Turkey Smartphone Market : ఆపిల్, శాంసంగ్ కాదు.. టర్కీలో ఈ ఫోన్లదే రాజ్యం

Turkey Smartphone Market : ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ప్రతి ఒక్కరికి తప్పనిసరి అవసరంగా మారాయి. మనం భారతదేశంలో స్మార్ట్‌ఫోన్‌ల గురించి మాట్లాడినప్పుడు.. మొదటగా ఆపిల్, శాంసంగ్ వంటి పెద్ద కంపెనీల పేర్లు గుర్తుకు వస్తాయి. కానీ టర్కీలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ ఆపిల్, శాంసంగ్‌ల స్థానంలో కొన్ని ఇతర బ్రాండ్‌లు తమ సత్తా చాటుతున్నాయి. టర్కీ తన సొంత బ్రాండ్‌లపై ఎక్కువ దృష్టి సారిస్తోంది. కొన్ని చైనా బ్రాండ్‌లు కూడా టర్కీలో తయారీని నిర్వహిస్తున్నాయి. టర్కీకి చెందిన సొంత స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు ఏమిటో తెలుసుకుందాం.
టర్కీలోని టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు
టర్కీకి చెందిన ‘జనరల్ మొబైల్’ బ్రాండ్ తన స్మార్ట్‌ఫోన్‌ల క్వాలిటీ, బడ్జెట్ ధరలకు ప్రసిద్ధి చెందింది. ఇది టర్కీలో అతిపెద్ద మొబైల్ ఫోన్ ఫ్యాక్టరీని కలిగి ఉంది. మరొకటి ‘వెస్టెల్’. ఇది టర్కీ ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ. ఇది స్మార్ట్‌ఫోన్‌లు, టెలివిజన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను కూడా తయారు చేస్తుంది. మూడవది ‘టర్క్‌సెల్’. ఇది టర్కీలోని టాప్ టెలికాం కంపెనీలలో ఒకటి. టర్క్‌సెల్ తన సొంత స్మార్ట్‌ఫోన్ ‘T50’ని విడుదల చేసింది. ఇది టర్కీలో అందుబాటులో ఉంది.
Read Also:Rohit Sharma : రోహిత్ శర్మకు అరుదైన గౌరవం.. వాంఖడేలో ప్రత్యేక స్టాండ్‌కు హిట్ మ్యాన్ పేరు!
టర్కీలో చైనా కంపెనీల ప్రయత్నాలు
టర్కీలో అనేక చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నాయి. Xiaomi, OPPO, TECNO Mobile, TCL వంటి కంపెనీలు టర్కీలో తమ ఫోన్‌లను విక్రయించడమే కాకుండా, ఇక్కడ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉత్పత్తి కూడా చేస్తున్నాయి. చైనా కంపెనీలు టర్కీని తయారీ కేంద్రంగా ఎంచుకోవడానికి కారణం ఇక్కడ యువత సంఖ్య ఎక్కువగా ఉండటం, మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందడం, ఉత్పత్తి ఖర్చు తక్కువగా ఉండటం. ఇది ఈ కంపెనీలకు లాభదాయకంగా ఉండటమే కాకుండా టర్కీ ఆర్థిక వ్యవస్థను కూడా బలపరుస్తుంది.
చైనా బ్రాండ్‌లు.. టర్కీలో తయారీ
చైనాకు చెందిన అనేక టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు టర్కీలో తయారీని ప్రారంభించాయి. దీని వల్ల టర్కీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీ పెరిగింది.
Xiaomi: చైనాకు చెందిన టాప్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Xiaomi ఇస్తాంబుల్‌లో తన ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 5 మిలియన్ స్మార్ట్‌ఫోన్‌లు.
Oppo: Oppo ఇస్తాంబుల్‌లో తన కార్యాలయాన్ని తెరిచి టర్కీ మార్కెట్‌లో తన ఉనికిని విస్తరించింది.
Tecno: టెక్నో ఇస్తాంబుల్‌లోని పెండిక్ జిల్లాలో 35 మిలియన్ డాలర్ల పెట్టుబడితో తన తయారీని ప్రారంభించింది.
Read Also:Viral Video : సోషల్ మీడియా పిచ్చి..కదులుతున్న రైలుకు వేలాడుతూ రీల్..క్షణాల్లోనే ఊహించని ప్రమాదం!
టర్కీలో ఆపిల్-శాంసంగ్ ఆధిపత్యం
టర్కీలో ఆపిల్, శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 51 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇది 2023లో 47 శాతంగా ఉంది. 2023 నివేదిక ప్రకారం.. శాంసంగ్ 27.8 శాతం వాటాతో ఆపిల్ (19.2 శాతం) కంటే ముందుంది. మరోవైపు చైనాకు చెందిన Xiaomi కూడా 16.6 శాతం మార్కెట్ వాటాతో ఈ బ్రాండ్‌లతో పోటీ పడుతోంది.