Jr.NTR : పెద్ది రిజక్ట్ చేసి ఎన్టీఆర్ తప్పు చేశాడా?
Jr.NTR : ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది విషయంలో కూడా ఎన్టీఆర్ ఇదే తప్పు చేశాడని అంటున్నారు. ఎందుకంటే పెద్ది మూవీ ఫస్ట్ బుచ్చిబాబు ఎన్టీఆర్‌కి కథ చెప్పారు. కానీ ఎన్టీఆర్ రిజక్ట్ చేయడంతో రామ్ చరణ్ చేస్తున్నాడు. దీంతో ఎన్టీఆర్ కూడా మహేష్ బాబు చేసిన మిస్టేక్ చేస్తున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు.

Jr.NTR : డైరెక్టర్లు సినిమా కథను రాసుకొనేటప్పుడు ఓ హీరోని ఊహించుకుంటారు. వారికి అనుగుణంగా కథ రాసుకుంటారు. కానీ తీరా కథ పూర్తి అయి ఆ హీరో దగ్గరకు వెళ్లి చెబితే వారు రిజక్ట్ చేస్తుంటారు. దీంతో ఆ కథ వేరే హీరో దగ్గరకు వెళ్తుంది. అప్పుడు ఆ హీరో పక్కాగా హిట్ కొడతాడు. ఇలా జరిగినవి చాలానే ఉన్నాయి. ఇలా హిట్ అయిన సినిమాలు ఆ హీరోలకు స్టార్ డమ్‌లను తీసుకొచ్చాయి. అందులో చిరంజీవి కూడా ఉన్నాడు. సూపర్ స్టార్ కృష్ణ చేయాల్సిన ఖైదీ సినిమాను మెగాస్టార్ చిరంజీవి ఒప్పుకున్నాడు. ఈ సినిమాతో చిరంజీవి రేంజ్ మారిపోయింది. ఖైదీ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో సుప్రీమ్ హీరోగా మాస్ ఇమేజ్‌ని చిరు సొంతం చేసుకున్నారు. ఈ సినిమాతోనే చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగారు. అయితే ఇలా చాలా సినిమాలు మిస్ అయిన వేరే హీరో దగ్గరకు వెళ్లడం హిట్ కొట్టడం జరిగాయి.
అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీని సుకుమార్ ముందు సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఈ గెటప్‌లో మహేష్ కనిపించడానికి ఇష్టపడలేదు. దీంతో ఆ సినిమా స్టోరీ అల్లు అర్జున్ దగ్గరకు వెళ్లింది. అల్లు అర్జున్ ఒప్పుకోవడంతో సినిమా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాతో బన్ని రేంజ్ మారిపోయింది. ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమా మిస్ చేసుకోవడంతో మహేష్ పెద్ద తప్పు చేశాడని ఫ్యాన్స్ అనుకున్నారు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది విషయంలో కూడా ఎన్టీఆర్ ఇదే తప్పు చేశాడని అంటున్నారు. ఎందుకంటే పెద్ది మూవీ ఫస్ట్ బుచ్చిబాబు ఎన్టీఆర్‌కి కథ చెప్పారు. కానీ ఎన్టీఆర్ రిజక్ట్ చేయడంతో రామ్ చరణ్ చేస్తున్నాడు. దీంతో ఎన్టీఆర్ కూడా మహేష్ బాబు చేసిన మిస్టేక్ చేస్తున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు.
ఇదిలా ఉండగా పెద్ది మూవీ గ్లింప్స్ ఇటీవల శ్రీ రామనవమి సందర్భంగా రిలీజ్ అయ్యాయి. ఈ గ్లింప్స్ ఒక్కసారిగా మూవీ అంచనాలను పెంచేశాయి. చరణ్ మాస్ లుక్, ఉత్తరాంధ్ర యాసలో ఫ్యాన్స్‌ను అయితే సర్‌ప్రైజ్ చేశాడు. గ్లింప్స్ రిలీజైన 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్ సంపాదించింది. అయితే మార్చి 27వ తేదీన రామ్ చరణ్ పుట్టిన రోజు. వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టిన రోజున సినిమాను రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి. అయితే సినిమా గ్లింప్స్ ఇలా ఉంటే.. ట్రైలర్, పాటలు మిగతావి ఇంకా ఎలా ఉంటాయో చూడాలి. ఈ పెద్ది సినిమా బాక్సాఫీస్ దగ్గర మరి ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.
-
Jr NTR: సన్నబడేందుకు ఎన్టీఆర్ ఇంజెక్షన్స్ వాడారా? మరీ తక్కువ రోజుల్లోనే ఎలా?
-
Vaishnavi Chaitanya : వైష్ణవి చైతన్య ఫస్ట్ క్రష్ అతడే?
-
Sukumar-Junior NTR : నాన్నకు ప్రేమతో కాంబో మళ్లీ రిపీట్ కాబోతుందా?
-
Peddi Movie First Glimpse: వచ్చేసిన పెద్ది గ్లింప్స్.. మొత్తానికి ఆ షాట్ మాత్రం హైలెట్
-
Peddi Movie: RC16 సినిమా టైటిల్ ఫిక్స్.. రామ్ చరణ్ లుక్ గూస్ బంప్స్
-
Court Movie Collections: పది రోజుల్లో ఇంత వసూళ్లు.. రూ.50 కోట్ల క్లబ్లో కోర్ట్ మూవీ