Kshemamga Velli Labhamga Randi: క్షేమంగా వెళ్లి లాభంగా రండి.. సినిమా గురించి మీకు ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?

Kshemamga Velli Labhamga Randi:
ఇప్పుడున్న కిడ్స్‌కి అప్పటి సినిమాల గురించి పెద్దగా తెలియదు. కానీ అప్పట్లో ఉన్న కొన్ని సినిమాలు ఇండస్ట్రీకి మంచి హిట్ ఇవ్వడంతో పాటు కొందరి గుండెల్లో చిరకాలంగా ఉండిపోతాయి. అయితే 2000 సంవత్సరంలో శ్రీకాంత్ (Srikanth), రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad), బ్రహ్మానందం (Brahmanandam) ఈ ముగ్గురి కాంబోలో క్షేమంగా వెళ్లి లాభంగా రండి (Kshemamga Velli Labhamga Randi) అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. రాజా వన్నెం రెడ్డి (Raja Vannem Reddy) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి ఇప్పడు 25 ఏళ్లు పూర్తి అయ్యాయి. ఈ సినిమాతోనే రాజా వన్నెం రెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఎం.ఎల్.ఆర్ట్ మూవీస్ బ్యానర్‌పైన ఎం.వి.లక్ష్మి (M. V. Lakshmi) ఈ చిత్రాన్ని నిర్మించారు. దీనికి వందేమాతరం శ్రీనివాస్ (Vandemataram Srinivas) సంగీతం వహించారు. అయితే ఈ సినిమా మంచి హిట్‌ను అప్పుడు పొందింది. ఈ సినిమా వచ్చి ఈ ఏడాదికి 25 ఏళ్లు అవుతున్నాయి. ఈ సందర్భంగా ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు నేడు తెలుసుకుందాం.
క్షేమంగా వెళ్లి లాభంగా రండి అనే సినిమా రిమీక్. తమిళంలో ‘విరాలుకెట్టా వీక్కం’ అనే సినిమా తీయగా దానికి రీమేక్‌గా తీశారు. ఇది తమిళంలో మంచి హిట్‌ను సాధించింది. ఇందులో శ్రీకాంత్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం నటించగా.. హీరోయిన్లగా రోజా (Roja Selvamani), ప్రీతా విజయ్ కుమార్ (Preetha Vijayakumar) నటించారు. అయితే హీరోల స్థానంలో పెద్ద హీరోలను ఎంపిక చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఎవరూ కూడా ముందుకు రాకపోయే సరికి వీరిని ఎంపిక చేశారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ (Prakash Raj), రమ్య కృష్ణ (Ramya Krishnan) కూడా ముఖ్య పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా రిలీజ్‌కి ముందు ఎలాంటి అంచనాలు కూడా లేవు.
కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మంచి హిట్ టాక్‌ను సంపాదించుకుంది. థియేటర్లు అన్ని కూడా హౌస్ ఫుల్ అయ్యాయి. రిమేక్ మూవీ అయినా కూడా డైరెక్టర్ తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా కొన్ని మార్పులు చేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో బ్రహ్మానందం, కోవై సరళ (Kovai Sarala)ల కామెడీ బాగా వర్క్‌వుట్ అయ్యింది. వీరిద్దరి మధ్య వచ్చే అన్ని సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బాగా నవ్వించాయి. అలాగే ఈ సినిమాలో రవితేజ (Ravi Teja) కూడా స్మగ్లర్‌గా ముఖ్య పాత్రలో కనిపించాడు. ఆ రోజుల్లో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.10 కోట్ల షేర్లు రాబట్టింది.
-
Ravi Teja Father Passes Away: హీరో రవితేజ ఇంట్లో తీవ్ర విషాదం
-
Ravi Teja Daughter: త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న రవితేజ కూతురు మోక్షద.. లేటెస్ట్ ఫోటోలు వైరల్..
-
Ravi Teja: ఇద్దరు బ్యూటీలతో మాస్ మహారాజా రొమాన్స్.. సినిమా వచ్చేది అప్పుడే?
-
RK Roja: బుల్లి తెరపై మళ్లీ రీ ఎంట్రీ.. ఆ ఛానెల్లో ప్రసారమయ్యే షోకు జడ్జ్‌గా రోజా