Peddi Movie First Glimpse: వచ్చేసిన పెద్ది గ్లింప్స్.. మొత్తానికి ఆ షాట్ మాత్రం హైలెట్
Peddi Movie First Glimpseపెద్ది సినిమాతో రామ్ చరణ్ మంచి హిట్ కొడతాడని ప్రేక్షకులు అంటున్నారు. ఈ సినిమా టీజర్ ఇలా ఉంటే మూవీ మొత్తం ఎలా ఉంటుందని అంటున్నారు. ఈ టీజర్లో ప్రతీ షాట్ కూడా అదిరిపోయింది.

Peddi Movie First Glimpse: డైరెక్టర్ బుచ్చిబాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో పెద్ది సినిమా వస్తోంది. ఈ సినిమా సంబంధించిన ఫస్ట్ టీజర్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది. పెద్ది టీజర్ అయితే అదిరిపోయింది. ఇందులో రామ్ చరణ్ లుక్స్, యాస అయితే ఊర మాస్‌గా ఉన్నాయి. టీజర్‌ను చూసిన వారంతా కూడా రామ్ చరణ్ ఇచ్చిపడేశాడుగా అని కామెంట్లు చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కావడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందారు. ఈ పెద్ది టీజర్ చూసి ఈసారి పక్కా సినిమా హిట్ అవుతుందని అంటున్నారు. అయితే టీజర్లో షాట్లు, డైలాగ్‌లు సూపర్‌గా ఉన్నాయి. కేవలం ఒకే పని చేసేదానికి.. ఒకేలా బ్రతికడానికి ఇంత పెద్ద బ్రతుకెందుకు.. ఈ నేల మీద ఉన్నప్పుడే ఏదైనా చేసేయాలని ఉత్తరాంధ్ర యాసలో రామ్ చరణ్ డైలాగ్ చెబుతాడు. టీజర్ మొత్తానికి ఈ డైలాగ్ అయితే అదుర్స్. అచ్చం ఉత్తరాంద్ర యాసలో తడబడకుండా చెప్పాడు. రామ్ చరణ్‌కి యాస్ బాగా సెట్ అయ్యింది.
పెద్ది సినిమాతో రామ్ చరణ్ మంచి హిట్ కొడతాడని ప్రేక్షకులు అంటున్నారు. ఈ సినిమా టీజర్ ఇలా ఉంటే మూవీ మొత్తం ఎలా ఉంటుందని అంటున్నారు. ఈ టీజర్లో ప్రతీ షాట్ కూడా అదిరిపోయింది. ఎక్కడా కూడా నెగిటివ్ లేకుండా టీజర్ మొత్తం కూడా అదిరిపోయే లుక్స్‌తో ఉంది. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ మూవీ గేమ్ ఛేంజర్ పెద్దగా హిట్ కాలేదు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే సినిమా పెద్దగా హిట్ అవుతుందని డైరెక్టర్ బుచ్చిబాబు ముందే తెలిపాడు. డైరెక్టర్ ఎంత కాన్ఫిడెన్స్‌గా ఎందుకు చెప్పాడో ఈ టీజర్ చూస్తే అర్థం అవుతుంది. రామ్ చరణ్‌కు పెద్ది సినిమా పెద్ద హిట్ ఇస్తుందని చెప్పవచ్చు.
మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టిన రోజు. వచ్చే ఏడాది ఇదే రోజున సినిమాను రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి. అయితే సినిమా గ్లింప్స్ ఇలా ఉంటే.. ట్రైలర్, పాటలు మిగతావి ఇంకా ఎలా ఉంటాయో చూడాలి. ఈ పెద్ది సినిమా బాక్సాఫీస్ దగ్గర మరి ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
-
Jr.NTR : పెద్ది రిజక్ట్ చేసి ఎన్టీఆర్ తప్పు చేశాడా?
-
Orange Movie: ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రస్తుతం ఎలా ఉందో చూస్తే షాక్ అవ్వాల్సిందే..
-
Spirit: స్పిరిట్ మూవీపై బిగ్ అప్డేట్.. త్వరలో షూటింగ్ అక్కడే మొదలు
-
SSMB 29: రాజమౌళి నుంచి మహేష్ కు విముక్తి.. వైరల్ అవుతున్న మీమ్స్
-
Craze Heroine: హీరోయిన్ గా ఫుల్ క్రేజ్.. ప్రస్తుతం కలెక్టర్ గా విధులను నిర్వహిస్తుంది.. ఎవరో తెలుసా..
-
Atlee Allu Arjun Movie: అల్లు అర్జున్ కు జోడిగా ఆ బాలీవుడ్ బ్యూటీ ని సెలెక్ట్ చేసిన అట్లీ…అట్లీ ప్లాన్ మామూలుగా లేదుగా