Nagababu: తమ్ముడు నాగబాబు ఎమ్మెల్సీ అయ్యి ఇంటికొచ్చాడు.. చిరంజీవి చేసిన పని వైరల్

Nagababu జనసేన ప్రధాన కార్యదర్శి, సినీ నటుడు నాగబాబు బుధవారం ఎమ్మె్ల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ మోషేన్ రాజు సమక్షంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు శాసనమండలి సభ్యునిగా బాధ్యతలు స్వీకరించారు. గత నెలలో శాసనసభ్యుల కోటాలో ఎమ్మెలీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా నాగబాబు పోటీకి దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నాగబాబు ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి అతన్ని అభినందిస్తూ.. ట్వీట్ చేశారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తమ్ముడికి ఆత్మీయ అభినందనలు అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే దీనిపై నాగబాబు ఎమోషనల్ ట్వీట్ చేశారు. మీరు ఇచ్చిన ప్రేమ, తోడ్పాటుకి నా ధన్యవాదాలు.
మీరు ఇచ్చిన పెన్ నాకు ఎంతో ప్రత్యేకమని.. దాన్నే ప్రమాణ స్వీకార సమయంలో ఉపయోగించానని తెలిపారు. ఇది ఎంతో గౌరవంగా ఉందని ఎమోషనల్ అయ్యారు. నాగబాబు చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా నాగబాబు ప్రమాణ స్వీకారం తర్వాత సతీమణితో కలిసి ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ క్రమంలో నాగబాబును సీఎం చంద్రబాబు శాలువాతో సత్కరించి, వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ఆయన బహుమతిగా ఇచ్చారు. నాగబాబు దంపతులు సీఎం చంద్రబాబుకు పుష్పగుచ్చం కూడా ఇచ్చారు. తనకి ఎమ్మెల్సీ కోటాలో అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎంలకు అనుగుణంగా నడచుకుంటానని తెలిపాడు.
ఇదిలా ఉండగా, నాగబాబు ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన తన ఆస్తులు, అప్పుల వివరాలను ఎన్నికల సంఘానికి ఇచ్చారు. మొత్తం ఆస్తుల విలువ సుమారుగా రూ.59 కోట్లు ఉంది. అయితే వీటిలో బాండ్లు, మ్యూచువల్ ఫండ్స్, నగదు కూడా ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్స్/బాండ్లు కలిసి రూ.55.37 కోట్లు, చేతిలో నగదు రూ.21.81 లక్షలు, బ్యాంకు నిల్వలు రూ.23.53 లక్షలు ఉన్నాయి. వీటితో పాటు రూ.67.28 లక్షల విలువ చేసే బెంజ్ కారు కూడా ఉంది. దీంతో పాటు రూ.11.04 లక్షల విలువ చేసే హ్యుందాయ్ కారు కూడా ఉంది. వీటితో పాటు బంగారం, వెండి రూ.57.99 లక్షల విలువైన 724 గ్రాముల బంగారం ఉంది. భార్య దగ్గర రూ.16.50 లక్షల విలువ చేసే 55 క్యారట్ల వజ్రాలు, రూ.21.40 లక్షల విలువ చేసే 20 కేజీల వెండి ఉంది. హైదరాబాద్ పరిసరాల్లో కూడా వీరికి దాదాపుగా రూ.11 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. వీటితో పాటు ఇంకా ఆస్తులు ఉన్నాయి.