BSNL Plan : ప్రత్యర్థులకు చెమటలు పట్టించేలా బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్.. ఏడాదంతా అన్ లిమిటెడ్ కాల్స్, 600జీబీ డేటా

BSNL Plan : ప్రైవేట్ టెలికాం కంపెనీలు జియో, ఎయిర్టెల్ తమ రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెంచినప్పటి నుంచీ చాలామంది యూజర్లు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే, బీఎస్ఎన్ఎల్ మాత్రమే తక్కువ ధరలో ఎక్కువ లాభాలు ఇస్తోంది. తాజాగా, ఈ కంపెనీ తన కొత్త తరం బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ Q-5G ని కూడా మొదలుపెట్టింది. దీనికి ది క్వాంటమ్ లీప్ అని పేరు పెట్టారు. ఇది 5జీ టెక్నాలజీతో పనిచేసే ఒక వైర్లెస్ ఇంటర్నెట్ సర్వీస్.
ఈ బీఎస్ఎన్ఎల్ Q-5G లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే.. దీన్ని మీరు సిమ్ కార్డు లేకుండా ఎలాంటి వైర్ల గొడవ లేకుండానే వాడుకోవచ్చు. అంటే, సిమ్ కార్డు కోసం తిరగాల్సిన పని లేదు.. ఇంట్లో కేబుల్ వైర్ల గజిబిజి కూడా ఉండదు. అయితే, ఇదంతా ఒకెత్తు అయితే బీఎస్ఎన్ఎల్ ఇప్పుడు తన ప్రీపెయిడ్ యూజర్లకు కూడా ఒక అదిరిపోయే ప్లాన్‌ను ఇస్తోంది. ఈ ప్లాన్‌లో ఏకంగా 365 రోజుల వాలిడిటీతో పాటు 600 జీబీ డేటా కూడా వస్తుంది.
Read Also:Elon Musk : సూపర్ యాప్ గా మారబోతున్న .. మస్క్ X యాప్.. ఇక అన్నీ దాని నుంచేనట
బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఈ సూపర్ ప్లాన్ ధర రూ.1,999. ఈ ప్లాన్‌లో కంపెనీ మీకు ఒక సంవత్సరం వాలిడిటీ ఇస్తుంది. దీంతో పాటు 600 జీబీ డేటా ఇస్తుంది. ఈ డేటాను ఏడాదిలో ఎప్పుడైనా, ఎంతైనా వాడుకోవచ్చు. అయితే, 600 జీబీ డేటా అయిపోయాక, మీ ఇంటర్నెట్ స్పీడ్ కాస్త తగ్గి 40kbps అవుతుంది. ఇంటర్నెట్ పూర్తిగా ఆగిపోదు. కానీ నెమ్మదిస్తుంది. ఇంటర్నెట్ మాత్రమే కాదు, ఈ ప్లాన్‌లో మీకు అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం కూడా ఉంది. ఏడాది పొడవునా ఎంత కావాలంటే అంత మాట్లాడుకోవచ్చు.. ఎవరికైనా కాల్ చేసుకోవచ్చు.
ఈ ప్లాన్‌లో మీకు 100 ఎస్సెమ్మెస్‌లు కూడా ఫ్రీగా వస్తాయి. అంతే కాదు, బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్‌తో కొన్ని ఎక్స్ట్రా లాభాలు కూడా ఇస్తోంది. ఫ్రీగా కాలర్ ట్యూన్‌ను వాడుకోవచ్చు. అలాగే, జింగ్ యాప్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే, ఇంత తక్కువ ధరలో ఇంత ఎక్కువ వాలిడిటీ, డేటా, అన్లిమిటెడ్ కాల్స్‌తో ఈ ప్లాన్ చాలా బాగుంది. ఈ ప్లాన్ తీసుకుంటే మీకు ఏడాది పాటు రీఛార్జ్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు.