Viral Video : సోషల్ మీడియా పిచ్చి..కదులుతున్న రైలుకు వేలాడుతూ రీల్..క్షణాల్లోనే ఊహించని ప్రమాదం!

Viral Video : నేటి యువత ఇంటర్నెట్ ప్రపంచంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఏ పని అయినా చేసేందుకు వెనుకాడడం లేదు. వీడియోలపై లైకులు, ఫాలోవర్లు పెంచుకోవడం కోసం రకరకాల విన్యాసాలు చేస్తూ ప్రాణాలను సైతం పణంగా ఒడ్డుతున్నారు. తాజాగా శ్రీలంకకు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఓ యువతి కదులుతున్న రైలుకు వేలాడుతూ స్టంట్ చేస్తూ ప్రమాదానికి గురైంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలోని యువతి పేరు మునెవ్వర్ ఇసిక్ నిజామ్. ఆమె ఒక ట్రావెల్ బ్లాగర్. ఆమె ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ను చూస్తే, ఆమె సముద్రాలు, పర్వతాలపై తిరుగుతున్న అనేక వీడియోలు కనిపిస్తాయి. ఆమె పోస్టులకు మంచి సంఖ్యలో ఫాలోవర్లు కూడా ఉన్నారు. అయితే ఆమె చేసిన ఈ ప్రమాదకరమైన స్టంట్ వీడియో మాత్రం నెటిజన్లకు ఏమాత్రం నచ్చలేదు. కొందరు లైకులు, వ్యూస్ కోసం యువత ఎంతకైనా తెగిస్తోందని కామెంట్లు చేస్తున్నారు.
Read Also:Renu Desai: ఇకపై ఆ వస్తువులు బ్యాన్ చేయండి.. దేశ ప్రజలకు రేణు దేశాయ్ రిక్వెస్ట్.. వైరల్ పోస్ట్
View this post on Instagram
Read Also:Chinnaswamy Stadium: చిన్న స్వామి స్టేడియం కాదు.. స్విమ్మింగ్ పూల్.. స్నానం చేసిన ప్లేయర్
వీడియోలో ఆ యువతి కదులుతున్న రైలు గేటుపై నిలబడి స్టంట్ చేస్తూ కనిపించింది. మంచి వీడియో కోసం ఆమె అలా చేసినప్పటికీ ఊహించని విధంగా ఆమె చేయి జారింది. అయితే అదృష్టవశాత్తూ ఆమె కింద పడకుండా ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఆమె బ్లపర్ షాట్ కూడా కెమెరాలో రికార్డ్ అయింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కొందరు లైకులు, వ్యూస్ కోసం యువత పిచ్చిగా తయారైందని విమర్శిస్తున్నారు.
ఈ వీడియోను ఆ బ్లాగర్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా అది క్షణాల్లోనే వైరల్గా మారింది. వేలాది మంది ఈ వీడియోను చూసి కామెంట్లు చేస్తున్నారు. ఒక నెటిజన్ ‘హీరోయిజం చూపించబోయి అమ్మాయికి పెద్ద ప్రమాదం తప్పింది’ అని కామెంట్ చేయగా, మరొకరు ‘కదులుతున్న రైలుపై ఇలాంటి ప్రమాదకరమైన పనులు ఎందుకు చేస్తారు?’ అని ప్రశ్నించారు. ఇంకొకరు ‘తల్లిదండ్రులు ఏం నేర్పించారో?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో యూజర్ అయితే ‘తల్లిదండ్రులు పిల్లలను ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా చూసుకోవాలి’ అని సూచించారు.
-
Viral Video : కోతిని దాని భాషలోనే ఆటపట్టించాడు.. ఆ తర్వాత సీన్ చూస్తే షాక్!
-
Viral Video : పెళ్లి పందిట్లో ఎద్దు వీరంగం.. మ్యూజిక్కు రెచ్చిపోయి వేసిన డ్యాన్స్ చూస్తే షాకే
-
Viral Video: ఐస్క్రీమ్లో బల్లి తోక.. వీడియో చూస్తే జన్మలో ఐస్క్రీమ్ తినరు!
-
Viral Video : కళ్లు మూసి తెరిచేలోపే ఫోన్ మాయం.. దొంగలకు అడ్డాగా మారిన బస్సు
-
Viral Video : సీటు కోసం ఇంత డ్రామానా? ఢిల్లీ మెట్రోలో వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!
-
Cigarette Dispute : సిగరెట్ ఇవ్వలేదని రెచ్చిపోయిన గూండా.. షాపులో 15 రౌండ్లు కాల్పులు!