Kerala : 4వ తరగతిలో కొట్టినందుకు 50ఏళ్ల తర్వాత రివెంజ్.. ఫ్రెండ్స్ రీయూనియన్‌లో పాత పగ

Kerala : సాధారణంగా సినిమాల్లో చూస్తాం. ఏదో చిన్నప్పుడు జరిగిన గొడవకు హీరో లేదా విలన్ పెద్దయ్యాక రివెంజ్ తీర్చుకుంటారు. కానీ, కేరళలో అచ్చం అలాంటి ఘటనే జరిగింది. అది కూడా నాలుగో తరగతిలో జరిగిన ఒక చిన్న గొడవకు ఏకంగా 50 ఏళ్ల తర్వాత ఫ్రెండ్స్ రియూనియన్లో పాత పగలు గుర్తు తెచ్చుకొని ఒకరిపై దాడి చేశారు. ఈ షాకింగ్ ఘటన కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో జరిగింది. పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. 62 ఏళ్ల వృద్ధుడిపై దాడి చేసినందుకు వీరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చెప్పిన దాని ప్రకారం.. ఇది 50 ఏళ్ల నాటి చిన్ననాటి పగకు సంబంధించిన కేసు అని తెలిపారు.
పోలీసులు అరెస్ట్ చేసిన వారిని బాలకృష్ణన్, మాథ్యూ వాలియాప్లాక్కల్గా గుర్తించారు. వీరు ఇద్దరూ కలిసి వీజే బాబు అనే 62 ఏళ్ల వృద్ధుడిపై దాడి చేశారు. బాబు, బాలకృష్ణన్‌కు పాత క్లాస్మేట్. ఈ దాడి జూన్ 2న జరిగింది. అంటే, వీళ్ళు కలిసి ఒక సాధారణ రియూనియన్కు కలిసిన కొన్ని రోజుల తర్వాతే ఈ ఘటన జరిగింది.
Read Also:RBI : ఆర్బీఐ కొత్త రూల్.. పదేళ్లు దాటిన పిల్లలకు గుడ్ న్యూస్
FIR ప్రకారం.. బాలకృష్ణన్, బాబుపై దాడి చేయడానికి కారణం.. నాలుగో తరగతిలో బాబు తనపై దాడి చేశాడని బాలకృష్ణన్ పగ పెంచుకున్నాడు. కొన్ని రోజుల ముందు జరిగిన రియూనియన్ మీటింగ్‌లో, బాబు, బాలకృష్ణన్ ఇద్దరూ నాలుగో తరగతిలో జరిగిన ఆ ఘటన గురించి మాటల యుద్ధం చేసుకున్నారు. అప్పుడు ఆ గొడవ సద్దుమణిగినా, బాలకృష్ణన్ తన స్నేహితుడు మాథ్యూతో కలిసి జూన్ 2న మళ్లీ బాబును కలిశాడు. వీరిద్దరూ కలిసి బాబును నాలుగో క్లాస్‌లో నువ్వు బాలకృష్ణన్‌ను ఎందుకు కొట్టావు? అని ప్రశ్నించారట. ఆ వాగ్వాదం చివరికి దాడికి దారితీసింది. బాలకృష్ణన్, మాథ్యూ కలిసి బాబుపై దాడి చేశారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, బాలకృష్ణన్ బాబు కాలర్ పట్టుకోగా, మాథ్యూ అతడి ముఖంపై, వీపుపై రాతితో కొట్టాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాబు, ప్రస్తుతం కన్నూర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ సెక్షన్లు ఈ దాడులకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడేలా చేస్తాయి. చిన్ననాటి పగ ఎంత దూరం వెళ్ళిందో ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. స్నేహితుల రియూనియన్ లాంటి సందర్భాలు ఆనందంగా ఉండాలి కానీ, పాత పగలు తీర్చుకోవడానికి ఉపయోగించుకోవడం నిజంగా విచారకరం.
Read Also:Yoga: యోగా చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ చేశారో.. అంతే సంగతులు