Yogandra: ఏపీలో యోగాంధ్ర.. సాధించిన గిన్నిస్ రికార్డులివే!

Yogandra: ప్రతీ ఏడాది జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా ఏపీలోని విశాఖపట్నంలో యోగాంధ్ర పేరుతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని మోదీ హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యా్ణ్, ఐటీ, విద్య శాఖ మంత్రి నారా లోకేష్ అధ్వర్యంలో ఘనంగా జరిగింది. అయితే కొన్ని లక్షల మంది ఈ యోగాలో పాల్గొని రికార్డు సృష్టించారు. విశాఖపట్నంలోని ఆర్కే బీచ్‌లో నిర్వహించిన ఈ యోగాంధ్రాలో దాదాపుగా 3 లక్షలకు మందికిపైగా పాల్గొన్నారు. ఇలా పాల్గొని యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు దక్కేలా చేశారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో3 లక్షలకు మందికిపైగా పాల్గొని ఈ యోగాంధ్ర గిన్నిస్ రికార్డును సాధించేలా చేశారు. ఇదే కాకుండా 25 వేలకు పైగా గిరిజన విద్యార్థులు ఒకేసారి సూర్య నమస్కారాలు చేశారు. దీనికి మరో గిన్నిస్ రికార్డు వచ్చింది. ఈ యోగాంధ్రలో ప్రధాని మోదీ ప్రసంగించారు. యోగా గురించి తెలిపారు. డైలీ యోగా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. యుద్ధాలను ఆపే శక్తి కూడా ఈ యోగాకు ఉందన్నారు. డైలీ కొన్ని నిమిషాల పాటు యోగా చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.
రోజూ ఉదయం లేదా సాయంత్రం వేళలో చల్లగా వీచే గాలుల సమయంలో ఒక 20 నిమిషాల పాటు చిన్న చిన్న ఆసనాలతో యోగా చేయాలి. ఉదయం పూట అయితే సూర్యరశ్మిలో, సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో వచ్చే కిరణాల్లో యోగా చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. డైలీ ఇలా చిన్న ఆసనాలతో ప్రారంభించి తర్వాత కఠిన ఆసనాలు వేయాలి. ఇలా వేయడం వల్ల అనారోగ్య సమస్యలు రావు. ముఖ్యంగా గుండె పోటు, క్యాన్సర్, ఊబకాయం, కిడ్నీ వంటి సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి ఉన్న బిజీ షెడ్యూల్ వల్ల అసలు యోగా చేయడం లేదు. మొబైల్ చూసే సమయంలో ఒక 20 నిమిషాలు మీది కాదని రోజూ యోగా చేస్తే మీ లైఫ్‌కి అసలు తిరుగు ఉండదు. ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా ఇకపై దరిచేరవు. అనారోగ్య సమస్యలతో పాటు మానసిక సమస్యలు కూడా తీరిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి, ఆందోళన, మానసిక సమస్యలు అన్ని కూడా తీరుతాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి డైలీ యోగా చేయడం అలవాటుగా మార్చుకోండి. దీనివల్ల మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. డైలీ యోగా చేయడం వల్ల తొందరగా ముసలితనం రాదు. ఎక్కువగా యంగ్ లుక్‌లో కనిపిస్తారని నిపుణులు అంటున్నారు.
Also read : International Yoga day: డైలీ 20 నిమిషాలు యోగా చేస్తే.. మీ లైఫ్‌కి మీరే రాజు ఇక!
-
Pawan Kalyan : పంచెకట్టులో పవర్ స్టార్..అదిరిపోయిన పవన్ కళ్యాణ్ కొత్త లుక్
-
International Yoga day: డైలీ 20 నిమిషాలు యోగా చేస్తే.. మీ లైఫ్‌కి మీరే రాజు ఇక!
-
Yoga: యోగా చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ చేశారో.. అంతే సంగతులు
-
International Yoga Day 2025:యోగా దినోత్సవం 2025.. విశాఖలో 2.5 లక్షల మందితో భారీ వేడుక.. కొత్త ప్రపంచ రికార్డు!