Champions trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో సందడి చేసిన లోకేష్.. సుకుమార్, చిరంజీవి కూడా..

Champions trophy:
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో నేడు భారత్, పాక్ మ్యాచ్ జరుగుతోంది. దుబాయ్ వేదికగా మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. పాకిస్థాన్, భారత్ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూశారు. దాయాది దేశంతో మ్యాచ్ అంటే ఎన్ని పనులు ఉన్నా కూడా అందరూ పక్కన పెట్టి మరి మ్యాచ్ చూస్తుంటారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ జట్టు ఆలౌటైంది. అయితే దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌కి ఏపీ మంత్రి నారా లోకేష్‌తో పాటు అతని కుమారుడు దేవాన్ష్ కూడా వెళ్లారు. దుబాయ్ స్టేడియంలో సందడి చేశారు. వీరితో పాటు మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు సుకుమార్, టీమిండియా ఆటగాళ్లు తిలక్ వర్మ, అభిషేక్ వర్మ, బుమ్రా, రాజ్యసభ ఎంపీ సానా సతీష్, ఎంపీ కేశినేని చిన్ని ఈ మ్యాచ్‌లో సందడి చేశారు.

Nara lokesh
మంత్రి నారా లోకేష్, తన కుమారుడితో కలిసి టీమిండియా జెర్సీలోనే సందడి చేశారు. ఈ విషయాన్ని నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. ఇదిలా ఉండగా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రత్యేకంగా స్క్రీన్ ఏర్పాటు చేసి మన దేశంలో మ్యాచ్ చూశారు. అలాగే బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ కూడా ప్రత్యేక స్క్రీన్‌లో చూశారు. ఈ విషయాన్ని వారు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

Champions trophy
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 49.4 ఓవర్లలో 241 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో భారత్ బౌలర్లు చాలా కట్టుదిట్టంగా బంతులు వేశారు. చాలా జాగ్రత్తగా ఆడినా పాకిస్థాన్ చివరికి ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో సౌద్ షకీల్ 62 పరుగులు, మహ్మద్ రిజ్వాన్ 46 పరుగుల చేశారు. భారత్ బౌలర్లు ఈ మ్యాచ్‌లో ఇరగదీశారు. కుల్‌దీప్ యాదవ్ 3 వికెట్లు తీయగా హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణాకు ఒక్కోరు ఒక్కో వికెట్ తీశారు. ప్రస్తుతం టీమిండియా బ్యాటింగ్ జరుగుతోంది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఔట్ కాగా.. గిల్ కూడా ఔట్ అయ్యాడు. ప్రస్తుతం కింగ్ కోహ్లీ, శ్రేయస్ అయ్యార్ బ్యాటింగ్ చేస్తున్నారు. క్రికెట్ అభిమానులు ఉహించినంత రసవత్తరంగా అయితే మ్యాచ్ సాగడం లేదు. టీమిండియా గెలుపు పక్కా అన్నట్లు తెలుస్తోంది. మరి చివరిలో ఏమైనా తారుమారు అయితే చెప్పలేం. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుస్తుందో? పాకిస్థాన్ గెలుస్తోందో చూడాలి.
-
Nagababu: తమ్ముడు నాగబాబు ఎమ్మెల్సీ అయ్యి ఇంటికొచ్చాడు.. చిరంజీవి చేసిన పని వైరల్
-
Subhman Gil: మరో అమ్మాయితో ప్రేమలో పడిన శుభమన్ గిల్.. ఇక సారా లేనట్టేనా?
-
Champions Trophy 2025: గెలిచిన జట్టు వైట్ బ్లేజర్స్ ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా?
-
Rohit Sharma: తప్పుడు ప్రచారాలు చేయవద్దు.. రిటైర్మెంట్పై హిట్ మ్యాన్ కీలక ప్రకటన
-
Yuzvendra Chahal: స్టేడియంలో మరో అమ్మాయితో చాహల్.. ఇంతకీ ఎవరీ మిస్టరీ గర్ల్?
-
ICC Champions Trophy: టీమిండియా విన్నింగ్ చూసి.. చిన్నపిల్లాడిలా సునీల్ గవాస్కర్ డ్యాన్స్.. వైరలవుతున్న వీడియో!