Chiranjeevi: మిస్ అయిన చిరంజీవి బంగారు కోడిపెట్ట.. పోలీస్ట్ స్టేషన్‌లో ఫిర్యాదు.. ఇదొక వింత ప్రమోషన్
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్‌లో తన కష్టం మీద ఎదిగి గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి ఎందరికో ఒక రోల్ మోడల్.

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్‌లో తన కష్టం మీద ఎదిగి గుర్తింపు తెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి ఎందరికో ఒక రోల్ మోడల్. సినిమా ఇండస్ట్రీకి రావాలనుకునే ప్రతీ ఒక్కరూ కూడా చిన్నప్పటి నుంచి చిరంజీవిని చూస్తూ పెరుగుతారు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి టాలీవుడ్ మెగాస్టార్ అనిపించుకున్నారు. అయితే చిరంజీవి సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటారు. చిన్న సినిమాలు, పాటలు ఇలా ప్రతీ ఒక్కరికీ సపోర్ట్ చేస్తుంటారు. టీజర్, సినిమా ట్రైలర్స్ వంటివి రిలీజ్ చేసి చాలా మందికి సపోర్ట్‌గా నిలుస్తుంటారు. అయితే చిరంజీవి తాజాగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ కాన్సెర్ట్‌ని ప్రమోట్ చేస్తూ సపోర్ట్ చేశాడు. చాలా వైరైటీగా ఈ కాన్సెర్ట్‌ని ప్రమోట్ చేశారు. ఫస్ట్ ఈ ప్రమోషన్‌ను చూసిన వెంటనే చాలా మంది చిరంజీవి పోలీస్ స్టేషన్‌కు ఎందుకు వెళ్లాడు? దేని కోసం ఫిర్యాదు చేశారని అనుకుంటారు. కానీ మొత్తం చూశాక.. ఇది ఒక మ్యూజిక్ కాన్సెర్ట్ ప్రమోషన్ అని అర్థం అవుతుంది.
Bangaru Kodi Petta holds a special place in my heart, & your words bring back cherished memories @KChiruTweets garu
Stay tuned as I bring Bangaru Kodi Petta ur way On March 22nd Hitex! 🐔
Presented by @Hyderabadtalkies @MyMusicMyCount2 #NaTourMMK #Chiranjeevi #Hyderabadtalkies pic.twitter.com/1wL7bXfnLA
— mmkeeravaani (@mmkeeravaani) February 21, 2025
హైదరాబాద్ టాకీస్ వాళ్లు మార్చి 22న మై మ్యూజిక్ మై కంట్రీ పేరుతో మ్యూజిక్ కాన్సెర్ట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ కాన్సెర్ట్‌ను మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి అధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ మ్యూజిక్ ఈవెంట్‌ని ప్రమోట్ చేయడానికి చిరంజీవి కొత్తగా ట్రై చేసి వీడియో రిలీజ్ చేశాడు. చిరు రిలీజ్ చేసిన వీడియోలో ఏముందంటే.. మా ఇంట్లో ఓ బంగారు కోడి పెట్ట ఉండేదని.. కానీ ఈ మధ్య ఆ కోడి పెట్ట కనిపించకుండా పోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని వారు కంప్లైంట్ తీసుకోలేదన్నారు. అయితే ఆ తర్వాత ఎవరో ఆ కోడి పెట్ట మార్చి 22న జరిగే మ్యూజిక్ కాన్సెర్ట్‌లో మీకు తప్పకుండా దొరుకుతుందని చెప్పారన్నారు. అందరూ కూడా ఈ మ్యూజిక్ కాన్సెర్ట్‌కి వెళ్లి చూడాలన్నారు. అయితే ఈ మ్యూజిక్ కాన్సెర్ట్‌లో కీరవాణి చిరంజీవి పాట అయిన బంగారు కోడిపెట్ట పాడనున్నాడు. కొత్తగా ఇలా చిరు ప్రమోట్ చేశాడు. మొదట్లో చిరు ఫ్యాన్స్ పోలీస్ స్టేషన్ ఏంటని ఆందోళన చెందారు. కానీ మొత్తం వీడియో చూశాక కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా.. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభరలో నటిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల మందుకు రానుంది. ఇవే కాకుండా మరో రెండు భారీ ప్రాజెక్టులు కూడా చిరు చేతిలో ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వంభర షూటింగ్ పూర్తి అయిన తర్వాత దసరా ఫేమ్ యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో కూడా సినిమా చేయనున్నారు. ఈ సినిమాను నాని నిర్మిస్తున్నాడు. అలాగే అనిల్ రావిపూడితో కూడా చిరు సినిమాకి ఒకే చేసినట్లు తెలుస్తోంది.