Whatsapp: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అదిరిపోయిన కొత్త లిస్ట్ ఫీచర్

Whatsapp:
వాట్సాప్ యూజర్లకు అనుకూలంగా ఉండేందుకు మెటా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. కొత్త ఫీచర్ల వల్ల యూజర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. వీటివల్ల వాట్సాప్ యూజ్ చేసే వారికి అసలు ఎలాంటి సమస్యలు రావు. ప్రస్తుతం చాలా మంది వాట్సాప్ వాడుతున్నారు. అసలు ఒక్క నిమిషం వాట్సాప్ పనిచేయకపోతే ఈ ప్రపంచమే ఆగిపోతుంది. ఎందుకంటే చాలా మంది సగం వర్క్ వాట్సాప్‌లోనే చేస్తున్నారు. చదువు, ఉద్యోగం ఇలా చాలా వాటికి వాట్సాప్‌లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే మెటా ఎప్పటికప్పుడు వాట్సాప్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. అయితే వాట్సా్ప్ తాజాగా ఓ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది.
యూజర్లకు చాట్‌లో ఎలాంటి ఇబ్బందులు ఉండకుడదని లిస్ట్ ఫీచర్ అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు చాట్‌లను వివిధ రకాలుగా సెట్ చేసుకోవచ్చు. అంటే మన కాంటాక్ట్స్‌లో చాలా మంది ఉంటారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులు ఇలా ఎందరో ఉంటారు. అయితే ఇలా మీరు ఒక్కోరి చాట్‌ను వెతకాలి అంటే కాస్త సమయంల పడుతుంది. అదే మీరు కుటుంబ సభ్యులు అయితే ఫ్యామిలీ అని లిస్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి యూజర్లకు ఎక్కువ సమయం చూసుకునే అవకాశం ఉండదు. మీరు కేవలం ఫ్యామిలీ అనే కాకుండా స్నేహితులు అయితే ఫ్రెండ్స్, ఇలా ఒక్కోదానికి ఒక్క లిస్ట్ పెట్టుకోవచ్చు. అప్పుడు మీకు వెంటనే చాట్ కనిపిస్తుంది.
ఈ లిస్ట్ ఫీచర్‌ను వాడటం కూడా చాలా ఈజీ. మీరు చాట్స్ ట్యాబ్‌కి వెళ్లి దానిపైన ఉన్న + గుర్తుని క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీకు కావాల్సిన లిస్ట్ చేసుకుని అందులో చాట్‌లు కలపాలి. ఎక్కువ చాట్‌లు వాట్సాప్‌లో ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ కొత్త ఫీచర్ వల్ల మెసేజ్‌లను వెతుక్కోవాల్సిన అవసరం లేదు. వెంటేనే మీరు చూడవచ్చు. అయితే ఈ కొత్త లిస్ట్ ఫీచర్ కొందరికి మాత్రమే మొబైల్‌లో కనిపిస్తుంది. వాట్సాప్‌ను అప్డేట్ చేసుకుంటే అందరికీ కూడా కనిపిస్తుంది. ఈ కొత్త లిస్ట్ ఫీచర్‌ను యూజర్లు తమకి నచ్చినట్లు సెట్ చేసుకోవచ్చు. ఎక్కువ చాట్‌లతో మీరు ఇబ్బంది పడుతుంటే వెంటనే మీరు వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకుని, ఈ లిస్ట్ ఫీచర్‌ను పెట్టుకోండి. ఇక మీకు చాట్ విషయంలో ఎలాంటి గజిబిజీ కూడా ఉండదు.