.. కేన్ ఫెస్టివల్‌లో నెక్లెస్‌తో అదరగొట్టిన బ్యూటీ

  • Jyoti Malhotra : ప్రియుడితో వేషాలు.. పాకిస్తాన్ కు భారత రహస్యాలు..యూట్యూబర్ అరెస్ట్

  • Champions Trophy: పాక్ చేతిలో ఇండియా ఓటమి తప్పదు.. ఐఐటీ బాబా జ్యోతిష్యం

Latest Photo Gallery
  • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

  • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

  • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

  • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

  • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

  • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

  • Jyoti Purvaj : జ్యోతి చీరలో ఎంత అందంగా ఉందో కదా..

  • Akanksha Puri: ఆకాంక్ష పూరి అందం, ఫ్యాషన్ ముందు ఆకాశం చిన్నబోతుందేమో?

  • Rakul Preet Singh : అందంతో మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్

  • Nikita Sharma: బీచ్ పక్కన ఈ బ్యూటీని చూస్తూ ప్రకృతి కూడా మురిసిపోతుంది కావచ్చు..

Trending Telugus
  • Telangana
  • Andhra Pradesh
  • Entertainment
  • Sports
  • Technology
  • Lifestyle
  • Crime
  • Business
  • Education
  • Spiritual

© 2025 All Rights Reserved

Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us