Jio’s Big Offer: జియో యూజర్లకు గుడ్ న్యూస్..రూ.100కే జియోహాట్‌స్టార్ 90 రోజులు, 5GB డేటా!

Jio’s Big Offer: మీరు గనుక జియో కస్టమర్ అయితే ఒక అద్భుతమైన ప్లాన్ గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ ప్లాన్ చాలా లాభదాయకంగా ఉంటుంది.జియో అందిస్తున్న ఈ డేటా ప్లాన్ మీకు హై స్పీడ్ డేటా మాత్రమే కాదు.. జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌తో 90 రోజుల పాటు జియోహాట్‌స్టార్‌లో ఉన్న కంటెంట్‌ను చూడవచ్చు. ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రీమియం కంటెంట్‌ను ఆస్వాదించడానికి ఈ ప్లాన్ ఒక మంచి అవకాశం.
ఈ ప్లాన్ కేవలం రూ.100 ఖర్చుతో 90 రోజుల వ్యాలిడిటీతో పాటు జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్‌లో మీకు 5GB హై స్పీడ్ డేటా లభిస్తుంది. ఇది మీ ప్రస్తుత ప్లాన్‌కు అదనంగా పని చేస్తుంది. అయితే ఈ ప్లాన్‌లో కాలింగ్ సౌకర్యం ఉండదు. ఇది కేవలం డేటా ప్యాక్ మాత్రమే.
జియో తన యూజర్ల వినోదం కోసం ఎప్పుడూ ముందుంటుంది. జియో అందిస్తున్న మరికొన్ని ప్లాన్లు ఇక్కడ ఉన్నాయి
* Jio 899 రూపాయల ప్లాన్ (90 రోజులు)
ఈ ప్లాన్‌లో మీకు అన్లిమిటెడ్ కాలింగ్, ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్లు, హై స్పీడ్ డేటా లభిస్తుంది. రోజుకు 2GB డేటా + అదనంగా 20GB డేటాను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో మొత్తం 90GB డేటా లభిస్తుంది. ఇది 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌లో 90 రోజుల పాటు జియోహాట్‌స్టార్ ప్రీమియం కంటెంట్‌ను కూడా చూడవచ్చు. జియోహాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. దీంతో పాటు, మీకు జియో క్లౌడ్ సబ్స్క్రిప్షన్ కూడా ఉచితం.
Jio 1049 రూపాయల ప్లాన్ (84 రోజులు)
ఈ ప్లాన్ పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. మీకు 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఈ ప్లాన్‌లో Sony LIV, ZEE5 సబ్స్క్రిప్షన్లు కూడా ఉచితంగా లభిస్తాయి. మొత్తం 168GB డేటా లభిస్తుంది. ప్రతిరోజూ 2GB హై స్పీడ్ ఇంటర్నెట్ వాడుకోవచ్చు. రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితం.ఈ ప్లాన్ గొప్ప విషయం ఏమిటంటే.. ఇందులో మీకు అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనం లభిస్తుంది. మీరు గంటల తరబడి ఎవరితోనైనా మాట్లాడవచ్చు.
Read Also:Ration Distribution : కేంద్రం ఆదేశాలు.. పేదలకు ముందుగానే సన్న బియ్యం..మూడు నెలల రేషన్ ఒకేసారి.. ఎందుకంటే?
Jio 1029 రూపాయల ప్లాన్ (84 రోజులు)
ఈ ప్లాన్‌లో మీకు అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ఇది హై స్పీడ్ డేటాను అందిస్తుంది. అన్లిమిటెడ్ కాలింగ్‌తో పాటు.. ఈ ప్లాన్ మొత్తం 168 GB డేటాను అందిస్తుంది.ప్రతిరోజూ 2GB డేటా ఉపయోగించుకోవచ్చు. 90 రోజుల పాటు జియోహాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది.