Chiranjeevi: వివాదంలో చిక్కుకున్న మెగాస్టార్.. క్లారిటీ ఇదే!

Chiranjeevi:
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్‌లో తన కష్టం మీద ఎదిగి గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి ఎందరికో ఒక రోల్ మోడల్. సినిమా ఇండస్ట్రీకి రావాలనుకునే ప్రతీ ఒక్కరూ కూడా చిన్నప్పటి నుంచి చిరంజీవిని చూస్తూ పెరుగుతారు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి టాలీవుడ్ మెగాస్టార్ అనిపించుకున్నారు. మొదటి ఇన్నింగ్స్‌ను సక్స్‌స్‌ఫుల్‌గా కంప్లీట్ చేసి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో ట్రై చేస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో చిరంజీవి వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల మగబిడ్డ పుట్టాలనే వార్తలు నెట్టింట హల్ చల్ అయ్యాయి. కొడుకే వారసుడా? కూతరు కాదా? మెగాస్టార్ ఇలా అనడం సరి కాదనే చిరంజీవిపై విమర్శలు ఎక్కువగా వచ్చాయి. ఒక మెగాస్టార్ అయి ఉండి ఇలా అనడం కరెక్ట్ కాదన్నారు. అయితే చిరంజీవి ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నాడు. పౌరసత్వం వివాదంలో చిక్కుకున్నాడు. అయితే చిరంజీవి భారతీయ పౌరుడు కాదని వార్తలు వచ్చాయి. యునైటెడ్ కింగ్ డమ్ పౌరసత్వం చిరంజీవికి ఉందని తెగ ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలో చిరు పీఆర్ టీం స్పందించింది. చిరంజీవికి యూకే పౌరసత్వం లేదని, తను జీవించి ఉన్నంత వరకు భారతీయుడిగానే ఉంటారని తెలిపింది.
ఇటీవల చిరంజీవిని కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది. ఇలాంటి గొప్ప వ్యక్తిపై ఇలా విమర్శలు చేయడం కరెక్ట్ కాదని మెగా అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇటీవల ఓ ఈవెంట్‌లో మనవడు గురించి మాట్లాడితేనే చాలా మంది ట్రోల్ చేశారు. మరికొందరు మెగస్టార్ మాటలకు సపోర్ట్ చేశారు. ఎవరికైనా సరే మగపిల్ల వాడు, వారసుడు ఉండాలని ఉంటుంది. కానీ అందరూ కూడా ఈ విషయాన్ని బయటకు చెప్పుకోరని అన్నారు. మరికొందరు ఇలా ఆలోచించడం ఏంటి? మరి ఆడపిల్ల అంత చులకనా అని అన్నారు. ఇది జరిగి ఎన్నో రోజులు కాకుండానే చిరంజీవి మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. ఇదిలా ఉండగా.. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరలో నటిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల మందుకు రానుంది. ఇవే కాకుండా మరో మరెండు భారీ ప్రాజెక్టులు కూడా చిరు చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వంభర షూటింగ్ పూర్తి అయిన తర్వాత దసరా ఫేమ్ యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో కూడా సినిమా చేయనున్నారు. ఈ సినిమాను నాని నిర్మిస్తున్నాడు. అలాగే అనిల్ రావిపూడితో కూడా చిరు సినిమాకి ఒకే చేసినట్లు తెలుస్తోంది.