Champions Trophy: పాక్ చేతిలో ఇండియా ఓటమి తప్పదు.. ఐఐటీ బాబా జ్యోతిష్యం

Champions Trophy:
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రస్తుతం పాకిస్థాన్, దుబాయ్ వేదికగా జరుగుతోంది. ఫిబ్రవరి 19న ప్రారంభమైన ఈ టోర్నీలో టీమిండియా బంగ్లాదేశ్‌పై గెలిచింది. అయితే అందరూ ఎంతగానో ఎదురుచూసే భారత్, పాక్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అందరూ కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌పై అందరికీ కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఎవరు గెలుస్తారని ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నారు. అయితే పాక్, భారత్ మధ్య జరగబోయే ఈ మ్యాచ్‌పై ఐఐటీ బాబా జ్యోతిష్యం చెప్పాడు. ప్రస్తుతం ఇవి సంచలనం రేపుతున్నాయి. పాక్ చేతిలో భారత్ ఓటమి తప్పదని ఐఐటీ బాబా జ్యోతిష్యం చెప్పాడు. భారత్ ఓడిపోతుందని చెప్పడంతో టీమిండియా ఫ్యాన్స్ అతనిపై మండి పడుతున్నారు. ఇండియన్ అయి ఉండి భారత్ ఓడిపోతుందని చెప్పడం ఏంటని అంటున్నారు. ప్రస్తుతం బాబా జ్యోతిష్య వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. విరాట్ కోహ్లీతో పాటు మిగతా ఆటగాళ్లు ఎంత కష్టపడినా కూడా ఫలితం లేదని ఐఐటీ బాబా అన్నాడు. దేవుడి కన్నా ఎవరూ గొప్ప కాదని.. ఏం జరుగుతుందో చూద్దామని ఐఐటీ బాబా ఇటీవల ఓ ఇంటర్వూలో తెలిపాడు. దీంతో నెటిజన్లు అతనిపై మండిపడుతున్నారు. ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభామేళ జరుగుతుంది. ఇందులో ఐఐటీ బాబా ప్రపంచానికి పరిచయడం అయ్యాడు. అబే సింగ్ అయిన ఆ బాబా ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివాడు. కానీ బాబాగా మారిపోయాడు. లక్షల ప్యాకేజీ ఉద్యోగం వదిలేసి బాబాగా మారిపోయాడు.
IIT Baba's shocking claim sparks huge debate..
#IITBaba #ICCChampionsTrophy2025 #Cricket #TeamIndia pic.twitter.com/RoAj03Hx0l
— Orissa POST Live (@OrissaPOSTLive) February 21, 2025
ఇదిలా ఉండగా భారత జట్టు ఛాంపియన్స్‌లో ట్రోఫీలో మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్‌పై గెలిచింది. 23వ తేదీన భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే మొదటి మ్యాచ్ భారత్ గెలవగా.. పాకిస్థాన్ న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. ఈ రెండు జట్లు తలపడనున్నాయి. భారత్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోతే ఇక ఇంటికే. సెమీ ఫైనల్‌కి చేరే అవకాశం లేదు. గ్రూప్ దశలో ఒక్కో జట్టు మిగతా జట్లుతో తలపడనుంది. వీటిలో ఎక్కువ మ్యాచ్‌లు గెలిచిన జట్టు సెమీస్‌కు వెళ్తుంది. అయితే గ్రూప్ ఎ, గ్రూప్ బి జట్లు ఆడుతాయి. రెండింటిలో విజయం సాధించిన జట్టు సెమీస్‌కు వెళ్తాయి. అయితే ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్, పాకిస్థాన్ మొత్తం ఐదు సార్లు తలపడ్డాయి. ఇందులో పాక్ మూడు సార్లు గెలవగా.. భారత్ రెండు సార్లు గెలిచింది.
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?
-
Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?
-
ICC Champions Trophy: టీమిండియా విన్నింగ్ చూసి.. చిన్నపిల్లాడిలా సునీల్ గవాస్కర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో!
-
Viral Video: విన్నింగ్ మూమెంట్‌ను ఎంజాయ్ చేస్తూ.. దాండియా, హోలీ ఆడిన రోహిత్, విరాట్.. వీడియో వైరల్
-
ICC Champions Trophy: ఇండియా విన్.. కానీ షమీ ఖాతాలో చెత్త రికార్డు