Ravi Teja: ఇద్దరు బ్యూటీలతో మాస్ మహారాజా రొమాన్స్.. సినిమా వచ్చేది అప్పుడే?

Ravi Teja:
మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. హీరోగా రాణిస్తున్నాడు. కష్టం మీద ఇండస్ట్రీలో ఉంటూ ఈ రోజు టాప్ హీరోల్లో ఒకరిగా ఉన్నాడు. మాస్ మహారాజా సినిమాలు అంటే కామెడీ పక్కాగా ఉంటుంది. అయితే గతేడాది మిస్టర్ బచ్చన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ ఇప్పుడు మాస్ జాతర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వస్తుందనే విషయాన్ని మూవీ టీం ఇంకా ప్రకటించలేదు. ఇటీవల రవితేజ పుట్టిన రోజు సందర్భంగా మూవీ టీం జాతర సినిమా గ్లింప్స్‌ను విడుదల చేసింది. గ్లింప్స్ అయితే అదిరిపోయాయి. అయితే ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీలను తీసుకున్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ సినిమాలో మరో ట్రెండింగ్ హీరోయిన్లు కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రేమలు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మమితా బైజు ఈ సినిమాలో రవితేజ సరసన కనిపించబోతున్నట్లు సమాచారం. అలాగే డ్రాగన్ మూవీతో నేషనల్ క్రష్‌గా మారిపోయినా కాయదు లోహర్ కూడా రవితేజ సరసన రొమాన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. శ్రీలీలను ఔట్ చేసి వీరిద్దరిని తీసుకున్నారా.. లేకపోతే శ్రీలీల ఉండగానే వీరిద్దరిని తీసుకున్నారా? మరో కొత్త మూవీలో వీరిని తీసుకున్నారా అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.
మాస్ జాతర సినిమా రవితేజ కెరీర్‌లో ఇది 75వ చిత్రం. అయితే ఈ సినిమా తర్వాత రవితేజ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. నేను శైలజ, చిత్రలహరి సినిమాలతో హిట్ కొట్టిన కిషోర్ రవితేజతో చేయబోతున్నాడు. ఈ సినిమా టైటిల్‌ను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అనార్కలి అని టైటిల్ పెట్టారట. అయితే ఈ సినిమాలోనే మమితా బైజు, కాయదు లోహర్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. డ్రాగన్ మూవీతో కాయదు బాగా బిజీ అయ్యింది. టాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈమె డేట్స్ కోసం దర్శకుడు వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం కాయదు చేతిలో అరడజను సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వక్ సేన్ సినిమాలో కూడా కాయదు లోహర్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ కాయదుకి మంచి క్రేజ్‌ను తీసుకొచ్చింది. గతంలో శ్రీవిష్ణుతో ఓ మూవీ కూడా కాయదు చేసింది. కానీ ఈ సినిమా తనకు అంత పాపులారిటీని ఇవ్వలేదు. రిటర్న్ ఫ్ ది డ్రాగన్ మాత్రం తనకు బెస్ట్ ఆఫర్లను ఇచ్చింది. అయితే మమితా బైజు, కాయదు లోహర్ చూడటానికి ఇద్దరూ కూడా ఒకేలా ఉంటారు. చాలా మంది సోదరులు అని కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మరి వీరిద్దరిలో ఒకరిని తీసుకుంటారో లేకపోతే ఇద్దరినీ తీసుకుంటారో అనే విషయం మూవీ ప్రకటిస్తేనే తెలుస్తుంది.