Animal movie : యానిమల్ సినిమాలో విలన్ పాత్రను మూగ, చెవిటి వాడిగా ఎందుకు చేశాడు.. వివరణ ఇచ్చిన దర్శకుడు…

Animal movie :
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన యానిమల్ సినిమా గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ నటించాడు. సినిమాలో బాబి డియోల్ అబ్రార్ పాత్రలో కనిపించేది కొన్ని సన్నివేశాల్లో మాత్రమే అయినా ఆ పాత్రను పరాకాష్టకు చేర్చాడు. సింగం పౌరుషంగా పంచ్ డైలాగులు చెప్పగలడు అలాగే సింహం కంటి చూపుతో చంపేస్తానని డైలాగ్ చెప్పగలదు కానీ ఎటువంటి డైలాగ్ లేకుండా హీరో విలన్ ఢీకొట్టగలరా.. అలాగే డైలాగ్ తో పని లేకుండా కేవలం హావభావాలతో సన్నివేశాలను పండించగలరా వంటి ప్రశ్నలను సాధించి చూపించాడు కాబట్టి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రత్యేకమైన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమాలో విలన్ పాత్రను మలిచిన తీరు ఎవరు ఊహించి ఉండరు. ఈ పాత్రను బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ పరాకాష్టకు చేర్చాడు. ఆ పాత్రను తీర్చిదిద్దిన క్రెడిట్ మొత్తం దర్శకుడికే చెందుతుంది. అయితే యానిమల్ సినిమాలో అబ్రార్ పాత్రను మూగవాడిగా ఎలా తీర్చిదిద్దారు అనే ప్రశ్నకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సమాధానం ఇచ్చారు. ఇటీవల ఒక షో లో కనిపించిన సందీప్ రెడ్డి వంగ ఆ పాత్ర గురించి ఇలా అన్నారు హీరో విలన్ ఫోన్ తీసుకుని ఒకరినొకరు తిట్టుకుంటూ లేదా పంచ్ డైలాగ్ విసురుకుంటూ కనిపించే చాలా సినిమాలను ఇప్పటివరకు మనం చూసాము. సినిమా మొత్తం కూడా ఏదో ఒక రకమైన డైలాగు ఉంటుంది.అలాగే హీరో విలన్ ఫేస్ ఆఫ్ కూడా ఉంటుంది. అయితే యానిమల్ సినిమా మొదట సగంభాగం మొత్తం హీరో రణబీర్ కపూర్ పాత్రను అలాగే విలన్ పాత్ర ప్రవేశించే ముందు తన తండ్రి పై హీరోకు ఉన్న ప్రేమను చూపించడం పైన కథ మొత్తం ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ ఆఫ్ లో అబ్రార్ పాత్ర ప్రవేశిస్తుంది.
ఇప్పటివరకు ప్రతి సినిమాలో కూడా విలన్లు బీభత్సమైన సంభాషణలు చేయడం మనం చూసాము. కాబట్టి నేను ఈ సినిమాలో విలన్ ను మూగ, చెవిటి వ్యక్తిగా చూపించాలి అని అనుకున్నాను. సినిమా క్లైమాక్స్ లో మూగ, చెవిటి వ్యక్తి పోరాడటం అనే ఆలోచన చాలా ఎగ్జైట్ చేసే ఆలోచన అని దర్శకుడు వివరణ ఇచ్చాడు. యానిమల్ సినిమాలో ఆఫర్ రావడంతో బాబి డియోల్ కెరియర్ ఊపందుకుంది. సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి అతనికి వరుసగా ఆఫర్లు వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమాలో అతడి నటనను ప్రశంసించని వారు ఎవరు లేరు.
ఇక బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ను పాన్ ఇండియా స్టార్ గా చేసిన ఘనత కూడా మన దర్శకుడు సందీప్ రెడ్డి వంగాదే. ఈ సినిమాతో ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కు పునర్జన్మను ఇవ్వడమే కాకుండా ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో నటించిన ట్రిప్టి దిమ్మిరి కెరీర్ కి బాగా బూస్ట్ ఇచ్చాడు దర్శకుడు. ఇప్పటివరకు ప్రతి సినిమాలో కూడా రొటీన్ గా విలన్ పాత్రను చూపించే చాలామంది దర్శకులకు సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాతో కళ్ళు తెరిపించాడు అని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటివరకు విలన్ ఇలాగే ఉండాలి అని అనుకునే ప్రతి మూవీ మేకర్స్ కి ఈ సినిమా ఖచ్చితంగా ఒక మేలుకొలుపు అని తెలుస్తుంది.