Monalisa: మహా కుంభమేళా మోనాలిసా కొత్త సాంగ్.. వీడియో చూశారా!

Monalisa: మహా కుంభమేళాలో ఓవర్ నైట్ ఫేమస్ అయిన మోనాలిసా భోంస్లే గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరికీ కూడా ఈమె గురించి తెలుసు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌కి చెందిన మోనాలిసా కుంభమేళాలో పూసల దండలు అమ్మేది. ఈ సమయంలో యూట్యూబర్లకు కనిపించడంతో ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అంతే ఇక ఒక్క రాత్రిలోనే ఆమె సెలబ్రిటీ అయిపోయింది. మహా కుంభమేళా నుంచి ఇప్పటి వరకు ఎక్కడ చూసినా కూడా ఆమె కనిపిస్తోంది. ఇప్పటికీ ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసినా కూడా మోనాలిసానే దర్శనమిస్తోంది. అయితే ఇలా ఫేమస్ అయిన తర్వాత ఆమెకు మూవీ ఆఫర్ కూడా వచ్చింది. ఆ తర్వాత ఈ డైరెక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
Read Also: అమెరికా నుంచి పిలుపు.. వెళ్లడానికి మొగ్గు చూపని విద్యార్థులు
అతను ఒక మోసగాడు అని, సినిమా అవకాశాల పేరుతో ఆమెను ట్రాప్ చేశాడని అన్నారు. మరి ఈ మొదటి సినిమా ఏమైందనే అప్డేట్ అయితే రాలేదు. అయితే ఇప్పుడు మోనాలిసా మరో సాంగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. ఈ సాంగ్ షూటింగ్ సన్నివేశాలను విడుదల చేశారు. త్వరలోనే ఈ పాట విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ సాంగ్‌లో మోనాలిసా చాలా అందంగా ఉంది. మేకప్ వేసి బాగా రెడీ చేయడం వల్ల అందంగా కనిపిస్తోంది. అయితే మోనాలిసా యాక్టింగ్ స్కూల్‌కి వెళ్లి నేర్చుకుంటుంది. అందుకే ఎక్స్‌ప్రెషన్స్ కూడా బాగా ఇస్తోంది. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఒకే వేళ హిట్ అయితే మాత్రం తప్పకుండా ఈమెకు ఛాన్స్‌లు వరుసగా వచ్చే అవకాశం ఉంది.
Also Read: Small AC: రూ.2వేల లోపే ఏసీ లాంటి గాలి.. దీంతో ఈ వేసవికి గుడ్ బై చెప్పేయండి
మోనాలిసాకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. మహా కుంభమేళా తర్వాత పలు షాపు ఓపెనింగ్స్‌కి వెళ్లింది. అలాగే యూట్యూబ్‌లో వీడియోలు కూడా చేస్తుంది. దీంతో ఆమెకు ఫాలోవర్లు కూడా పెరుగుతున్నారు. ఏది ఏమైనా మోనాలిసా లక్కీ ఛాన్స్ కొట్టేసిందని చెప్పవచ్చు. అయితే ఈమెకు నటన రాదని, నటించలేదని చాలా మంది సోషల్ మీడియాలో ఈమెను ట్రోల్ కూడా చేశారు. ఈమెకు మాట్లాడటం కూడా సరిగ్గా రాదని చాలా మంది ట్రోల్ చేశారు. అయితే ఇప్పుడు మోనాలిసా అన్ని అలవాట్లు కూడా మార్చుకున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలు కూడా షేర్ చేస్తుంది. మోనాలిసాకు ఉన్న క్రేజ్‌కి ఒక్క ఛాన్స్ వస్తే చాలు. టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోవడం ఖాయం అని నెటిజన్లు అంటున్నారు. మరి మోనాలిసా చేసిన ఈ స్పెషల్ ఎలా ఉంటుందో చూడాలి.
जल्द ही आने वाला है मोनालिसा कुम्भ का नया म्यूजिक एल्बम, इस वायरल गर्ल का नया लुक देखकर उड़ जाएंगे आपके होश..😉😎#monalisa #मोनालिसा pic.twitter.com/gL7VOuZCbf
— akansha shreyan (@AkanshaShreyan) May 21, 2025
-
Trivikram-Poonam Kaur: త్రివిక్రమ్‌పై మరోసారి మండిపడ్డ పూనమ్.. నా దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ..!
-
Monalisa : మోనాలిసా డైమండ్ మెరుపులు చూశారా.. బ్లాక్ సూట్‌లో మెరిసిన బ్లాక్ బ్యూటీ
-
Photo Story: ఒకప్పటి స్టార్ హీరోయిన్.. చిన్నప్పుడు ఎంత బొద్దుగా ఉందో చూశారా?
-
Money: మెప్పు కోసం అప్పులు చేయకు మిత్రమా.. చేశావో అడుక్కు తింటావ్
-
Monalisa: స్టైల్ మార్చిన ‘వైరల్ గర్ల్’.. కొత్త ప్రయాణం మొదలుపెట్టిన మోనాలిసా
-
Anupama Parameswaran: అనుపమ డేటింగ్ చేసేది ఇతనితోనే.. వైరలవుతున్న ఫొటో