Trending Telugus
Trending Telugus Ads
  • Home Icon
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • ఎంటర్టైన్మెంట్
  • క్రీడలు
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • విద్య
  • ఆధ్యాత్మికం
  • క్రైమ్
  • వీడియోలు
  • ఫోటో గేలరీ
  • Trending Telugus Twitter
  • Trending Telugus WhatsApp
  •  Trending Telugus Instagram
  • Trending Telugus YouTube
trending-icon

Trending

  • హెల్త్ కేర్
  • లైఫ్ స్టైల్
  • లేటెస్ట్ తెలుగు
  • ఐపీల్
  • లేటెస్ట్ టాలీవుడ్
  • వాస్తు టిప్స్
  • Home »
  • Technology News »
  • Lenovo Laptop At Just Rs 9999 Offers 16 Hours Of Battery Backup

Lenovo Laptop : తక్కువ ధరలో పవర్ ప్యాక్డ్ .. రూ.9,999లకే లెనోవో ల్యాప్‌టాప్

Lenovo Laptop : తక్కువ ధరలో పవర్ ప్యాక్డ్ .. రూ.9,999లకే లెనోవో ల్యాప్‌టాప్
  • Edited By: rocky,
  • Updated on May 26, 2025 / 04:33 PM
  • Facebook
  • Twitter
  • WhatsApp
  • instagram

Lenovo Laptop : కొత్త ల్యాప్‌టాప్ కొనాలనుకుంటున్నారా? కానీ మీ బడ్జెట్ కేవలం 10 వేల రూపాయలలోపే ఉందా? అయితే ఇక చింతించాల్సిన అవసరం లేదు. ఈ తక్కువ ధరలో కూడా ఒక అద్భుతమైన ల్యాప్‌టాప్ అందుబాటులో ఉంది. అది కూడా అదిరిపోయే బ్యాటరీ బ్యాకప్‌తో. ఆ ల్యాప్‌టాప్ పేరు Lenovo 100e Chromebook. తక్కువ బడ్జెట్‌లో మంచి పర్ఫార్మెన్స్ కోరుకునే కస్టమర్‌లకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనడంలో సందేహం లేదు.

ఈ లెనోవో ల్యాప్‌టాప్‌లో ఉన్న ఫీచర్లు ఆకట్టుకుంటాయి. 11.6 అంగుళాల HD రిజల్యూషన్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో 250 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. మీడియాటెక్ కొంపానియో (MediaTek Kompanio) 520 ప్రాసెసర్‌ను ఉపయోగించారు.4GB ర్యామ్, ఫైల్స్, యాప్స్ కోసం 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో (సైనిక ప్రమాణాల నాణ్యతతో) వస్తుంది. అంటే చాలా క్వాలిటీ ఉంటుంది. ఇందులో గూగుల్ జెమిని (Google Gemini) సపోర్ట్ కూడా ఉంది. ఇది ఈ బడ్జెట్‌లో చాలా అరుదు. ప్రైవసీ షట్టర్‌తో కూడిన HD 720p ఫ్రంట్ కెమెరా ఉంది. బ్లూటూత్ వెర్షన్ 5.1 సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి USB టైప్-C పోర్ట్ ఇచ్చారు. కేవలం 1.23 కిలోల బరువుతో చాలా తేలికగా ఉంటుంది.

Read Also:Yuzvendra Chahal : ప్రీతి జింటా టాప్-2 ఆశలకు యుజ్వేంద్ర చాహల్ బ్రేక్

ఈ ల్యాప్‌టాప్ అతిపెద్ద ఆకర్షణ దాని బ్యాటరీ లైఫ్. ఫ్లిప్‌కార్ట్‌లో ఇచ్చిన వివరాల ప్రకారం.. గూగుల్ పవర్ లోడ్ టెస్ట్‌లో ఈ ల్యాప్‌టాప్ అద్భుతంగా పని చేసింది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, ఇది ఏకంగా 16 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. రోజంతా వాడినా ఛార్జింగ్ గురించి భయం ఉండదు.

ఈ ల్యాప్‌టాప్ కొనుగోలుపై కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. 100GB గూగుల్ వన్ (Google One) స్టోరేజ్ ఉచితంగా లభిస్తుంది. మూడు నెలల పాటు యూట్యూబ్ ప్రీమియం (YouTube Premium) ఉచిత యాక్సెస్ కూడా లభిస్తుంది. 1 సంవత్సరం వారంటీతో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ లెనోవో 100e క్రోమ్‌బుక్ రూ.9,999 కు అమ్ముడవుతోంది. ఇంకా తక్కువ ధరకే కావాలంటే, కొన్ని బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా (EMI) కార్డుతో కొనుగోలు చేస్తే 10శాతం(రూ.1500 వరకు) డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ (EMI)తో కొనుగోలు చేస్తే 10% (రూ.1000 వరకు) డిస్కౌంట్ లభిస్తుంది. SBI క్రెడిట్ కార్డ్ (EMI) 10శాతం (రూ.1500 వరకు), యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో 10శాతం(రూ.1000 వరకు) లభిస్తుంది.

Read Also:Lost your Aadhaar card: ఆధార్ కార్డు పోయిందా.. ఇక నో టెన్షన్

ప్రస్తుతం 10 వేల రూపాయల లోపు ధరలో ఈ లెనోవో ల్యాప్‌టాప్ ఒక్కటే అందుబాటులో ఉంది. అయితే, ఇది జియోబుక్ 11 (ఫ్లిప్‌కార్ట్‌లో రూ.12,990), ప్రైమ్‌బుక్ 4G (ఫ్లిప్‌కార్ట్‌లో రూ.14,490) వంటి వాటికి గట్టి పోటీనిస్తుందని చెప్పొచ్చు. తక్కువ ధరలో మంచి క్వాలిటీ, బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి ఈ లెనోవో క్రోమ్‌బుక్ ఒక మంచి అవకాశం.

Tag

  • 16 Hour Battery
  • Chromebookm Budget Laptop
  • Laptop Deals
  • Lenovo 100e Chromebook
  • Lenovo Laptop
Related News
    Latest Photo Gallery
    • Divi Vadthya: గ్లామర్ తో కవ్విస్తున్న దివి

    • Shreya Chaudhry: శ్రేయా చౌదరి గ్లామరస్ లుక్ వైరల్

    • Disha Patani: సోగసుల వల వేస్తూ రెచ్చగొడుతున్న దిశా పటాని

    • Ruhani Sharma: చీరకట్టులో వినయంగా రుహాణి

    • Vaishnavi Chaitanya: చీరలో బేబీ హీరోయిన్ ఫొటోలు అదుర్స్

    • Sreeleela: శ్రీలీల లెటెస్ట్ పొటోలు వైరల్

    • Ananya Nagalla: అనన్య నీ అందాలు కేక

    • Anasuya Bharadwaj: అనసూయ అందాలు తట్టుకోలేం బాబోయ్

    • Sravanthi Chokkarapu: బీచ్‌లో పొట్టి దుస్తులతో చిల్ అవుతున్న యాంకర్.. స్టిల్స్‌తో కుర్రాళ్ల మతి పోగొడుతుందిగా!

    • Ananya Nagalla: చీరలో అదిరిపోతున్న అనన్య నాగళ్ల

    Trending Telugus
    • Telangana
    • Andhra Pradesh
    • Entertainment
    • Sports
    • Technology
    • Lifestyle
    • Crime
    • Business
    • Education
    • Spiritual

    © 2025 All Rights Reserved

    Disclaimer About Us Advertise With Us Privacy Policy Contact Us