Bommarillu Movie: బొమ్మరిల్లు చేయాల్సింది సిద్ధార్థ్ కాదు.. మరి ఏ హీరో అంటే?

Bommarillu Movie: తెలుగు సినిమాల్లో బొమ్మరిల్లు మూవీ కల్ట్ క్లాసిక్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో సిద్దార్థ్ హీరోగా, జెనీలియా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత ఇద్దరికీ కూడా మంచి పేరు వచ్చింది. సినిమా స్టోరీలో బాగుండటంతో పాటు ఇద్దరూ కూడా బాగా నటించారు. ఎక్కువగా ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఈ బొమ్మరిల్లు సినిమాను రీ రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత జెనీలియాకు మంచి ఆఫర్లు వచ్చాయి. ఈ సినిమాతో ఇటు సిద్ధార్థ్, జెనీలియా ఖాతాలో హిట్ పడింది. ఇప్పటికీ చాలా మంది జెనీలియాను హాసిని పేరుతో పిలుస్తుంటారు. ఇందులోని కొన్ని సీన్లకు నెటిజన్లు బాగా కనెక్ట్ అయ్యారు. లవ్ అండ్ ఎమోషన్స్ అన్ని కూడా అందరికీ కనెక్ట్ అయ్యాయి. అప్పుడే కాదు.. ఇప్పటికీ కూడా ఈ సినిమా చూస్తే అదే ఫీలింగ్ కలుగుతుంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా.. ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్ర పోషించారు. అయితే ఈ సినిమాలో హీరోగా మొదట సిద్ధార్థ్‌ను అనుకోలేదట. మరి ఆ హీరో ఎవరు? పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
ఇది కూడా చూడండి: Khaleja Re-release : ఖలేజా సినిమాకు పాముతో వచ్చిన మహేష్ ఫ్యాన్.. ఓర్నీ ఇంత సాహసం అవసరమా ?
2007లో థియేటర్లకి వచ్చి ఈ బొమ్మరిల్లు మూవీ మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతోంది. అయితే ఈ బొమ్మరిల్లు సినిమాను ముందుగా ఎన్టీఆర్‌తో భాస్కర్ చేయాలని అనుకున్నాడట. కాకపోతే అతను రిజక్ట్ చేయడంతో ఆ కథ సిద్దార్థ్ దగ్గరకు వెళ్లిందట. ఈ విషయాన్ని ఎన్టీఆర్ గతంలో తెలిపారు. ఎన్టీఆర్‌కు బొమ్మరిల్లు కథ బాగా నచ్చిందన్నారు. లేకపోతే తన ఇమేజ్ వల్ల సినిమా హిట్ కాకపోయినా పర్లేదు.. కానీ ఆఫర్లు తగ్గిపోతే బాధగా ఉంటుందని అన్నారు. దిల్ రాజు ఆ బొమ్మరిల్లు కథ చెప్పినప్పుడు చాలా బాధపడ్డానని, మంచి సినిమా మిస్ అయిపోతున్నానని అన్నారు. తన ఇమేజ్ ఆ సినిమాకు న్యాయం చేయలేదని వదులుకున్నానని ఎన్టీఆర్ అన్నారు. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు త్వరలోనే రానుంది. ఇటీవల ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఏది ఏమైనా కూడా ఎన్టీఆర్ మంచి ఛాన్స్‌ను మిస్ చేసుకున్నట్లే. బొమ్మరిల్లు సినిమా ఎన్టీఆర్ చేసి ఉంటే తన ఖాతాలో మరో హిట్ పడినట్లే.