Sunita Williams: 59 ఏళ్ల వయసు.. 9 స్పేస్ వాక్ లు.. సునీత సాధించిన ఘనతలు ఎన్నంటే..
Sunita Williams: ఇప్పుడు పాతిక సంవత్సరాలకే మధుమేహం , రక్త పోటు వంటి సమస్యలు వస్తున్నాయి. పట్టుమని 35 సంవత్సరాల వయసు నిండకముందే ఎముకలు బలహీన పడుతున్నాయి.

Sunita Williams: ఇప్పుడు పాతిక సంవత్సరాలకే మధుమేహం , రక్త పోటు వంటి సమస్యలు వస్తున్నాయి. పట్టుమని 35 సంవత్సరాల వయసు నిండకముందే ఎముకలు బలహీన పడుతున్నాయి. ఇక దీర్ఘకాలిక వ్యాధుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
59 సంవత్సరాల వయసులో.. అది కూడా అనేక రకాల అనారోగ్య సమస్యలు ముంచేత్తే తరుణంలో సునీత విలియమ్స్(Sunita Williams) ఏకంగా నింగిలోకే వెళ్లారు.. అంతేకాదు అత్యంత కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఎనిమిది రోజులు అనుకుంటే ఏకంగా 9 నెలల పాటు అంతరిక్షంలో ఉండిపోయారు. సవాళ్లకు ప్రతి సవాళ్లు విసిరి.. తన ఆత్మవిశ్వాసం ముందు ఏదైనా చిన్నదే అని నిరూపించారు. భారత సంతతికి చెందిన న్యూరో అనాటమిస్ట్ దీపక్ పాండ్యా, స్లోవిన్ అమెరికన్ ఉర్సు లైన్ బోని దంపతులకు 1965 సెప్టెంబర్ 19న అమెరికాలోని ఓహియో ప్రాంతంలో సునీత విలియమ్స్ జన్మించింది. దీపక్ పాండ్యా దంపతులకు ముగ్గురు సంతానం. అందులో సునీత చిన్న కుమార్తె. దీపక్ పాండ్యా గుజరాత్ రాష్ట్రంలో జన్మించారు. మసాచు సెట్ లో 1983లో హై స్కూల్, 1987లో అమెరికన్ నావల్ అకాడమీ నుంచి బిఎస్సి, 1995లో ఫ్లోరిడాలోని ఇని స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో సునీత ఎంఎస్సీ చదివారు. 1997లో సునీత మిలిటరీలో చేరారు. 30 రకాల విమానాలను 3000 గంటల పాటు నడిపి సరికొత్త చరిత్ర సృష్టించారు. 1998లో నాసా వ్యోమగామిగా ఎంపికయ్యారు. 2006 డిసెంబర్ నెలలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (international Space centre) వెళ్లారు. అంతరిక్షంలో మారథాన్ చేసిన వ్యక్తిగా ఆమె రికార్డు సృష్టించారు. అప్పట్లో ఆమె 195 రోజులపాటు అంతరిక్షంలో ఉన్నారు. ఏకంగా నాలుగుసార్లు స్పేస్ వాక్ లు చేశారు.. 2012లో రెండవసారి, 2024లో మూడోసారి సునీత అంతరిక్షానికి వెళ్ళింది. ఇప్పటివరకు 9సార్లు స్పేస్ వాక్ చేసింది. 62 నిమిషాల పాటు స్పేస్ లో నడిచి రికార్డు సృష్టించింది. ఈ ఘనత అందుకున్న నాలుగో వ్యోమగామిగా ఆమె రికార్డు సృష్టించింది.
ఎన్నో పురస్కారాలు
అమెరికా రక్షణశాఖ అందించే అత్యున్నత పురస్కారం డిఫెన్స్ సూపర్ ఇయర్స్ సర్వీస్ మెడల్ (DSSM) ను ఆమె అందుకుంది. భారత ప్రభుత్వం 2008లో ఆమెకు పద్మభూషణ్ పురస్కారం అందించి గౌరవించింది. సునీత విలియమ్స్ ఫెడరల్ మార్షల్ మైకేల్ విలియమ్స్ ను వివాహం చేసుకుంది. వీరు ప్రస్తుతం టెక్సాస్ లో ఉంటున్నారు. ప్రారంభంలో సునీత, మైఖేల్ హెలికాప్టర్ లు నడిపేవారు. కొంతకాలానికి అంతరిక్ష రంగంలోకి సునీత వచ్చింది. ఆమె భర్త మాత్రం తన వ్యాపకాలతో మునిగిపోయాడు. కాకపోతే అతడు సునీత పెంచుకుంటున్న కుక్కల బాగోగులు చూసుకోవడం మొదలుపెట్టాడు. సునీత, మైకేల్ కు పిల్లలు లేరు. అందువల్లే ఒక బాలికను దత్తత తీసుకోవాలని అనుకున్నారు. ఇదే విషయాన్ని 2012లో సునీత అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. సునీతకు ఆడపిల్లలంటే చాలా ఇష్టం. అందువల్లే ఆమె ఆడపిల్లను దత్తత తీసుకోవాలని భావించాలని అప్పట్లో మీడియాలో కథనాలు వెలువడ్డాయి. తన భర్త మార్షల్ రంగానికి చెందినవాడు కావడంతో.. సునీత కూడా ఆ రంగంలో నైపుణ్యం సాధించింది. అందువల్లే ఆమెలో పట్టుదల ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించాలనే తపన విపరీతంగా ఉంటుంది. అందువల్లే 9 నెలల పాటు ఆమె అంతరిక్షంలో గడిపింది.
A pod of Dolphins stopped by to say welcome home to the Astronauts! 🐬 pic.twitter.com/0XXdMJbKG8
— DogeDesigner (@cb_doge) March 18, 2025